koodali

Tuesday, March 25, 2014

యువత సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవటాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

కొందరు  విద్యార్ధులకు  చదువు  అయిపోయిన  వెంటనే  ఉపాధి  దొరకదు.   కొందరు   ఇంజనీరింగ్  చదివిన  విద్యార్ధులు   ఉపాధి  లభించక  ఇంట్లోనే  ఉంటున్నారు. 

 ఇంట్లో   ఏం  చేయాలో  వాళ్ళకు  తెలియదు.  కొన్నాళ్ళు  ఆ  కోర్సులు,  ఈ  కోర్సులు  నేర్చుకున్నారు. గంటల  తరబడి   లాప్ టాప్  ముందేసుకు  కూర్చుంటే  ఇంట్లో  వాళ్ళు   కోప్పడతారు. 

.......................................

ఇక  చేసేదేమీ  లేక  కొందరు  స్నేహితులు  కలసి  సిటీకి  వెళ్ళి  ఏదైనా  చిన్న  ఉద్యోగంలో  చేరాలని  నిర్ణయించుకుంటారు. 

వాళ్ళ  వద్ద  సొంతంగా  డబ్బు  ఉండదు  కదా  !  పెద్దవాళ్ళు  ఇచ్చిన  డబ్బు  తీసుకుని  సిటీకి  బయలుదేరతారు.

 ఒక  గది  అద్దెకు  తీస్కుని  అందులో  ఉంటారు.  పిల్లలు  అనగానే  ఒక్క  గది   కూడా  బోలెడు  అద్దె  చెబుతారు  యజమానులు. 

ఇక  ఉపాధి   కోసం  నిరంతర  అన్వేషణ  మొదలవుతుంది.  ఇంటి  నుంచి  తెచ్చుకున్న  డబ్బు  ఎక్కడ  అయిపోతుందో  అనే  భయంతో   డబ్బు  చూసిచూసి  వాడుకుంటారు.

 హోటల్  భోజనం  అయితే  బోలెడు  డబ్బు  అవుతుందనే  భయంతో...  రూములో   అన్నం  వండుకుని  కర్రీ  పాయింట్  వద్ద  కూరలు  తెచ్చుకుంటారు.

  అన్నం  ఎక్కువ  కలుస్తుందని  ఎక్కువగా  పప్పుకూరను  తెచ్చుకుంటారు.  ఇంట్లో  అమ్మ  వండే  భోజనం  రుచి  పదేపదే  గుర్తొస్తుంది.

 పదేపదే    సొంత  ఊరికి  వెళ్ళాలంటే  చార్జీలు  అవుతాయని  అప్పుడప్పుడూ  మాత్రమే  వెళ్ళివస్తుంటారు.

..........................................

ఉద్యోగం  ఎప్పుడొస్తుందో  తెలియదు. అలా  తిరగగా  తిరగగా  ఒక  చిన్న  కంపెనీలో  ఉద్యోగాలు  దొరికాయి.  తక్కువ  జీతమే  అయినా  ఎంతో  సంతోషం  వేసింది  మిత్రులకు. తమ  సొంత  సంపాదన  కదా  !


తరువాత  వారికి  పెద్ద  కంపెనీలో  ఎక్కువ  జీతంతో  ఉద్యోగాలు  వచ్చాయి.  దైవం  దయ  వల్ల   కధ   సుఖాంతం  అయింది.

...................................................

     పిల్లలు  ఉద్యోగం  దొరకక  ఖాళీగా  ఇంట్లో  ఉంటే  తల్లితండ్రి  కోప్పడకూడదు.  వాళ్ళకు  ఉపాధి  లభించేవరకూ  వాళ్ళు  అడగకపోయినా  అవసరమైనంత  డబ్బును  పంపించాలి.  


 ( ఎక్కువ  డబ్బు  ఇస్తే  పిల్లలు   చెడ్డ అలవాట్లు  నేర్చుకుంటారేమోననే భయంతో  కొందరు  పెద్దవాళ్ళు  ఎక్కువ  డబ్బును  ఇవ్వరు.  అయి తే,  బయటకెళ్ళి  బతకాలంటే  డబ్బు  అవసరం .....    ఈ రోజుల్లో    బయట    భోజనం చేయాలన్నా  ఎంతో  ఖర్చు  అవుతుంది  కదా ! ....  ఇవన్నీ  పెద్దవాళ్ళు  ఆలోచించాలి . )


పిల్లలు  కూడా  మొహమాటపడకుండా  తల్లితండ్రిని  డబ్బు  అడగాలి.  పెద్దవాళ్ళ  దగ్గర  మొహమాటపడితే  ఎలా ?  


ఉద్యోగాలకు  అప్లై  చేయటానికి  అప్లికేషన్స్  వాటికి  కూడా  కొంత  డబ్బు  అవసరమవుతుంది  కదా !


....................................

నిరుద్యోగులుగా   ఉన్న  పిల్లలతో   పెద్దవాళ్ళు   ఆప్యాయంగా  మాట్లాడాలి.  వారికి  ధైర్యాన్ని  చెప్పాలి.

 లేకపోతే,  ఇలాంటి  సమయంలో  నిరాశానిస్పృహల  వల్ల  యువత   మత్తుపదార్ధాలకు  అలవాటు  పడే  అవకాశాలు  కూడా  ఉన్నాయి.  అందుకే  తల్లితండ్రి  జాగ్రత్తగా  చూసుకోవాలి.

ఎంతో   కొంత  డబ్బు  ఉన్న  వారి  పిల్లల  పరిస్థితే  ఇలా  ఉంటే .... ఇక  పేదవారి  పిల్లల  పరిస్థితి  ఎలాగుందో  భగవంతునికే  తెలియాలి.

......................................


ఈ  దేశంలో  బడా  పారిశ్రామిక  సంస్థలకు  కోట్ల  కొద్దీ  రుణాలు  ఇస్తారు  కానీ,  నిరుద్యోగులైన  యువకులు  కొందరు  కలిసి    చిన్న , మధ్య  తరహా  పరిశ్రమలను   ఏర్పాటు  చేసుకోవటానికి    రుణాలు  అడిగితే  సవాలక్ష  ప్రశ్నలతో  వేధిస్తారు. 

యువత  సొంతంగా    ఉపాధి   ఏర్పాటు  చేసుకోవటాన్ని    ప్రభుత్వాలు  ప్రోత్సహించాలి.

....................................


దేశంలో  రాజకీయ  పార్టీలకు  ఎన్నికల్లో  గెలవటం,   సీట్లు  సంపాదించటం  ..ఇదే  గోల.  స్వాతంత్ర్యం  వచ్చి  ఎన్నో  ఏళ్ళు  గడిచినా  దేశంలో  ఇన్ని  సమస్యలు ఉండటం  ప్రజల  ఖర్మ.

..............................................

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు...




1 comment:

  1. విదేశాలలో యువత కొందరు ఉపాధి లభించేంత వరకూ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటారని అంటారు.

    అయితే ఈ పద్ధతి కొంతవరకూ మంచిదే కానీ, తల్లితండ్రి పేదవారైతే ఈ పద్ధతిని అవలంబించవచ్చు.

    తల్లితండ్రి పేదవారు కానప్పుడు తల్లితండ్రి వద్ద డబ్బు తీసుకోవటానికి మొహమాటపడి ........యువత ఉపాధి లభించేంత వరకూ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకోవటం వల్ల కొన్ని నష్టాలూ ఉన్నాయి.

    ఉదా.. రకరకాల కారణాల వల్ల, ఉన్నత చదువులు చదవటానికి కుదరక చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ క్రమంగా ఉన్నతస్థానానికి రావాలనుకునే బడుగు జీవులు మన దేశంలో చాలా మంది ఉన్నారు.

    డబ్బున్న కుటుంబాల యువత కూడా చిన్నచిన్న ఉద్యోగాల కోసం వస్తే...... బడుగు వర్గాల వారి ఉపాధికి కష్టాలు వస్తాయి.

    అందువల్ల ఎంతోకొంత డబ్బున్న వారి పిల్లలు వారి ఖర్చులకు సరొపడా డబ్బును తల్లితండ్రుల వద్ద తీసుకోవటమే మంచిది.

    ReplyDelete