koodali

Wednesday, March 21, 2012

ఎన్నో మహిమలు.......



భౌతిక శాస్త్రం , జ్యోతిషం వంటి విషయాల గురించి చెప్పాలంటే ....


ఉదాహరణకు ..
శారీరిక నిర్మాణం గురించి చెప్పాలంటే కొంచెం సులభంగా చెప్పగలరు. ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి.

మరి మనస్సు నిర్మాణం గురించి ఆలోచనలు ఎలా తయారవుతాయి ? వంటి విషయాల గురించి
చెప్పాలంటే అంత సులభంగా చెప్పలేరు.మనసు ప్రత్యక్షంగా కనిపించదు కాబట్టి.
...........................

లోకంలో భౌతికశాస్త్రానికి అంతుచిక్కని, అర్ధం కాని విషయాలు , ఎన్నో ఉన్నాయి.

కొందరు దైవము, మహిమలు ఇలాంటివన్నీ లేవంటారు కదా ! ఈ ప్రపంచంలో మానవ మేధకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.

ఈ భూమి మీది రహస్యాలు తెలుసుకోవటానికే మనకు ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక అనంత విశ్వంలోని రహస్యాలు , కోటానుకోట్ల నక్షత్రాల గురించి తెలుసుకోవటం అసలెప్పటికీ సాధ్యం కాదు....

ప్రాచీనులు ఎన్నో మహిమల గురించి చెప్పటం జరిగింది.

మహిమలు అంటే కేవలం విభూతి సృష్టించటం ఇలాంటివి మాత్రమే కాదండి.  యోగులు కొందరు అణిమాది సిధ్ధులను పొందినవారు ఉన్నారట. శరీరాన్ని చిన్నదిగా , పెద్దదిగా చెయ్యగలగటం, పరకాయ ప్రవేశం, ఆకాశ గమనం, ఒక దగ్గర మాయమయ్యి  ఇంకొక దగ్గర ప్రత్యక్ష మవ్వటం , దూరశ్రవణం, దూరదృష్టి కలిగిఉండటం ఇలా  ఎన్నో శక్తులు ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధించిన వారు ఉన్నట్లు ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

మహా భారతంలో సంజయుల వారు భారతయుధ్ధం జరుగుతున్న విధానాన్ని .. ఎంతో దూరం నుంచీ చూసీ, అక్కడ జరిగే సంభాషణలు వినీ ..ధృతరాష్ట్రుల వారికి కళ్ళకు కట్టినట్లు వివరించారు అని అంటే ..ఇదంతా అభూత కల్పన. ..... దూరం నుంచీ యుధ్ధం జరగటం చూడటం ఎలా సాధ్యం ? అని ఎగతాళి చేసిన వారు ఎందరో ఉన్నారు .


మరి ఇప్పుడు టి.విలు, ఫోన్లు వచ్చాక దూరశ్రవణం, దూరదృష్టి అసాధ్యం కాదని తేలిపోయింది కదా !


.. ప్రపంచంలో సైన్స్ కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో ఇలాంటి మహిమలు స్వయంగా చూసినవారు చెప్పిన మహిమల యొక్క విశేషాలు ఎన్నో ఉన్నాయి.


Mahavatar Babaji గారి శిష్యులు శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు.

Lahiri Mahasayulu ఒక మహా యోగి ,.వారు రాముడు అనే ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించిన విషయం ..గురించి....


ఆహారం తీసుకోకుండా ఎన్నో ఏళ్ళు జీవించిన ఒక మహా సాధ్వి గురించి. . ఇలా ఎన్నో వివరాలు ఆ గ్రంధములో చెప్పబడ్డాయి.


ఒక యోగి ఆత్మ కధలో పెద్దలు అన్ని మతముల యొక్క గొప్పతనమును గురించి చెప్పటం జరిగింది. హిందు, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బౌధ్ధం , ఇలా అన్ని మతములు గొప్పవే. ఎందుకంటే అందరి దైవం ఒక్కటే కాబట్టి.


అన్ని మతములలోను ఎన్నో మహిమలు చూపినవారు ఉన్నారు. ప్రపంచములో దైవశక్తి యొక్క గొప్పదనము ఇలాంటి వాటి ద్వారా నిరూపించబడుతుంది. 

ఒక యోగి ఆత్మ కధలో ఎన్నో మహిమల గురించి చెప్పబడింది.

Yogini Giri Bala....( గిరిబాల ) అనబడే ఒక సాధ్వి ఆహారం స్వీకరించక ఎన్నో సంవత్సరములు గడిపినారట. దాని గురించి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటారంటే ..... మానవుడు ఆత్మ అని నిరూపించటానికి , ఇంకా అతడు దివ్యమైన ప్రగతి సాధించటం ద్వారా , అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించటానికి .. అని చెప్పటం జరిగింది. .


కాణిపాకం లో కొలువున్న స్వయంభు వరసిద్ధి శ్రీ వినాయక స్వామి వారు పెరగటం గురించి అందరికీ తెలిసిందే.

ఇంకా, కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్య క్షేత్రంలో పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది.... ఆ నందీశ్వరుని చుట్టూ కొంతకాలం క్రితం వరకూ కూడా .. భక్తులు ప్రదక్షిణలు చేయటానికి స్థలం ఉండేదట.


అయితే ఆ నందీశ్వరుడు పెరుగుతుండటం వల్ల  ఇప్పుడు అక్కడ ప్రదక్షిణ చేయటానికి అవకాశం లేనంతగా  నందీశ్వరుడు పెరగటం జరిగింది. మేము కూడా ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నాము.


ఈ విగ్రహమూర్తులు ఇలా పెరగటం దైవమహిమే.

.Cheiro ..అనే ఆయన హస్తసాముద్రికం చెప్పటంలో ఎంతో ప్రసిద్ధులు.

Scientific Miracles in Hindu Scriptures..must see!! - Religious
....................

ఈ రోజుల్లో కొందరు భక్తి పేరుతో ప్రజలను మోసం చేయటాన్ని, భక్తి పేరుతో మూఢత్వం పెరగటాన్ని ఖండించవలసిందే.......కానీ ఇలా ప్రపంచములో ఎన్నో వింతలు ఉండగా దేవుడు లేడు, మహిమలు లేవు అనటం మాత్రం అన్యాయం.
.

 

 

2 comments:

  1. Ayya! ye foreign miracle choosinaa adi tested and confirmed by doctors or scitists. Mari mana desamlo jarigithenemo, adi konthamandi sadaarana janaalaki mathrame thelustundi. Yevvaroo dani venuka kathenti ani thavvaru. Ade mana inko mahimemoo?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మన దేశంలో కూడా ఇలాంటి పరీక్షలు జరిగాయండి. ఒక సాధువు ఆహారం తీసుకోకుండా చాలా రోజులు జీవించటం గురించి తెలుసుకున్న డాక్టర్లు ఆయనను ఇబ్బంది పెట్టి ( ఒక గదిలో ఉంచి ) కొన్ని పరీక్షలు చేశారు .

      కానీ ఆయన ఆహారం తినకుండా ఎలా ఉండగలుగుతున్నారో వాళ్ళకు అర్ధం కాలేదు..

      Delete