koodali

Friday, March 30, 2012

కష్టకాలములో అండగా......



శ్రీ సాయిబాబా జీవితచరిత్రము గ్రంధములో ఈ విధముగా చెప్పబడినది.

సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను........


ఎవరయితే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృపవల్ల మాయాశక్తి బారి నుండి తప్పించుకొందురు.................

పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఒకప్పుడు అతడనేక కష్టములు పాలయ్యెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు.


ఒకప్పుడు అతని స్థితి చాల హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయనిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండుమాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను.


కొన్ని అడుగుల దూరమున ఒక హోటలుండెను. దాని యజమాని సగుణమేరునాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను పిలచి అక్కల్ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా ? అని అడుగుచూ పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కధ వచ్చెను. ...........


అక్కల్ కోట్ కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను.

బాధను సహించలేక నిరాశచెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. ...........

గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మమెత్తి , బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు ? గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు ? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము .


సమయోచితమయిన ఈ కధను చదివి , అంబాడేకర్ చాలా ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో అతను చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును , దయాళుత్వమును చూచి అంబాడేకర్ కు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృడమయ్యెను.


అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రి వలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృధ్ధి పొందెను.


జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడపెను..


ఈ కధలను చాలా మంది చదివే ఉంటారు. కాని మర్చిపోతూంటాము. కష్ట సమయములలో ఇలాంటి భక్తి కధలను గుర్తు తెచ్చుకొంటే ధైర్యముగా ఉంటుంది. . . ..

.......................

టపా ఇంతకు ముందు వేసినదేనండి.

2 comments:

  1. బాగుందండీ! భగవంతునిపై నమ్మకం ఉన్నా లేకున్నా.. సమస్యలు ఉన్నప్పుడు.. ఇలాటి కథలు ధైర్యాన్ని ఇస్తాయి. కొంత ఓర్పు ,మరికొంత యోచన ,దైర్యం ఉంటె చాలు. కలకాలం ఉండవులే కన్నీళ్లు,కలలైనా,కలతైనా కొన్నాళ్ళే!గుర్తుకు వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు సమస్యలు ఉన్నప్పుడు.. ఇలాటి కథలు ధైర్యాన్ని ఇస్తాయి

      . పురాణేతిహాసాల్లో కూడా సీతారాములు, హరిశ్చంద్రుడు వంటి ఎందరో గొప్పవారు ఎన్నో కష్టాలను అనుభవించారు.

      ధర్మం కోసం, సత్యం కోసం వారు తమ జీవితాలనే త్యాగం చేశారు. అందుకే వారు ఆదర్శమూర్తులయ్యారు అనిపిస్తుందండి.


      సముద్రములు, నదులు దాటునపుడు మనము ఓడ నడపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలెను.......అని షిర్ది సాయి బాబా వారు అన్నారు.


      నిజమే మనము ఒక వాహనచోదకుడిని { డ్రైవర్ } బాగా నమ్ముతాము. కానీ ......దైవాన్ని నమ్ముతున్నామా ? అనిపించి ఇంతకు ముందు ఒక టపా వ్రాసానండి.
      ..................................

      . మనము స్వధర్మమును నిష్కామముగా ఆచరిస్తూ , ఫలితమును భగవంతునికి అర్పించాలని పెద్దలు తెలియజేశారు. ఒక జనక మహారాజు , ఒక శుక యోగి లాంటి గొప్పవాళ్ళు చరిత్రలో కనిపిస్తారు. మనకు అంత లేకపోయినా ....... అందులో ఆవగింజంత అమలుపరచినా మన బ్రతుకులు బాగుపడతాయి కదా...




      భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఆయన తలచుకుంటే కానిదేముంటుంది. ఇక్కడ ఒక విషయం నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అన్ని విషయాలు తెలిసికూడా మనమెందుకు ........ దైవం పైన భారం వేసి , ప్రశాంతంగా బ్రతకలేక , ప్రతిదానికి ఆందోళన పడిపోతాము అని ?



      ఉదా......ఒక పంఖా ను { ఫాన్ } చూడండి. అది బాగా వేగంగా తిరుగుతున్నప్పుడు పడిపోతుందేమో అనిపిస్తుంది. అవి బోల్టులు ఊడి పంఖాలు క్రింద పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినా మనకు ఫాన్ అవసరం కాబట్టి భయం ఉన్నా చేసేదేమీ లేక హాయిగా నిద్రపోతాము.



      ఇలాగే ఇంకో ఉదా..ఎప్పుడైనా రాత్రిపూట రహదారిపై కారులోగాని, బస్సులో గానీ ప్రయాణించేటప్పుడు ,చూడండి. ఆ వాహన చోదకుడు {డ్రైవర్ } ఒక లిప్త పాటు కళ్ళు మూసుకుంటే చాలు , ప్రమాదం జరగటానికి. ఇలా చాలాసార్లు ప్రమాదం తృటిలో తప్పటం మనకందరికి అనుభవమే అయ్యుంటుంది. భయంగా ఉన్నా, కొంచెంసేపు మెలకువగా ఉండి ఇక చేసేదేమీ లేక , అలసటతో నిద్రపోతాము కదా.



      ఇలాంటప్పుడు పెద్దలు చెప్పింది గుర్తుకొస్తుంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం , రెప్పపాటు జీవితమ్ ....... అని అయితే ఇక్కడ వాహన చోదకుడు కన్ను తెరిస్తే వాహనంలో అందరికి జననం, వారు కన్ను మూస్తే అందరికీ మరణం అయ్యే అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి.



      సరే ఈ విధంగా ఒక ఫాన్ ను, ఒక డ్రైవర్ ను నమ్మి నిద్రపోయినప్పుడు, సర్వశక్తిమంతుడైన ఆ దైవాన్ని నమ్మి మనం ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఎందుకు ఉండకూడదు ? అలా గనక మనము ఉండగలిగితే జీవితములో ఎంతో ప్రశాంతత ఉంటుంది.



      మన శక్తికొలది ధర్మమును పాటిస్తూ, ఫలితాన్ని ఆ దైవానికి వదిలిపెట్టి, మనం ఆందోళన లేకుండా ఉండగలిగితే ఎంతో ఉత్తమం.


      ఒకోసారి మనం ఏమీ చేయలేని విధముగా పరిస్థితులు చుట్టుముడతాయి. కనీసం ఇలాంటప్పుడైనా గాభరాపడి గుండెనెప్పి తెచ్చుకోకుండా నిబ్బరంగా ఉండటానికి పైవిధంగా ప్రయత్నించాలి.



      అయితే మనకు తెలుసు. ఇదంతా చెప్పినంత తేలిక ఎంతమాత్రం కాదు అని. ఇలాంటి మానసిక ధృఢత్వం రావాలన్నా భగవంతుని కృప తప్పక ఉండాలి అని.


      ఆ దైవాన్ని ప్రార్ధించగా, ప్రార్ధించగా ఎప్పటికైనా ఆ స్థితి వస్తే ఎంతో అదృష్టవంతులం. . ....

      Delete