koodali

Monday, August 22, 2011

కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నిన్ననే వచ్చామండి.


తమిళనాడు టూరిజం వాళ్ళది 108 అమ్మవారి దేవాలయముల సందర్శన యాత్ర ఉందండి.

ఈ యాత్ర సంవత్సరానికి ఒక నెల రోజుల చొప్పున , తమిళ ఆడి మాసంలో ఎక్కువగా ఉంటుంది.

నాకు మూడు సంవత్సరాల క్రితం ఈ యాత్ర గురించి తెలుసు. అప్పటి నుంచీ వెళ్ళాలని ప్రయత్నం.

కానీ దైవం దయ వల్ల ఇన్నాళ్ళకు అనుకోకుండా సడన్ గా వెళ్ళిరావటం జరిగింది.

యాత్ర బాగా జరిగింది. మొత్తం 5 రోజుల యాత్ర. .

వారానికి రెండు సార్లు చెన్నై నుంచి యాత్ర మొదలవుతుంది. ( చెన్నై లో మాకు చాలా దగ్గరి బంధువులు ఉన్నారులెండి. .)

యాత్రకు బయల్దేరేముందు నాకు చాలా సందేహాలు కలిగాయి.

అయిదు రోజుల్లో ఇన్ని దేవాలయాలు ఎలా చూపిస్తారు ? బాగా అలసిపోతామేమో ? అని.


కానీ ఒకో రోజు 28 , 20 , చొప్పున ఇలా ముందే ఒక ప్రణాళిక ప్రకారం వీలయినంత వరకు బాగా దర్శనం చేయించారు.

70 ఏళ్ళ వయసు బామ్మగారు కూడా వచ్చారు. ఆమె 5 రోజులు ఎలా యాత్ర చేస్తారో ? అని నాకు అనిపించింది. కానీ , ఆమె చక్కగా అందరితో మాట్లాడుతూ చాలా ఉత్సాహంగా తిరిగారు.

మద్యాహ్నం సమయంలో కొన్ని దేవాలయాల్లో దర్శనం ఉండదు గదా ! అలాంటివి చాలా కొన్ని తప్పితే మిగతావన్నీ బాగా చూపించారు.

ద్యాహ్నం దేవాలయాల్లో దర్శనం ఉండని సమయంలో కొన్నిసార్లు మాకు రెస్ట్ ఇచ్చేవారు. విశ్రాంతి తరువాత బయలుదేరి దేవాలయాలను చూడటం జరిగింది.

యాత్రకు వెళ్ళే ముందు భయపడ్డాను . వానాకాలం కదా ! ఎలా జరుగుతుందో యాత్ర అని.

కానీ, ఒకటిరెండుసార్లు చిరు జల్లులతో కురిసిన వాన తప్పితే, దైవం దయవల్ల యాత్ర మధ్యలో వానలు ఇబ్బంది పెట్టలేదు..

రాత్రి పూట మంచి వసతి సదుపాయం కల్పించారు.

అసలు అంత యాత్ర చేసినా 5 రోజుల సమయం ఎలా గడిచిపోయిందో అలసటే అనిపించలేదు.

ఈ అమ్మవారి దేవాలయాల యాత్ర లో శ్రీరంగం, చిదంబరం, వైదీశ్వరన్ కోయిల్, ఇలా ఎన్నో దేవాలయాలు చూపించారు.

సమయపురం, మేల్ మరువత్తూర్ కూడా చూపించారు.

ఇంకా, చిదంబరం లోని ఒకే దేవాలయ సముదాయంలో పరమ శివుని ఆలయం ఇంకా విష్ణుమూర్తి ఆలయం కూడా ఉన్నాయి.

నాగపట్నం, మధురై వరకూ వెళ్ళాము.

ఇది చదివి మీరు నాకు భక్తి చాలా ఎక్కువ అనుకోకండి.

నిజమైన భక్తి ఉన్నవారు భగవంతునిపై భారం వేసి నింపాదిగా తమ స్వధర్మాన్ని తాము నిష్కామముగా నిర్వహించుకుంటూ ఉంటారు. వారు కష్టాలకు భయపడరు. అని నాకు అనిపిస్తుంది.


నాకు భక్తి ఉంది కానీ ,అంత గొప్ప భక్తి ఇంకా కుదురుకోలేదండి. చాలామంది గొప్ప భక్తులతో పోల్చుకుంటే , కోరికలతో భగవంతుని పూజించే నేనెంత.

నిజం చెప్పాలంటే నాకు భక్తిని ఆడంబరంగా పైకి ప్రదర్శించుకోవటమంటే అంత ఇష్టముండదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి.

కొంతకాలం క్రితం కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక , నాకు వీలయితే ఇలా దేవాలయాలకు వెళ్ళివస్తానని అనుకోవటం జరిగింది.

దైవం దయ వల్ల కష్టాలు తీరాయి కాని దేవాలయాలను దర్శించటం అంత త్వరగా కుదరలేదు.

నాకు అనిపిస్తుంది , అలా కష్టాలు రావటం వల్లనేనేమో ! నేను జీవితంలో వెళ్ళగలనని ఎప్పుడూ అనుకోని అమరనాధ్, వైష్ణవీదేవి యాత్రలు, ఇలా 108 అమ్మవారి దేవాలయాల యాత్ర వంటి వాటి భాగ్యం కలిగిందేమో నని అనిపిస్తుంది.

అదండి సంగతి. అంతా దైవం దయ.. 

 

7 comments:

  1. మీ అయిదు రోజుల 108 దేవాలయాల యాత్ర గురించి ఇంకొంచం వివరంగా వ్రాయండి. కొంచెం రుచి చూపి వదిలేస్తే ఎలా?

    ReplyDelete
  2. బాగా ఉంది. వివరాలు చెప్తే మేమూ వెళ్తాము.

    ReplyDelete
  3. చాలా సంతోషంమండీ!

    మరిన్ని ( ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్లు, మొదలైన ) వివరాలు తెలుపగలరు.

    మేము ఈ సంవత్సరం తమిళనాడు యాత్ర చేద్దామనుకున్నాము, కానీ కుదరలేదు. వచ్చేసంవత్సరం ఈశ్వరానుగ్రహం కలిగితే వెళ్లాలనుకుంటున్నాను.

    ReplyDelete
  4. మీతో చిన్న పని బడింది. :)

    ఒక్క సారి నాకు మెయిల్ చెయ్యగలరు

    rajasekharuni.విజయ్@gmail.com

    ReplyDelete
  5. కృతజ్ఞతలండి.
    కొన్ని కారణాలవల్ల త్వరగా జవాబు వ్రాయలేకపోయాను. దయచేసి క్షమించండి.

    ఈ యాత్రలో ఇంకా తంజావూర్ లోని బృహదీశ్వరాలయం చూశామండి.

    ఇంకా శ్రీ రామానుజర్ అన్న వారు నారాయణ మంత్రమును లోకానికి వెల్లడి చేసిన తిరుకోష్టియూర్ దేవాలయమును దర్శనం చేయించారు.

    ఇక్కడి దేవాలయపు పైనుండే రామానుజార్ తనకు గురువు ఉపదేశించిన ,అష్టాక్షర .... నారాయణ మంత్రమును దేవాలయపు పై భాగం వద్ద నిలబడి అందరికి వెల్లడి చేశారట.

    ఈ మంత్రమును ఇతరులకు వెల్లడి చెయ్యకూడదని గురువు గారు హెచ్చరించినా కూడా , తనవలె లోకంలోని ప్రజలందరు కూడా ఉద్ధరింపబడాలని వారు అలా చేశారట.

    ఈ విశేషాలన్నీ చెప్పి , మమ్మల్ని పై భాగానికి తీసుకెళ్ళి చూపించారు.

    ఇంకా పట్టణాల్లోవే కాకుండా గ్రామాలలోని అమ్మవారి దేవాలయములు కూడా చూపించారండి. అలా అన్నీ బాగున్నాయి.

    ఇక యాత్రలో ఆహారం విషయానికి వస్తే తమిళనాడులో సాంబార్ , దోశ రుచి అందరికీ తెలిసిన విషయమే. . అక్కడ పండ్లు కూడా బాగా ఉన్నాయి.

    మొత్తానికి దైవం దయవల్ల అలా యాత్ర బాగా జరిగిందండి..

    ReplyDelete
  6. కృతజ్ఞతలండి.
    కొన్ని కారణాలవల్ల త్వరగా జవాబు వ్రాయలేకపోయాను. దయచేసి క్షమించండి.

    మీరు యాత్ర గురించి ఆలోచించటం సంతోషకరమైన విషయం.

    తమిళనాడు టూరిజం వారు చాలా యాత్రలు నిర్వహిస్తున్నారు.
    మీరు ....... వారి వెబ్ సైట్ లో TTDC package Tour .... pilgrimage Tour . ....ఈ ప్రకారం చూస్తే వివరాలు ఉన్నాయండి.

    " 108 amman Tour " ఇలా చూస్తే ఈ యాత్ర యొక్క వివరాలు ఉన్నాయండి.

    ఇంకా ఈ 108 amman Tour మాత్రం నాకు తెలిసి సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రం నిర్వహిస్తున్నారు.

    అయితే వారు ఏం చెప్పారంటే , ఎవరైనా ఈ యాత్రకు వెళ్ళాలనుకుంటే కనీసం 15 మంది అలా ఒక బృందంగా ఏర్పడి వాళ్ళను అడిగితే సంవత్సరంలో ఎప్పుడయినా వారు ఈ యాత్రను నిర్వహిస్తారట.

    ఈ 108 అమ్మన్ టూరుకు మాత్రం ఆన్ లైన్ లో బుక్ చేసుకునే పద్ధతి లేదు.

    వారి వివరాలు...........
    Tourism Complex,
    No.2,Wallajah Road, Triplicane,
    Chennai-600 002.
    Ph:044-25383333, 25389857, 25384444,25381286
    Ph. 044-25367850 to 54
    Fax : 044-25361385, 25381567
    E-Mail Id :ttdc@vsnl.com ...

    ReplyDelete
  7. కృతజ్ఞతలండి.
    కొన్ని కారణాలవల్ల త్వరగా జవాబు వ్రాయలేకపోయాను. దయచేసి క్షమించండి.

    మీరు యాత్ర గురించి ఆలోచించటం సంతోషకరమైన విషయం.

    తమిళనాడు టూరిజం వారు చాలా యాత్రలు నిర్వహిస్తున్నారు.
    మీరు ....... వారి వెబ్ సైట్ లో TTDC package Tour .... pilgrimage Tour . ....ఈ ప్రకారం చూస్తే వివరాలు ఉన్నాయండి.

    " 108 amman Tour " ఇలా చూస్తే ఈ యాత్ర యొక్క వివరాలు ఉన్నాయండి.
    ఇంకా కొన్ని వివరాలు పైన చెప్పిన విధంగా ఉన్నాయండి.

    ఇంకా కొన్ని ,
    వివరాలు...........
    Tourism Complex,
    No.2,Wallajah Road, Triplicane,
    Chennai-600 002.
    Ph:044-25383333, 25389857, 25384444,25381286
    Ph. 044-25367850 to 54
    Fax : 044-25361385, 25381567
    E-Mail Id :ttdc@vsnl.com .....

    ReplyDelete