koodali

Monday, March 12, 2012

కొన్ని విశేషాలు....విషయాలు......



ఈ రోజు ఉదయం T.T.D . .వారి చానల్లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ఉపన్యాసం ప్రసారం అయ్యింది. వారు చతురాశ్రమ ధర్మాలను గురించి ఎన్నో విశేషాలను అద్భుతంగా తెలియజేశారు. .

..........................

ఇంకో విషయంలోకి వద్దాము....

మా మామ గారికి అత్తగారికి నేనంటే అభిమానమే. . మా మామగారి యొక్క తల్లి గారు కొద్దికాలం క్రిందటి వరకూ జీవించే ఉన్నారు. ఆమె కూడా నేనంటే అభిమానంగా ఉండేవారు. .


పెద్దవాళ్లతో మంచిగా ఉంటే వారి ఆశీర్వాదాలు లభించి .... పిల్లలకు మంచి జరుగుతుందని  నాకు జీవితంలోని కొన్ని అనుభవాల ద్వారా తెలిసింది.

అయితే , నేను పెద్దవాళ్ళతో మంచిగా ఉండటాన్ని కొందరు బంధువులు ఎలా అర్ధం చేసుకున్నారంటే, ఆస్తిలో ఎక్కువ వాటా రావటం కోసమే నేను పెద్ద వారిని అలా కాకా పడుతున్నానని కామెంట్ చేసారట. .


ఈ విషయాలు మా అత్తగారు మామగారే మాతో చెప్పారు. చూశారా ! లోకం ఎంత చిత్రమైనదో ! అయితే ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోకూడదు .(ఎదుటి వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటే చూడలేని వారు లోకంలో చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మేము అనుకున్నాము..)


ఈ విషయాలను బ్లాగులో వ్రాయటం నాకు ఇష్టంలేదు. కానీ , మనుషులు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో, ఎలా అపార్ధం చేసుకుంటారో తెలియటానికి  ఇదంతా వ్రాయవలసి వచ్చింది.



ఈనాటి పిల్లలను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, పెద్దవాళ్ళు ఆస్తిపాస్తులను పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళు తమ అవసరాలకూ  కొంత భాగాన్ని అట్టేపెట్టుకోవాలి అనిపిస్తుంది.
........................

ఇంకో విషయంలోకి వద్దాము....

ఈ రోజుల్లో నడుస్తున్న కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని విషయాలను వ్రాద్దామనుకుంటున్నాను.


మనిషికి పుట్టినదగ్గర నుంచి చనిపోయేవరకూ ఇతరులతో సర్దుకుపోవటం, జీవితంలో రాజీపడటం తప్పదు.

ఉదాహరణకు .. చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఆకలి వేసి ఏడ్చినా తల్లి వచ్చి పాలు పట్టేవరకూ వేచి ఉండక తప్పదు.


వృద్ధులైన తరువాత ఓపిక లేక ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. అప్పుడూ ఇతరులతో అడ్జస్ట్ అవ్వవలసే ఉంటుంది.


ఇక నడి వయసులో ఇంటా బయటా ఎందరితోనో అడ్జస్ట్ అయితేనే జీవితం సాగుతుంది.


ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు అడ్జస్ట్ అవలేక విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్నారు. కానీ వారు ఇతరులతో అయినా అడ్జస్ట్ అయ్యే జీవించవలసి ఉంటుంది.


ఉదాహరణకు.. ఒకామె తన భర్తతో విడిపోయి ఉద్యోగం చేసుకుని జీవిస్తుంది అనుకుందాము. ఆమె తన ఇంట్లో పనిచేసే పని అమ్మాయితో అడ్జస్ట్ అవ్వక తప్పదు.


ఎందుకంటే , ఇంటి పనిచేసే అమ్మాయి మనం చెప్పిన సమయానికి వస్తుందన్న నమ్మకం లేదు. మనం చెయ్యమన్న పనీ సరిగ్గా చేస్తుందన్న నమ్మకం లేదు.


అయినా వారిని గట్టిగా ఏమీ అనటానికి లేదు. గట్టిగా కోప్పడితే పని మానేస్తారు కదా !  అందుకని వేళకు రాకపోయినా, చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోయినా 
నోరు మెదపకుండా భరించవలసి వస్తుంది మరి .

ఇక ఆఫీసులో పై అధికారులు ఏమైనా కోప్పడినా , నిశ్శబ్దంగా భరించాలేగానీ నోరెత్తితే ఉద్యోగం ఊడిపోతుంది. కదా !


తోటి ఉద్యోగులు ఏమైనా కామెంట్ చేసినా మనసులో తిట్టుకోవటమే కానీ .... పైకి వాళ్ళని ఏమీ అనలేరు.


మగవాళ్ళ పరిస్థితీ డిటోనే.

ఇలా బయట అందరితోనూ అడ్జస్ట్ అయినప్పుడు  భార్య భర్తలు అహం తగ్గించుకుని ఒకరితోఒకరు సర్దుకుపోతే వారికీ , ఇంట్లో అందరికీ  జీవితం సుఖంగా ఉంటుంది కదా !


బైటవాళ్ళ వల్ల ఎంత బాధ కలిగినా వాళ్ళను ఏమీ అనలేని మగవాళ్ళు ఇంటికొచ్చి తమ కోపాన్ని, చిరాకును భార్యా, పిల్లల మీద చూపిస్తారు. వాళ్ళయితే
నోరు మెదపకుండా ఉంటారని .


ఆడవాళ్ళేమో తమ కోపాన్ని ,చిరాకును పిల్లల మీద ప్రదర్శిస్తారు. ...... . వాళ్ళయితే ఎదురు చెప్పలేక
నోరు మెదపకుండా ఉంటారని .


ఇలా ప్రతివాళ్ళు తమకన్నా చిన్న వారిపై తమ కోపాన్ని ప్రదర్శిస్తారు..


నేను భర్త మాట ఎందుకు వినాలి ? అని ప్రశ్నించే స్త్రీలు ..... తమ పిల్లలు మాత్రం తమ మాట తప్పక విని
తీరాలనుకుంటారు...

 మేము పెద్దవాళ్ళ మాట ఎందుకు వినాలని పిల్లలు ప్రశ్నిస్తే ?


ఇలా ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుటుంబం ... తద్వారా సమాజం అస్తవ్యస్తమవుతుంది.(ఇప్పుడు జరుగుతోంది అదే.)

 
కుటుంబసభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే , ఇల్లు అన్నాక  ఆర్ధిక సమస్యలు, బంధువులతో సమస్యలు,......ఇలా అనేక సమస్యలు ఉంటాయి.


అందుకే కుటుంబసభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ..బయట వారికి ఈ సమస్యలు ఉండవు . కాబట్టి , బయటివారితో గొడవలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ..


అంతేకానీ ఇంట్లో వాళ్ళకన్నా బయటి వారు గొప్పవాళ్ళేమీ కాదు. వారికీ వారింట్లో అలాగే సమస్యలు ఉంటాయి.

అయితే బయటి వారి విషయంలో అందరమూ మర్యాద పాటిస్తాము. .....బయటవాళ్ళ మీద కోపమొచ్చినా ఓర్చుకుంటాము.


ఇంట్లో వాళ్ళ మీద కోపమొస్తే ఓర్చుకోము ..... వాళ్ళని చెఢామఢా తిడతాము.
అందుకే కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి...

2 comments:

  1. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మళ్ళీ చదివితే టపాలో ఆవేశం పాళ్ళు ఎక్కువైనట్లు అనిపించి ...... నాకే నచ్చలేదు. అందుకని కొన్ని పదాలను మార్చానండి..

      Delete