koodali

Monday, March 31, 2014

ఓం,

ఓం,

దైవానికి  అనేక  వందనములు,



సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన  పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.



అందరికి శ్రీ  జయ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.



వసంత  నవరాత్రులు  ప్రారంభమయ్యాయి.



మహారాష్ట్రీయులు  ఏ  శుభకార్యక్రమము  ప్రారంభించిన  ప్రప్రధమమున  శ్రీ  గణపతి దేవునితో  సహా  నవగ్రహాలు, ముఖ్యముగా  శనేశ్వరుణ్ణి  పూజించటము  అనాదిగా  వస్తున్న  సుసంప్రదాయము.



 చైత్రశుద్ధ  ప్రతిపాదా  (  గుడిపాడువ  )   అంటే  ఉగాది  పర్వదినమున శని శింగణాపూర్  లో  విశేష  ఉత్సవాలు  జరుగుతాయట.



నూతన  సంవత్సరములో  ఆటంకాలు, అవరోధాలు,  కష్టనష్టాలు తొలగించి  సుఖశాంతులు  ప్రసాదించుమని  ఆ  కరుణాలవాలను భక్త  సముదాయము  శిరోధార్యులై  వేడుకుంటారట. 



అందరికి   శ్రీ  జయ నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలండి.





1 comment:

  1. ఎప్పటిలానే చాలామంది తమ బ్లాగుల ద్వారా ఉగాది శుభాకాంక్షలను తెలియజేసారు.

    నాకు , కొందరి బ్లాగ్స్ కు వెళ్ళి శుభాకాంక్షలను తెలియజేయాలని అనిపించింది.

    అయితే, కొందరి బ్లాగులకు వెళ్లి శుభాకాంక్షలను తెలియజేస్తే మిగతా వారు ఏమైనా అనుకుంటారేమోననే ఉద్దేశంతో ....

    ప్రత్యేకంగా ఎవరి బ్లాగ్ కు వెళ్ళి శుభాకాంక్షలను తెలియజేయకుండా నా బ్లాగ్ నుంచే అందరికి శుభాకాంక్షలను తెలియజేసాను.

    అంతేనండి. దయచేసి ఎవరూ అపార్ధం చేసుకోరని ఆశిస్తున్నాను.

    ReplyDelete