koodali

Friday, March 23, 2012

అందరికి ఉగాది శుభాకాంక్షలండి.


ఓం.

అందరికి శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఆనందంగా ఉండాలని దైవాన్ని కోరుకుంటూ అందరికీ శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి.

షడ్రుచుల ఉగాది పచ్చడి రుచిగా బాగుంటుంది.

జీవితంలో సుఖం వచ్చినప్పుడు అతిగా పొంగిపోకుండా అంతా దైవం దయ అనుకోవాలి............. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా కష్టాల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి.


పెద్దలు ఏం చెపుతున్నారంటే సుఖాలు అనుభవించటం ద్వారా మనం సంపాదించుకున్న పుణ్యాలు ........... ఖర్చయి పోతాయట. . కష్టాలు అనుభవించటం ద్వారా మనం చేసిన పాపాలు ............. ఖర్చయి పోతాయట. .( తగ్గిపోతాయి. .)


అందుకని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా పాపభారం తగ్గిపోతోందని మనల్ని మనం ఓదార్చుకుంటూ ముందుకు సాగిపోవాలి.

పుణ్యాల బేలన్స్ తరిగిపోకుండా ఉండాలంటే మన జీవితము లో ఎప్పుడూ పుణ్యాలు చేస్తూనే ఉండాలి..

ఉగాది పచ్చడిలో వేపపువ్వు చేదుగా ఉన్నా..........శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. చేదు శరీరంలోని చెడు క్రిములను చంపి మనకు మంచి చేస్తుందట.

అలాగే జీవితంలో వచ్చే చిన్నచిన్న కష్టాల వల్ల ..............మనకు జీవితతత్వం బోధపడి మంచి జరుగుతుంది.

అంతా దైవం దయ. ....

3 comments:

  1. ఏది జరిగినా మంచికే అనుకుంటే పోలా? గత సంవత్సర బాధలన్నీ అక్కడే వదిలేసి ఆనందంగా మొదలుపెట్టండి! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ ! వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      అయితే ఇలా ఆలస్యంగా జవాబిస్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి.

      మీ వ్యాఖ్యను ఈ రోజే చూసానండి.

      మీరు మీ కుటుంబసభ్యులు, మరియు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి.

      Delete
    2. రసజ్ఞ గారూ !

      మీరు మీ కుటుంబసభ్యులు, మరియు అందరూ ఆనందంగా ఉండాలని దైవాన్ని కోరుకుంటూ శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి.

      Delete