koodali

Wednesday, December 4, 2013

విలువలను నేర్పవలసిన పెద్దవాళ్ళే....


ఈమధ్య   యువత  చెడు  అలవాట్లకు  బానిసలవటం  గురించి  తరచుగా  వింటున్నాము.  నా  ఉద్దేశంలో   ఈ  విషయంలో   తప్పు  సమాజంలోని  పెద్దవాళ్ళదే ..... అనిపిస్తుంది.

  పిల్లలకు  నైతిక  విలువలను  నేర్పవలసిన  పెద్దవాళ్ళే  నైతికవిలువలను  పాటించటం    తగ్గిపోయింది.  


మద్యపానం  చేయటం  మంచినీళ్ళు  తాగినట్లు  మామూలైపోయింది. 

డబ్బు  సంపాదించటం  కోసం  ఎన్ని  చెడ్డపనులైనా  చేస్తున్నారు.  


ఒక  ప్రక్క  నీతులు  చెబుతూ  ఇంకో  ప్రక్క    చేతలలో  అధర్మంగా  ప్రవర్తిస్తున్నారు.

  నీతులు  చెబుతూనే  ....  సమాజాన్ని  తప్పుదారి  పట్టించే  విధంగా    చిత్రాలను,  కధలను   తీసి  సమాజమ్మీదికి  వదిలేవారి  సంఖ్య  ఎక్కువయ్యింది.


వర్తకులు  విపరీతమైన  లాభాల  కోసం  ధరలను  విపరీతంగా  పెంచేస్తున్నారు. 


ఉదా...  కొందరు  దళారుల  అత్యాశ  వల్ల   గిట్టుబాటు  ధర  లభించక  రైతులూ  నష్టపోతున్నారు.   రేట్లు  విపరీతంగా  పెరిగి  వినియోగదారులూ  నష్టపోతున్నారు.


 ధర్మబద్ధం  కాని  సంపాదన  వల్ల  కష్టాలు   కలుగుతాయని  పెద్దలు  తెలియజేశారు.


ఒక  ప్రక్క  దైవానికి  ఇష్టం  లేని  పనులు  చేస్తూనే    ....మరొక   ప్రక్క    పాప  పరిహారం  కొరకు     పూజలు  చేయటం   వల్ల     సత్ఫలితాలు  రావని   గ్రహించాలి.


ఇప్పటి  సమాజంలో  ఎన్నో  ఆకర్షణలు  ఉన్నాయి.  

చుట్టూ  ఉన్న  ఎన్నో  ఆకర్షణల  మధ్య   కూడా  దృఢంగా  నిలబడి  నైతికవిలువలకు    విలువనిస్తున్న   యువత  కూడా  ఉన్నారు.  


ఇలాంటి    ఉన్నతమైన , దృఢమైన....వ్యక్తిత్వాన్ని   కలిగి  ఉన్న    యువత  ఎంతో  అభినందనీయులు. 



1 comment: