koodali

Monday, January 21, 2013

సమాజం కూడా , న్యాయంగా సంపాదించిన సొమ్ముతో జీవిస్తున్న వారిని గౌరవించటం నేర్చుకోవాలి.

 
ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
.............................

*  కాలేజీల్లో  చదివి  బయటకు  వచ్చిన   తరువాత   చాలాకాలం  ఉద్యోగాలు  రాకపోతే , యువకులు  ఎంతో  నిరాశానిస్పృహలకు  లోనవుతారు . 

*  ఇలాంటప్పుడు వారి  మనస్తత్వం  ఎలా   ఉంటుందంటే,   ఇంటాబయటా  అందరూ  తమను  తక్కువగా  చూస్తున్నారని  ఫీలవుతుంటారు.   అందరూ  తన  నిరుద్యోగాన్ని  వేలెత్తి చూపినట్లుగా  భావించి  మానసికంగా  క్రుంగిపోతారు.


 ఉదా... తల్లితండ్రి ,అబ్బాయిని  షాప్ కు వెళ్లి   ఏమైనా సరుకులు  తెమ్మని  అడిగితే,  తాము ఉద్యోగం  లేక   ఖాళీగా  ఉన్నాము  కాబట్టే , ఇంట్లో  వాళ్ళు  పనులు  చెబుతున్నారు,  అనుకుని  పెద్దవాళ్ళమీద  విసుక్కునే  అవకాశముంది.

 (పిల్లలు  చదువుకునే  రోజుల్లో విసుక్కున్నా కూడా అప్పటి  విసుగుకి, ఇప్పటి విసుగుకి  తేడా ఉంటుంది.)

* ఇలాంటప్పుడు,  ఇంట్లోని  పెద్దవాళ్ళు  పిల్లలను  తిరిగి  విసుక్కోకుండా,  వాళ్ళ   మానసిక  పరిస్థితిని  అర్ధం  చేసుకుని ,  వాళ్ళకు  మానసికస్థైర్యాన్ని  అందించాలి. వాళ్ళకు  సరైన  సూచనలను,  సలహాలను   తెలియజేసి  సరైనదారిలో  నడిపించాలి.


* యువకులు  కూడా  కుటుంబంలోని   పెద్దవాళ్ళను   అపార్ధం  చేసుకోకూడదు.


*  మనదేశంలో  కొందరు  యువత   ఉద్యోగం  దొరకకపోతే,   వేరే  రంగాలలో   ఉపాధిని  పొందటాన్ని  నామోషీగా  భావిస్తారు.   అంత  చదువు  చదివి  వేరే  పనులు  చేయటమెలా ?  అనుకుంటారు.  ఇలా  అనుకోకూడదు.

*  భారతదేశంలో   ఉన్నతస్థానాలలో  ఉన్న  వాళ్ళలో,  పేదరికం  నుంచి  ఎంతో  కష్టపడి  ఉన్నత  స్థానాలకు  వచ్చిన  వాళ్ళెందరో  ఉన్నారు. 


* నా  అభిప్రాయం  ఏమిటంటే,  ఏ  పనీ  తక్కువది  కాదు.  అన్ని  పనులూ  గొప్పవే. 


*  యువత  తమకు  ఉద్యోగం  దొరకనప్పుడు  డీలా  పడిపోకుండా   ధైర్యంగా   నిలదొక్కుకోవాలి. మేం  ఎక్కువగా  చదువుకున్నాం  కదా  ! తక్కువ  ఆదాయం  వచ్చే  ఉద్యోగాన్ని  లేక  వ్యాపారాన్ని  లేక  వ్యవసాయాన్ని  లేక  చేతి  వృత్తులను   చేస్తే  ఎవరైనా  నవ్వుతారేమోననే  భావజాలాన్ని  విడనాడాలి. 


* తల్లితండ్రి  కూడా ,  పిల్లలు  ఎక్కువ  జీతం  వచ్చే  ఉద్యోగమే  చేయాలని  కండిషన్స్  పెట్టకూడదు.


* భారతదేశం  నుంచి  విదేశాలకు  వెళ్ళిన  వారిలో  కొందరు ,  అక్కడ  ఇతరత్రా  చిన్న  ఉద్యోగాలను  చేస్తూ  డబ్బు  సంపాదించుకుంటూ  కూడా  చదువుకుంటారట. 


* పురాణేతిహాసాల్లో  గొప్పగొప్ప  వాళ్ళే  ఎన్నో  పనులను  చేసారు. హరిశ్చంద్రుడు  అంతటి  మహారాజే  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.  నేను   గొప్ప  చక్రవర్తిని  కాటికాపరిగా  ఎందుకు  చేయాలి  ?  అని  ఆయన  వెనక్కి  తగ్గలేదు.   సత్యవాక్కు  కోసం  ఆయన  రాజ్యభోగాలను  విడిచిపెట్టి  కాటికాపరిగా  విధులను  నిర్వహించారు.


*  శ్రీరాముడు  సాధారణ  వ్యక్తిగా  అడవుల్లో  జీవించారు. ......తాను  గొప్ప  రాజ్యానికి  యువరాజును  మరి,  సామాన్యుడిగా  ఎందుకు  అడవుల్లో  కష్టాలు  పడాలి  ?  అని  వెనక్కితగ్గలేదు. 


* పాండవులు  వనాల్లో  సాధారణంగా  జీవించారు,   కొంత కాలం  విరాటుని  కొలువులో  సామాన్య  వ్యక్తులుగా  ఉద్యోగాలను  చేసారు.  


*  అంత   గొప్పవాళ్ళే   పరిస్థితులు  అనుకూలించనప్పుడు  సాధారణజీవితాలను  గడిపారు. వాళ్ళనుంచి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  


*  సమాజం కూడా  ఎంతో  మారాలి.  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  విలాసంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటాన్ని  మానుకోవాలి.   న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  సాధారణంగా  జీవిస్తున్న  వారిని  గౌరవించటం  నేర్చుకోవాలి.


*  అన్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పంచభక్ష్యపరమాణ్ణాలను  తినే  వారికన్నా , న్యాయంగా  సంపాదించిన  సొమ్ముతో  పచ్చడి  మెతుకులు  తినే  వారే  గొప్పవారు.



9 comments:

  1. Nijame! Nijayitee ki asamardhata ane ardham pulimi avamaninchadam ee rojullo sadharanam ayindi. Tama tama paridhilo lanchalu gunji rendesi mudesi illu, illali vantiki bangaru todugu cheyiste vadu samardhudi kinda lekha. Vadito polustu nijayiteeparulani avamaninchadam chala sarlu chusanu nenu. Ilantivi generalga intlo bharyalu, leda talli tandrula nunche modalavtayi. Porugu varino bandhuvulano chupi tama varini chinnatanam cheyadam. Idi chala pramadakaram. Intiloni poru intinta kadaya annaru vemana. Deeni valla society lo kasto kusto migilina nijayitee kuda manta kalisipotundi.
    Kalyani

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, మీరు చెప్పినట్లు, నిజాయితీకి అసమర్ధత అనే అర్ధం పులిమి అవమానించడం ఈ రోజుల్లో సాధారణం అయింది.

      Delete
  2. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. ఈ విషయంలో నేటి తల్లితండ్రులదే అసలు కధ, అసలు దోషులు వాళ్ళే, వాళ్ళు మారాలి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, మీరు చెప్పినట్లు,ఈ విషయంలో నేటి తల్లితండ్రులదే అసలు కధ, అసలు దోషులు వాళ్ళే, వాళ్ళు మారాలి.

      Delete
  4. చాల చక్కటి విషయాలను తెలిపారు అనూరాధ గారు.

    ReplyDelete
  5. సమాజం కూడా ఎంతో మారాలి. అన్యాయంగా సంపాదించిన సొమ్ముతో విలాసంగా జీవిస్తున్న వారిని గౌరవించటాన్ని మానుకోవాలి. న్యాయంగా సంపాదించిన సొమ్ముతో సాధారణంగా జీవిస్తున్న వారిని గౌరవించటం నేర్చుకోవాలి.

    Chala baaga chepparu..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete