koodali

Monday, August 8, 2011

రామసేతు ఆనవాళ్ళు, సముద్రంలో మునిగి ఉన్న ద్వారకా నగరం ఆనవాళ్ళు...........

 
ఓం, రామాయణం ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

సీతారాములు ... ఆదర్శదంపతులు. . కొంతకాలం ముందు రామాయణం గురించి వ్రాసిన టపాలలోని కొన్ని విషయాలను కూడా
ఇక్కడ జత పరుస్తున్నానండి..


సీతారామలక్ష్మణులు తాము రాజభోగాలు వదిలి అరణ్యాలలో కష్టాలు పడుతున్నా... అక్కడి ప్రజలను, మునులను పీడిస్తున్న రాక్షసులను సంహరించి ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించారు.


సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు.
 
ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.


అగ్ని
పరీక్ష గురించి...( నిజమైన సీతాదేవికి బదులు మాయాసీతను రావణుడు తీసుకెళ్ళటం జరిగిందట. అగ్నిపరీక్ష జరిపినప్పుడు అసలు సీతాదేవిని అగ్నిదేవుడు రాములవారికి అప్పగించటం జరిగిందట. ఇవన్నీ రాములవారికి ముందే తెలుసట. )ఇలా నేను ఒక దగ్గర చదివాను.


* ఇక సీతమ్మను అడవులకు పంపించటం. ...అగ్ని
పరీక్ష లో నెగ్గిన తరువాత, సీతాదేవిని ఇంటికి తెచ్చుకున్నా కూడా .. కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు. .

* ఇక్కడ గమనించవలసినది ఏమంటే, ఒక పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు.

*ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....


అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను,... ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు ముందుతరాలవారిని దృష్టిలో ఉంచుకొనే సీతారాములు తమ జీవితంలో అలా త్యాగాలు చేశారనిపిస్తుంది.


రామాయణం జరిగి ఎంతోకాలం గడిచినా ,ఇప్పటి వాళ్ళు కూడా ఆ నాటి వారి ప్రవర్తనను గురించి చర్చిస్తున్నారు కదా !.

ఇవన్నీ ఆలోచించి ముందుతరాలవారిని దృష్టిలో ఉంచుకొనే సీతారాములు తమ జీవితంలో అలా త్యాగాలు చేశారనిపిస్తుంది.


సీతమ్మవారిని అడవులకు పంపిన తరువాత రాములవారు ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా..తాను రాజభోగాలకు దూరంగా సామాన్యంగా జీవించారు .

( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ .! .)..( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా అతి సామాన్యమైన తల్పంపైన శయనించటం లాంటివి.) ( దర్భలతో అమర్చిన శయ్య వంటిది .)


ఇక సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది..
సీతారాముల వియోగం అత్యంత బాధాకరమైన విషయం. ,


రాములవారు సీతాదేవిని , లవకుశులను కలుసుకున్న తరువాత అందరూ అయోధ్యకు తిరిగి వచ్చి సుఖంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.సీతాదేవి భూమాతను ఆశ్రయించకుండా, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నా బాగుండేది అనిపిస్తుంది..


ఇంకా..


ఇప్పుడు లవకుశులతో పాటు సీతాదేవి కూడా రాజ్యానికి తిరిగివస్తే,  ఒకవేళ , మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే ,  అప్పుడు సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,  రాములవారికి ఆ ఇబ్బంది ఎదురుకాకుండా సీతమ్మవారు అలా త్యాగం చేసి ఉంటారు.


*తన ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి.. సీతమ్మది.తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది... ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )

* సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో రాములవారు అంతకన్నా త్యాగమూర్తి. ఇద్దరూ ఆదర్శ దంపతులు.


కొందరు రాములవారు సీతాదేవిని అడవులకు పంపివేశారని అంటారు.
కానీ, అడవులకు రాములవారు పంపలేదు. కొందరు ప్రజలు అన్న మాటల వల్ల తప్పనిపరిస్థితిలో మాత్రమే అలా చేయవలసివచ్చింది.

రాముల వారే అటువంటివారయితే అన్ని కష్టాలుపడి సీతాదేవిని తెచ్చుకుంటారా ?

అశ్వమేధయాగం సందర్భంలో శ్రీరాముని ఇంకో వివాహం చేసుకొమ్మని కొందరు సలహా ఇచ్చినట్లు నేను ఒక దగ్గర చదివాను. కానీ రాములవారు అలా ఇంకో వివాహం చేసుకోలేదు.

ఒక బంగారు సీతాదేవి విగ్రహం తయారుచేయించి ఆ మూర్తినే సీతాదేవిగా భావించి యజ్ఞం పూర్తి చేయించారట.


* అలా సీతాదేవే తన భార్య . అని శ్రీరాముల వారు లోకానికి తెలియచేశారు. సీతాదేవిని అడవులకు పంపినా తన హృదయంలో ఆమె స్థానం ఏమిటో రాములవారు లోకానికి తెలియచెప్పారు.
* రామాయణంలో హనుమంతులవారి పాత్ర ఎంతో గొప్పది.
 
ఇంకా,
ఒక మంధర, ఒక శూర్పణఖ, ఒక రావణుడు .... ఇలాంటి స్వార్ధపరులు, అత్యాశ గలవారివల్ల మంచి వారు ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో మనకు తెలుస్తుంది.

ఇంకా
,
రామాయణం
లో రాములవారు జటాయువుకు అంత్యక్రియలు కూడా నిర్వహించారని నేను ఒకదగ్గర చదివానండి .

ఇంకా, .
గుహునితో అప్యాయంగా స్నేహం చేయటం ద్వారా అందరూ సమానమేనని చెప్పటం, శబరిని అనుగ్రహించటం ద్వారా ప్రేమతో కూడిన నిరాడంబరమైన భక్తి ఉన్నా చాలు , ఆడంబరాలు అవసరం లేదు అని తెలుసుకోవచ్చు.


ధర్మమూర్తి అయిన శ్రీ రాముడు సామాన్యులైన వానరులను వెంటబెట్టుకుని క్రూరులైన రాక్షసులను అంతమొందించటం ద్వారా .....అధర్మపరులైన రాక్షసుల వంటి వారికి ఎంత బలమున్నా అంతిమ విజయం ధర్మానికే అని తెలుసుకోవచ్చు.

ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

* రామాయణం, భారతం నిజంగా జరిగిన సంఘటనలే అనటానికి . రామసేతు ఆనవాళ్ళు, సముద్రంలో మునిగి ఉన్న ద్వారకా నగరం ఆనవాళ్ళు శాటిలైట్ సహాయంతో కనుగొన్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి కూడా.

( నేను వాల్మీకి వారి రామాయణం చదవలేదు. ) ( కొద్దిభాగం నెట్లో చదివాను, ఇంకా కొంత పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను అంతే. )

ఏమైనా పొరపాట్లు ఉన్నచో భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నానండి.

అంతా భగవంతుని దయ.


 

2 comments:

  1. Excellent!. Keep it up.

    The photo is that of Hawaii Island?

    ReplyDelete
  2. మీకు కృతజ్ఞతలండి.
    రామసేతు, ఇంకా సముద్రంలో మునిగిన ద్వారక గురించిన ఆనవాళ్ళ వివరాలు కనుగొన్నట్లు వార్తాపత్రికల్లో చదివానండి. వారు కొన్ని చిత్రాలు కూడా ప్రచురించారు.
    మీరు చెప్పినట్లు నెట్ లో చూస్తే Adam's Bridge అన్న దగ్గర వివరాలు ఉన్నాయి. . కృతజ్ఞతలండి. .

    ReplyDelete