koodali

Monday, January 7, 2013

పిల్లల హక్కులు...పెద్దవాళ్ళ హక్కులు.

 
*ఈ  మధ్య విదేశాల్లో  , తమ  పిల్లవాడిని  కొట్టారని  తల్లితండ్రులను  శిక్షించిన  సంఘటన  గురించి  విన్నాం.  ఆ  పిల్లవాడు స్కూల్  వాన్లో  మూత్రవిసర్జనను  ఆపుకోలేకపోవటం  వల్ల , విషయాన్ని  స్కూల్  వాళ్ళు  చెప్పటం ...తల్లితండ్రులు  పిల్లవాడిని   దండించటం  జరిగిందని  వార్తలు  వచ్చాయి. ( అసలు  ఏం  జరిగిందో  మనకు  సరిగ్గా  తెలియదు.  )


* పిల్లలు   అలా   చేయటానికి ఎన్నో కారణాలుండవచ్చు.   పిల్లలకు  ఏదైనా  అనారోగ్య సమస్య   ఉన్నప్పుడు కూడా   టాయిలెట్ కు   వెళ్ళేలోపు  ఆపుకోలేకపోతారు.    ఇలాంటప్పుడు వైద్యులను సంప్రదించి   ట్రీట్మెంట్ చెయ్యించాలి.  అంతేకానీ,  పిల్లలను   కొట్టటం    తప్పు.



* కొన్ని  స్కూల్స్ లో కూడా , అర్జంట్ గా   బాత్రూం కు  వెళ్ళాలని   పిల్లలు  ప్రాధేయపడినా , కొందరు  టీచర్లు  పర్మిషన్  ఇవ్వరు.   పాఠం పూర్తయిన   తరువాత  మాత్రమే  వెళ్ళటానికి  పర్మిషన్ ఇస్తారు.   అంతవరకు  ఆపుకోలేని పిల్లలు  క్లాస్ రూంలోనే   మూత్రవిసర్జన  చేస్తారు.    అప్పుడు మళ్ళీ  పిల్లల్నే చితకబాదుతారు  టీచర్లు.



*  కొందరు    ఆకతాయి పిల్లలు టాయిలెట్ పేరు చెప్పి బయటకు వెళ్ళి   కాలక్షేపం చేసే మాట నిజమే కానీ, అటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని , నిజంగా టాయిలెట్ కు వెళ్ళవలసిన అవసరం ఉన్న విద్యార్ధులను  కూడా ఆపటం న్యాయం కాదు కదా ! 



* కొన్ని సార్లు విపరీతమైన ట్రాఫిక్ వల్ల, స్కూల్ నుంచి ఇంటి కెళ్ళేవరకూ   కాలకృత్యాలను ఆపుకోలేని పిల్లలకు కూడా   ఇలా జరిగే   అవకాశం ఉంది. ఇలాంటప్పుడు   పెద్దవాళ్ళదే  తప్పు  కదా  ! స్కూల్  బస్  లో  కూడా 
టాయిలెట్  సౌకర్యం  ఉండాలి. 


* కొన్నిదేశాల్లో అయితే ,   పెద్దవాళ్ళు కూడా   నాప్కిన్స్  వేసుకుంటారట.
( లోకల్ ట్రైన్స్ లో   టాయిలెట్స్   ఉన్నా కూడా,  టాయిలెట్ కు   వెళ్ళటానికి కూడా   వీలులేనంత రష్ ఉంటుందట ట్రయిన్స్లో. )



* ఈ అబ్బాయి కేసులో తల్లితండ్రులను   జైల్లో పెడితే , మరి ఆ బాబును ఎవరు చూసుకుంటారు ? ఆ పిల్లవాడు   తల్లితండ్రులు  కావాలని   ఏడిస్తే   ఏం  చేస్తారు ?      పిల్లవాడికి తల్లితండ్రులను దూరం చేయటం కూడా పిల్లల హక్కుకు భంగం కలిగించటమే కదా !



* నిజంగా పిల్లలను శాడిజంగా హింసించే తల్లితండ్రులను జైల్లో పెట్టవలసిందే. కానీ, ఈ తల్లితండ్రులు తాత్కాలిక ఆవేశంలో పిల్లవాడిని శిక్షించారే కానీ, అబ్బాయి అంటే ప్రేమ ఉన్నవారిగానే కనిపిస్తున్నారు. దీనిని  మొదటి తప్పుగా భావించి, తల్లితండ్రులను విడిచిపెడితే బాగుంటుందనిపిస్తోంది. 



*  మనదేశంలో  అయితే,  సమావేశాలంటూ  స్కూల్  పిల్లలను   గంటలతరబడి  ఎండలో  నిలబెట్టేస్తారు. కొన్నిసార్లు    రోడ్ల   వెంబడి  ఊరేగింపులంటూ   తిప్పుతారు.   ఆ  సమయంలో   పిల్లలకు  టాయ్ లెట్ కు  వెళ్ళటానికి  కూడా  అవకాశం  ఉండదు.  అంతసేపు   ఎండలో  నిలబడి ,  నడిచి ,   పెద్దవాళ్ళు  చెప్పే  స్పీచులు   వినలేక  పిల్లలు  కళ్ళుతిరిగి  పడిపోతారు  కూడా. 



* చదువు  పేరుతో  గంటల  తరబడి  కూర్చోబెట్టి,  ప్రపంచంలో  జరిగే   విషయాలన్నీ   పిల్లల  మెదళ్ళలో  కూరటం  వల్ల    కూడా,   పిల్లలకు  ఆటలాడుకునే  సమయం  లేక,  తమ  బంగారు  బాల్యాన్ని  కోల్పోయి , యంత్రాల్లా  తయారవుతున్నారు.



*  పిల్లలను  పెంచటానికి  కూడా  సమయం  లేని  తల్లితండ్రులు ,  ఏడుస్తున్న   చంటిపిల్లలను  కూడా  క్రెచ్లో  వదిలి  వెళ్తారు . 



* తల్లితండ్రులతో  కలిసి  జీవించటం  పిల్లల  జన్మహక్కు....  అయితే,  తల్లితండ్రులు  తమలోతాము కొట్లాడుకుని  విడిపోవటం  వల్ల  పిల్లలకు  ఆ  ఆశ  తీరదు. ఇలాంటివాళ్ళు   విడాకులు  తీసుకోవటంతో  ఆగకుండా,  తమకు  నచ్చిన  వాళ్ళను  మళ్ళీ  పెళ్ళి  చేసుకుని ,  పిల్లలకు   కొత్త  తల్లితండ్రులను  తెస్తారు. ఇది  పిల్లలను  మానసికంగా  ఎంత  బాధ పెట్టినా  పట్టించుకోరు. 



*  పిల్లలు  స్కూల్  నుంచి   ఇంటికి  వెళ్ళగానే , సొంత  అమ్మకు  బదులు  కొత్త  అమ్మ,  సొంత నాన్నకు  బదులు  కొత్త  నాన్న  ఉంటే....  ఆ  బాధ  ఎలా  ఉంటుందో  ఊహించుకుంటేనే  బాధగా  ఉంటుంది. ఆడపిల్లలు  ఉన్న తల్లి    మళ్ళీ  పెళ్ళి  చేసుకుంటే , వచ్చే  కొత్తనాన్న  వల్ల ,  ఆ  పిల్లలకు  కొత్తరకం  సమస్యలు  వచ్చే  అవకాశం  కూడా  ఉంది. 



* ఇలా.... ఈ  రోజుల్లో  ఎందరో   పిల్లలు  ఎన్నో  కష్టాలను  అనుభవిస్తున్నారు.  పిల్లల  భావాలకు  సమాజంలో  విలువ  ఇస్తున్నట్లుగా  అనిపించటం  లేదు.   పెద్దవాళ్ళు తమ హక్కులను  గోల చేసి సాధించుకుంటారు.  పిల్లలకూ హక్కులుంటాయి. అని అందరూ గుర్తించాలి.




4 comments:

  1. మీరు చెప్పినవి నూటికి నూరుపాళ్ళు నిజం,ఆలోచన తగ్గి ఆవేశం పెరిగిపోతోంది జనంలో.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరన్నట్లు , ఆలోచన తగ్గి ఆవేశం పెరిగిపోతోంది జనంలో.
    .........

    ఈ మధ్య జరిగిన రేప్ కేస్ విషయంలో బాధితులు రోడ్డు ప్రక్కన పడి ఉంటే , చూసిన వాళ్ళల్లో ఎవ్వరూ కనీసం దుప్పటి వంటిది కూడా కప్పలేదట.

    చూసిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెబితే ఆమె బ్రతికేదేమో ?
    ( ఒకవేళ ఫోన్ చేసారేమో? మనకు తెలియదు. )

    ReplyDelete
  3. పిల్లవాడిని తండ్రి బెల్టుతో కొట్టాడని, తల్లితండ్రులు ఇద్దరూ కలిసి ఆ పసిబాలుడికి వాత పెట్టారని సాక్ష్యంలో తెలిసింది. అటువంటి నరరూపరాక్షసుల బారి నుండి పిల్లలను కాపాడడమే న్యాయం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు , పసిబాలుడిని ఇలా చేయటం అన్యాయం.

      ఏంటో అంతా దురదృష్టం. వాళ్ళ స్వయంకృతాపరాధం.

      Delete