koodali

Friday, May 20, 2011

ఎంతకని పిల్లలను వీటి బారినుంచి కాపాడగలం ?

ఈ మధ్యన కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి. దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూనే, మందులు వాడుకుంటూనే .... కాలభైరవాష్టకము ఒకసారన్నా చదివితే బాగుంటుంది అనిపిస్తోందండి. ఇంకా ....లలితా అమ్మవారి నామములు గానీ ఎవరికి ఇష్టమయిన దైవాన్ని వారు ప్రార్ధించుకోవటం మంచిది.
.................................................................

ఇంకా , ఈ మధ్యన తిరుమల లోని వేదపాఠశాలలో జరిగిన అకృత్యాల గురించి విన్నాక ... ఈ సమాజం ఎటుపోతోందో అర్ధం కావటం లేదు.


మనుషుల్లో నైతిక విలువలు లోపిస్తున్నాయి......... దానికి తోడు ఆధునిక విజ్ఞానం అందించిన కొన్ని సాధనాలు కూడా ఇలా నేరప్రవృత్తి పెరగటానికి ..........మరింత దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు.


ఉదా...చూడండి.......ఇప్పుడు వస్తున్న సినిమాలు, సీరియల్స్ , పత్రికల్లో వస్తున్న కధలు ,నవలలు వీటిలో అసభ్యత ఎక్కువగా ఉంటోంది.


ఇదివరకు సినిమాలు అందులోని దృశ్యాలు, చూడాలంటే హాలుకు వెళ్ళవలసి వచ్చేది. . ఇప్పుడు పెరిగిన ఆధునిక విజ్ఞానం పుణ్యమా అని ఇవన్నీ టి.విల పేరుతో నట్టింట్లోకి నడిచి వచ్చేసాయి.


ఇది వరకు ఇంటర్నెట్ కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ........ ఇప్పుడు సెల్ ఫోన్ లోనే నెట్ కూడా వచ్చేస్తోంది.

వేదపాఠశాల పిల్లల వద్ద కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని వార్తలలో చదివాము.


పిల్లలు దూరంగా ఉన్నప్పుడు సెల్ వల్ల సమాచారం అందుబాటులో ఉంటుందని సెల్ ఇస్తారు పెద్దవాళ్ళు............ సెల్ ఫోన్స్ లో అసభ్యకర దృశ్యాలు చూసే వీలుంది. .......... ఎంతకని పిల్లలను వీటి బారినుంచి కాపాడగలం ?


టి. విల్లో కూడా అడ్వర్ టైజ్ మెంట్స్ రూపంలో అసభ్యకరమైన సన్నివేశాలు వస్తూంటాయి. వీటిని అడ్డుకోనే వారే లేరా ?


తల్లిదండ్రులు కూడా చదువు కోసం పిల్లల్ని హాస్టల్స్ లో వేస్తారు............ అక్కడ ఏమైనా ర్యాగింగ్ జరిగితే పిల్లలు పెద్దవాళ్ళకు సూటిగా చెప్పలేరు. ............ హాస్టల్ నచ్చలేదని పిల్లలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఆలోచించాలి.


బోలెడు డబ్బు కట్టామనో , ఎలాగోలా చదువుకో అనో పెద్దవాళ్ళు మూర్ఘంగా ప్రవర్తిస్తే ........తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ........... బలి అయ్యేది పిల్లలే. ఇలా కొందరు పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.


పాఠశాలలు, వాటిని నడిపే యాజమాన్యాల మీద ఎంతో నమ్మకంతో తమ పిల్లలను హాస్టల్స్ లో వేస్తుంటారు తల్లిదండ్రులు. ........... వారి పిల్లలను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత హాస్టల్ యాజమాన్యాలకు లేదా ?

పెద్దలు కూడా కొంచెం కళ్ళు తెరిచి ............ చదువు, సంపాదన పేరుతో జరుగుతున్న వికృతవ్యవస్త నుంచి బయటకు వచ్చి ........... పిల్లల బాగోగుల గురించి ఆలోచించాలి. వారి పాలిట మీరే విలన్లు కాకండి.


ఈ రోజుల్లో మన సమాజం ఎలా ఉందంటే......పాశ్చాత్య నాగరికతను అనుకరిస్తూ విలాసంగా జీవించే వారిని గొప్ప వారిగా అందరూ గౌరవిస్తున్నారు.

అలా కాకుండా......... సింపుల్ గా , సాంప్రదాయబధ్ధంగా జీవించేవారిని చాదస్తులుగా, బ్రతకటం చేతకానివారిగా ఎగతాళి చేస్తున్నారు చాలామంది.


ఆర్భాటాలూ, అట్టహాసాలూ, అసభ్యకరమైన దుస్తులూ , ఆడంబరాలతో కూడిన జీవనవిధానాలు, ...ఒక ప్రక్క ............. దేవుడూ, గీవుడూ ఎవరూ లేరని గోల పెట్టే నాస్తిక వాదులు ... ..వీటన్నిటి మధ్య....... ఈ గందరగోళంలో నలిగిపోయి బలహీనమనస్కులు....దైవము, ధర్మం, పాపపుణ్యాలను గాలికి వదిలేసి తప్పు దారి పట్టే అవకాశం ఎంతయినా ఉంది.


( దైవానుభూతులను పొందిన ఆస్తికులు మాత్రము .......... దైవం లేరని ఎవరు చెప్పినా దారి తప్పక దృఢంగా నిలబడతారు ... )

ఇలా రాస్తున్నందుకు కొందరికి కోపం వచ్చినా పిల్లలకు మంచి చెప్పవలసిన తల్లిదండ్రులే చాలా మంది ఈ రోజుల్లో దారి తప్పుతున్నారు..


పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? ఇలా పాపాలు పెరిగిపెరిగి ..... ప్రళయం వచ్చి ప్రపంచం అంతమయిపోతుంది. మళ్ళీ కృతయుగం ప్రారంభమయి ధర్మం నాలుగు పాదాలా నిలబడుతుంది.... 

 

5 comments:

  1. #తిరుమల....

    I was seen Sakshi videos on that but dont get any mean than their over-hyping to blow TRP.

    How much true it was? Does somebody consulted students there? Does somebody plotted something to threaten and deter parents of other children studying there?

    If it is true What If it is just infatuation?.
    How far-reaching effect on children mood after grabbed harshly on to TV? Shouldn't it be treated as a crime and put up a case against TV?

    We should always think on flip-side w.r.to these type of issues. This is what I felt.

    ReplyDelete
  2. మీ అవేదనలొని నిజాయితీ ప్రతి అక్షరంలో ద్యోతకమవుతూంది. ప్రతి తల్లీ,తండ్రీ తప్పక ఆలోచించాలి ఇవి.

    ReplyDelete
  3. నిజమేనండి, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తోంటే కలిప్రభావం బాగా తెలుస్తోంది. వేదపాఠశాల సంఘటనల వ్యవహారంలో అలా జరగటానికి గల కారణాలేమిటో ఆ భగవంతునికే తెలియాలి. అది అలా ఉంటే మీడియా వాళ్ళు బాధిత బాలుని ముఖాన్ని ప్రేక్షకులకు చూపించటానికి చాలా ప్రయత్నించినట్లు అనిపించింది. ఆ బాలుడు తన చేతులతో ముఖము దాచుకోవటానికి ప్రయత్నించటం టి.విల్లో చూశాము. అప్పుడు నాకూ అనిపించింది ఇలాంటి వాటి వల్ల ఆ పిల్లల మనసు ఎంత గాయపడుతుందో అని.

    * ఈ విషయంపై మీ అభిప్రాయములు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి... .

    ReplyDelete