koodali

Friday, October 12, 2012

స్త్రీలు మరియు సమాజ సంక్షేమం....స్త్రీ, పురుషుల బాధ్యత..


ఇప్పటి    సమాజంలో ఎంతసేపూ  సంపాదన,  పోటీ  ప్రపంచంలో  దూసుకుపోవటం .... ..ఇదే  గోల  కానీ,   పడిపోతున్న  నైతికవిలువల  గురించి   ఆలోచిస్తే    విచారించవలసిన    పరిస్థితి  ఉంది.
 
ఈ  రోజుల్లో ,  స్త్రీల  పట్ల  జరుగుతున్న    అత్యాచారాలు,  అన్యాయాలు  గురించి    వార్తల  ద్వారా  వింటున్నాము,  చూస్తున్నాము.

ఈ  మధ్య  ఒక  పత్రికలో ,....  చిన్నపిల్లలు,  వృద్ధులు  అనే  తేడా  లేకుండా    స్త్రీల  పట్ల   జరుగుతున్న  నేరాలు,  ఘోరాల  గురించి  రాసారు.  అవన్నీ  చదివితే,   సమాజం  ఎటు  పోతోందో  ? నాగరికత  పెరిగిందో ?  తగ్గిందో ? అర్ధంకాలేదు. కమల్ హాసన్ మరియు  ఇతర  నటీనటులు   నటించిన   మహానది ? అనే  సినిమాలో   చిన్న  వయస్సున్న  అమ్మాయిలను  కూడా  వ్యభిచార  గృహాలకు  తరలించటం,  వారి  కష్టాలను  గురించి  హృదయవిదారకంగా   చూపించారు. 



 సమాజంలో  ఇలాంటి  సంఘటనలు    జరగటానికి  ఎన్నో  కారణాలున్నాయి..అయితే,    మనుషుల్లో   నైతికవిలువలు    తగ్గిపోవటం  ఒక  ముఖ్యమైన  కారణం .


  స్త్రీ,  పురుషులకు  వివాహాలు  ఆలస్యంగా  జరగటం,  వివాహం  జరిగినా  వివిధ  కారణాలతో  భార్యాభర్తలు  విడిగా  ఉండటం,   భార్యాభర్తల  మధ్య  విభేదాలు,  విడాకులు ...ఇవన్నీ  కూడా    అక్రమసంబంధాలు,  వ్యభిచారం  వంటివి  పెరగటానికి  కారణాలు  కావచ్చు . అనిపిస్తోంది.  



మతం  పేరుతో  కూడా  కొందరు   దురాచారాలను  ప్రోత్సహిస్తున్నారు.   జోగిని  .....వంటి  ఆచారాలు సమాజంలో  ఎప్పుడు , ఎలా ,    ప్రవేశించాయో  నాకు  తెలియదు  కానీ,  ఇప్పుడు  ఆ  పేరుతో  జరుగుతున్న  కొన్ని  దురాచారాలను   గురించి  వింటుంటే,   ఈ  దురాచారాలను  నిర్మూలించవలసిన  అవసరం  ఎంతైనా  ఉందనిపిస్తోంది .



ఈ  రోజుల్లో,  తమ  హక్కులు,  తమ  సుఖమే  తమకు  ముఖ్యం  అంటూ   చిన్న  చిన్న  కారణాలకే   వివాహాలను  విచ్చిన్నం  చేసుకుంటూ  కుటుంబాలను,  సమాజాన్ని  అస్తవ్యస్థం  చేస్తున్న  కొందరు స్త్రీలు, పురుషుల  కంటే ,  ఓపికగా  కుటుంబాలను  తీర్చిదిద్దుకుంటూ  సమాజంలో  కుటుంబవ్యవస్థను  నిలబెడుతున్న  త్యాగమూర్తులైన  స్త్రీలు,  పురుషులు  ఎంతో  గొప్పవారు.  



  సమాజం  మంచిగా  ఉండే  విషయంలో   స్త్రీల  పాత్ర  ఎంతో  ఉంది. పిల్లలను  పెంచే  విషయంలో  తల్లుల  పాత్ర  ఎంతో  ఉంటుంది  కదా  !  తల్లులు  తమ  పిల్లలకు  చిన్నప్పటి  నుంచీ     చక్కటి  నైతికవిలువలను  బోధిస్తూ  పెంచితే ,  పిల్లలు  చక్కటి  వ్యక్తులుగా  తయారయ్యే  అవకాశం  ఉంది. చక్కటి    వ్యక్తిత్వం  కలిగిన  వ్యక్తుల  వల్ల  సమాజంలో  ఎన్నో    నేరాలు  , ఘోరాలు , సమస్యలు   తగ్గుతాయి.  



 అయితే  దురదృష్టవశాత్తూ  ఈ  రోజుల్లో చాలామంది   తల్లులకు  కొన్ని  కారణాల  వల్ల పిల్లలను  దగ్గరుండి  పెంచుకునేంత  సమయం    ఉండటం  లేదు. తల్లి  మాత్రమే  కాకుండా   తండ్రి  యొక్క  ప్రభావం  కూడా  పిల్లలపై  ఎంతో  ఉంటుంది. భర్త  యొక్క  ప్రభావం  భార్యపై  కూడా  ఎంతో  ఉంటుంది. 



 భర్త  తన  కుటుంబాన్ని  చక్కగా  ఆప్యాయంగా  చూసుకుంటే  భార్య  కూడా మనశ్శాంతిగా    కుటుంబాన్ని  చక్కగా  చూసుకుంటుంది.  భర్త   తన  ఇష్టం  వచ్చినట్లు  తాను  తిరుగుతుంటే  భార్య  ఆ  మనోవ్యధతో  పిల్లలను  సరిగ్గా  పట్టించుకోదు.  ఇక  సంసారం  తద్వారా  సమాజమూ  అస్తవ్యస్తమైపోతాయి.

భార్యాభర్తలు  అన్యోన్యంగా  ఉంటే  సంసారం  మరియు  సమాజం  కూడా  బాగుంటుంది.


పూర్వం  భార్యలు  తమ  భర్తలు  ఎన్ని  అవలక్షణాలను   కలిగి  ఉన్నా,  ఓర్పుతో  వారిని  మార్చుకోవటానికి  ప్రయత్నించేవారు.  అందువల్ల    ఆ  భార్య   కొన్ని   కష్టాలను   పడినా,   కుటుంబానికి,  సమాజానికి   మేలు  జరిగేది.   క్రమంగా  భర్త  మంచిగా  మారే  అవకాశం  కూడా  ఉండేది.    ఇలాంటి  భార్యలను గురించి  వింటే   వారికి   చేతులెత్తి  మొక్కాలనిపిస్తుంది.

భార్యల  వల్ల  బాధలు  పడుతూ ,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఓపిగ్గా ఎదురు చూస్తూ     భార్యను , కుటుంబాన్నీ  చక్కదిద్దుకునే   భర్తలూ   ఉంటారు. ఇలాంటి  భర్తలను  గురించి  వింటే   వారికి   చేతులెత్తి  మొక్కాలనిపిస్తుంది. 

భార్యాభర్తలు  గొడవలు  పడి  విడిపోవటం  వల్ల  ఆ  ప్రభావం  కుటుంబం  పైనా   సమాజం  పైనా  కూడా  ఉంటుంది.



ఇంకా,   తల్లిదండ్రుల  పెంపకమే  కాకుండా  స్నేహితుల  ప్రభావం,  సమాజంలోని  ధోరణులు  కూడా    పిల్లల  ప్రవర్తనపై  ఎంతో  ప్రభావాన్ని  చూపిస్తాయి.  ఈ  రోజుల్లో  మీడియా  రంగం  యొక్క  ప్రభావం  సమాజంపై  ఎంతో  ఉంది.  తల్లితండ్రులు  ఎన్ని  నైతిక  విలువలను  బోధించినా,  సమాజంలో   వ్యాపిస్తున్న  పెడధోరణుల  వల్ల  పిల్లలు  దారి  తప్పే  అవకాశం  ఉంది.



 కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్,  కొన్ని  కధలు  ,  సెల్ ఫోన్స్,  అంతర్జాలం  ద్వారా  అందుబాటులో  కొచ్చిన  అసభ్య  సమాచారం  యొక్క   ప్రభావం , సమాజంపై   ఉంది  కాబట్టి,   ఇలాంటి  అసభ్య  సమాచారానికి  అడ్డుకట్ట  వేయాల్సిన   అవసరం  ఎంతో    ఉంది.  



 అసభ్యకరమైన  విషయాలతో  సమాజాన్ని  కలుషితం  చేసి ,తద్వారా  సంపాదించిన ధనంతో  తాము  తమ  కుటుంబాలు 
బాగుపడిపోవాలనుకోవటం  అన్యాయం   కదూ! ఇలాంటి  అసభ్యకరమైన  సమాచారాన్ని  సమాజంపై  వదిలేవారికి , ఒకవేళ  సమాజం  శిక్షను  విధించలేకపోయినా  ,  వారికి  తగ్గ  శిక్షను   దైవం    విధిస్తారు.


 ఇంకా,  మత్తు  పదార్ధాల  వినియోగం  వల్ల  కూడా  సమాజానికి  ఎంతో  నష్టం  జరుగుతోంది. ఎన్నో  జీవితాలు  అతలాకుతలమై  పోతున్నాయి. ఇలాంటివాటిని  అమ్మేవారికి ,  ప్రోత్సహించేవారికి,   ఒకవేళ  సమాజం  శిక్షను  విధించలేకపోయినా  ,  వారికి  తగ్గ  శిక్షను   దైవం    విధిస్తారు.


కొందరు   సహృదయులైన    స్త్రీలు    సంస్థలను  ఏర్పాటు  చేసి ,  అన్యాయానికి  గురవుతున్న  స్త్రీలకు  సహాయపడటం  ఎంతో  గొప్ప  విషయం.  


  అందరూ  తలుచుకుంటే  సమాజంలో  నైతికవిలువలను  పెంపొందించటం,  చక్కటి  సమాజాన్ని  ఏర్పరుచుకోవటం  సాధ్యమయ్యే  పనే.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
...................................................

ఈ  బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలండి.
.............

9 comments:

  1. వనజగారు మీరు ఇలా దండయాత్ర చేస్తున్నారే! బాగు బాగు. వింటే ఆనందమే.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. మీరు పదే పదే స్రీ, పురుషులు సమానం అని రాయటం ఎమీ బాగా లేదు. మొగవారు స్రీలతో సమానం ఎలా అవుతారు? స్రీకి చెమటపట్టకుండా,టేన్షన్ లేకుండా, పైసా కష్ట్టపడాకుండా చాలా మార్గలలో నుంచి డబ్బులు వచ్చిపడతాయి. ఆ సౌలభ్యం మగవారికి లేదు. మీరేమి ఆడవారి గురించి దిగులు పడకండి. పేపర్లో అలా రాస్తూంటారు. వారికొచ్చిన డోకాఎమీలేదు. మగ వారికి జరిగే అన్యాయాలు గురించి రాయటం మొదలు పేడితే పేపర్ లు చాలావు, అలా అని ఎక్కడైనా ,ఎవరైనా రాస్తున్నారా?


    'అతడే' దుర్బలుడు పెరిగిన పురుషుల బలవన్మరణాలు
    గత ఏడాది వివిధ కారణాలతో మన రాష్ట్రంలో 15077 మంది ఆత్మహత్య
    చేసుకున్నారు. వారిలో 10120 మంది పురుషులు. 4957 మంది మహిళలు! హైదరాబాద్ వంటి మహా నగరంలోనూ స్త్రీల కంటే కూడా ఎక్కువ మంది పురుషులు చిన్నపాటి ఒత్తిడులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్త్రీలు అబలలని, చిన్నపాటి సమస్యలను సైతం ఎదుర్కొనే శక్తి లేక అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని అంటుంటారు. కానీ, నేటి ఆధునిక మహిళ కఠిన సమస్యలను సైతం ఎదుర్కొని మనో ధైర్యంతో ముందుకు సాగుతోంది. అదే సమయంలో, అన్నింటా మేమే ముందు అని భావించే పురుష పుంగవులు క్షణికావేశానికి లోనవుతున్నారు .

    చిన్నపాటి చిక్కులను సైతం పరిష్కరించుకోలేక సున్నిత మనసుతో అర్ధంతరంగా అసువులు బాస్తున్నారు. అశక్తులు, అబలలుగా భావించే మహిళలు జీవిత పరమార్థం తెలుసుకుంటుంటే, చిన్న చిన్న మనస్పర్థలకే మనసు చలించి మగమహారాజులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదే సమయంలో, 14 ఏళ్లలోపు బాలబాలికల విషయంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. తెలిసీ తెలియని కౌమార దశలో ఉన్న బాలికలు మిడిమిడి జ్ఞానంతో ఆవేశానికి లోనై చిన్న వయసులోనే ఊపిరి తీసుకుంటున్నారు. 2011 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

    * రాష్ట్రంలో గత ఏడాది 14 ఏళ్లలోపు ఉన్న 255 మంది బాల బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో బాలురు 112 మంది, బాలికలు 143 మంది.
    * 15-29 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిలో మొత్తం 5112 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 2828 మంది యువకులు. 2284 మంది యువతులు.
    * 30-44 ఏళ్ల మధ్య 3551 మంది పురుషులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇదే వయసులో దుర్మరణం పాలైన స్త్రీల సంఖ్య 1555.
    * 45-59 ఏళ్ల మధ్య 2710 మంది పురుషులు అఘాయిత్యాలకు పాల్పడి తనువు చాలించగా, స్త్రీల సంఖ్య 663!
    * 60 ఏళ్ల పైబడిన వృద్ధుల్లోనూ ఇదే పరిస్థితి. పురుషులు 919 మంది,
    స్త్రీలు 312 మంది దుర్మరణం పాలయ్యారు.
    * రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. నగరంలో 14
    ఏళ్లలోపు బాలురు ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా, బాలికలు 17 మంది. 15-29 ఏళ్ల మధ్య వయస్కుల్లో 155 మంది పురుషులు, 123 మంది స్త్రీలు అర్ధంతరంగా తనువు చాలించారు. 30-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో స్త్రీలు 81 మంది, పురుషులు 130 మంది బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. 45-59 మధ్య వయసున్న హైదరాబాదీయుల్లో పురుషులు 111 మంది, స్త్రీలు 36 మంది చనిపోయారు. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో 426 మంది పురుషులు ఆత్మహత్య చేసుకుని మరణించగా, 278 మంది స్త్రీలు బలవన్మరణం చేసుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఠాగూర్ సినిమా ??

      Delete
    2. Yes true to the best of my knowledge and belief, I sware

      Delete
  3. స్త్రీలైనా పురుషులైనా ఇలా చనిపోవటం ఎంతో బాధాకరమైన విషయమండి.

    ReplyDelete
  4. చాలా వివరంగా చర్చించారు.
    పెద్దల హెచ్చరికలు లేక పోవడం కూడా కొంత సమస్యకు కారణం

    ReplyDelete
    Replies

    1. శశి కళ గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి. కొందరు పెద్దలు, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించటం లేదు.

      Delete
  5. మళ్ళి మీరు స్రీలైన, పురుషులైనా అని రాస్తున్నారు. పురుషులు ఎక్కువ చని పోతుంటే వారికి ఎక్కడ సింపతి వస్తుందో అని దాని తీవ్రతను తగ్గించటానికి మీరు స్రీల పదం పెడుతున్నారు. ప్రపంచంలో జరిగే కష్టాలకి స్రీలు పేటంట్ తీసుకొన్నారా ఎమీటి? మగవారికి జరిగే అన్యాయలతో పోలిస్తే 20% కూడా ఉండదు, స్రీలకి జరిగే అన్యాయలు. కాని వారికి వచ్చే సానుభూతి సంగతి తెలిసిందే!
    ఒక్కసారి ఇలా ఊహించండి 10వేల మంది మగవారు ఆత్మహత్యలు ప్రతిరోజు సం|| పొడుగునా పేపర్లో వస్తుంటే దానిని చదువుతూంటే ప్రజలపైన/ పాఠకులపైన దాని ప్రభావం ఎలా ఉంట్టుంది? అదే సం|| ఒకసారి ఇలా నివేదికను ప్రచూరిస్తే ఎలా ఉంట్టుంది. ఈ నివేదికను ఒకసారి చదివి మరచిపోతారు. అదే ఆడవారి విషయానికి ఒక రేప్ జరిగితే వారం పొడూనా దాని విషయాలను కవర్ చేసి, సమాజంలో వారికి ఎంతో అన్యాయం జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తారు. గత దశాబ్ద్ద కాలం గా రైతుల ఆత్మహత్యలలో ఎన్ని లక్షల మంది మగవారు చనిపోయారు? ఎక్కడైనా, ఎవరైనా రాశారా? హర్యానలో జరుగుతున్న వాటిపైన మీడీయా వారు అదేదో కొత్త విషయమైనట్లు అదేపని గా గగ్గోలు పెట్టటం చూస్తున్నాం కదా?

    ReplyDelete