koodali

Friday, May 6, 2011

ఎంత బాగా మందులు వాడినా కొందరికి రోగాలెందుకు తగ్గటం లేదు ?.( వారి పూర్వ కర్మ వల్ల.)

అక్షయ తృతీయ శుభాకాంక్షలు....

 ప్రతి ఒక్కరికి మహిమలు చూపించి వారి కష్టాలు తీర్చటం, రోగాలు తగ్గించటం గొప్పవారి ఉద్దేశం కాదు,   ఆ విధంగా చేస్తే ప్రజలు సోమరులవుతారు. అది సృష్టి ఉద్దేశం కాదు.

మన ప్రయత్నం కూడా మనం చేయాలి. రోగం తగ్గాలంటే భగవంతుని కరుణ కావాలి. అలాగే మనం మందులు కూడా వాడుకోవాలి.

అదేమిటి ? మందులు వాడుకున్నప్పుడు ఇక భగవంతుని కరుణతో ఏం పని ? అని కొందరికి సందేహం రావచ్చు.


మందులు వాడితేనే రోగాలు తగ్గిపోయేటట్లయితే ఎంత జాగ్రత్తగా మందులు వాడినా... కొందరికి రోగాలు ఎందుకు తగ్గట్లేదు ? ..

కొందరు డాక్టర్లు కూడా జబ్బు చేసి ... తగ్గక ,.బాధపడుతున్నారు.

జబ్బులు ఎలా వస్తాయో తెలిసీ...వస్తే ఏ మందులు వాడాలో తెలిసీ కూడా..... కొందరు డాక్టర్లు కోలుకోవటం లేదెందుకని ?

ఇలాంటి వాటికే పూర్వ కర్మ, పాపం ..ఇలా ఆధ్యాత్మికత ద్వారా సమాధానం దొరుకుతుంది .

కొందరు మందులు సరిగ్గా వాడకపోయినా... జబ్బులు తగ్గినవారున్నారు... దైవం దయ కొందరిపై అలా అపారంగా ఎందుకు ఉంటుందంటే...వారి పూర్వ పుణ్యమే అందుకు కారణం.


.మామిడిచెట్ల వయిపు పూతపూసియున్నప్పుడు చూడుము.పువ్వులన్నియు పండ్లు అయినచో , నెంత మంచి పంట యగును ? కాని యట్లు జరుగునా ? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.. అన్నారు షిర్డీ సాయిబాబా.


ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మనస్తత్వాలు , ఒకేలా ఉండవు... పిల్లలలో ఎన్నో తేడాలుంటాయి. .... కొందరికి బాగా తెలివి ఉండి బాగా విద్య వస్తుంది. కొందరికి విద్య సరిగ్గా రాదు. .. కొందరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. కొందరికి ఎప్పుడూ అనారోగ్యమే. ఇలా ..
వారి అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎందుకు ఉండవు. ? ( ఎవరి కర్మఫలం వారిదే..)

ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆధ్యాత్మికత సమాధానాలు ఇస్తుంది.

ఇప్పటి జన్మలో మనిషి అవసరాల వరకూ మాత్రమే చెప్పటంతో.. భౌతిక శాస్త్రం ఆగిపోతుంది.

జీవుల పుట్టుకకు ముందు......మరణానికి తరువాత ఎలా ఉంటుందో ఆ విశేషాలు కూడా ఆధ్యాత్మిక గ్రంధాల ద్వారా చెప్పబడ్డాయి.

ఇంకా,ప్రాచీన గ్రంధాలలో .... విశ్వం గురించీ ,
సృష్టిలో ఉన్న ఇతరలోకాలు, జీవుల గురించి ఎన్నో విషయాలు వివరించబడ్డాయి...అందుకే ఇదంతా ఆధ్యాత్మికశాస్త్రం అనటంలో కూడా తప్పు లేదనిపిస్తుంది...


శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి గొప్పవారు........ వారి జీవితంలో ప్రతి చిన్నదానికి మహిమలను ఉపయోగించలేదు. . ......... వారిలా కష్టపడి అయినా ధర్మంగా జీవించాలని... వారి జీవితం ద్వారా సందేశాన్నిచ్చారు.

ప్రజలకు దైవం అంటే నమ్మకం కలిగించవలసి వచ్చినప్పుడో, ........ తప్పనిసరి పరిస్థితిలోనో, ఇతరులకు సహాయం చేయటానికి ........ వారు మహిమలు చూపిస్తారు..


9 comments:

  1. రోగాలకి, ఆధ్యాత్మతకి ముడి పెట్టే, ఈ బాబాలు, క్రిష్టియన్ మతాధికారులు తమ పబ్బం గడుపుకుంటూ కోట్లాది డబ్బు అప్పనంగా ప్రజల వద్ద నుండి కొల్లగొడుతున్నారు. (నల్ల డబ్బు రూపంలో) దాచుకుంటున్నారు. జబ్బు ఒకటే.. వాడే మందులు ఒకటే అయినా పక్క వాడికి తగ్గి నట్టు రెండో వాడికి ఎందుకు తగ్గవు అంటే శరీర తత్వం, వ్యాధి తీవ్రత ను బట్టి వుంటుంది...
    ఎల్.ఐ.సి ఏజెంట్లు లాగ మనకి జబ్బు ఏదైనా వచ్చినా, కష్టం వచ్చినా మీ లాటి వాళ్ళు వాలి పోయి, మా దేవుణ్ణే నమ్ముకోండి, మా బాబా దగ్గరకి రండి... ఫలానా వాళ్ళకి సేమ్ మీలాగే ఇలా అయితే మా దగ్గరకు రాగానే మాయం అయిపోయింది అంటూ మాయ కబుర్లు చెప్పి మొగ్గు లోకి దించుతారు.
    మనకి జబ్బు చేస్తోనో, ఏదైనా కష్టం వచ్చినప్పుడేనా దేవుడు, ఆధ్యాత్మికం గుర్తుకు వస్తుంది.. ఆనందంగా వున్నప్పుడు అదంతా మన గొప్ప తనం, కష్టం ...రోగం రాగానే ఇలా నిందలు... ఎక్కడుంది లోపం?

    ReplyDelete
  2. మీరు చెప్పినట్లు శరీరతత్వం, వ్యాధి తీవ్రత కారణాలనుకుంటే.........ఎలాంటి శరీరతత్వం గలవారికయినా మందులు ఉంటాయి గదా ! అవెందుకు పని చెయ్యటం లేదు ?

    స్వయంగా డాక్టర్లయిన వారు కూడా తమకు వ్యాధి తీవ్రత పెరిగే వరకూ ఎందుకు గుర్తించలేకపోతున్నారు ?

    ఇలాంటప్పుడే అనిపిస్తుంది....వారి తల రాత అలా ఉంది కాబోలు అని.

    ఇక కష్టాలలో ఉన్నప్పుడే కాదు....ఆనందంగా ఉన్నప్పుడు కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుని........... ఈ ఆనందమంతా దైవం దయ వల్లనే...అనుకొనే వారు చాలా మందే ఉంటారండి....

    ReplyDelete
  3. రోగాలు, ఆధ్యాత్మికతా, కర్మ ఫలమూ ముడి పెట్టి వాటిమీద పరిశోధనలు చేయటం కష్టం గానీ రోగాలూ, నమ్మకము, తగ్గటం మీద స్టడీ చేసి తేల్చిన దేమిటంటే రోగం తగ్గుతుంది అని నమ్మకం తో ఉంటె వాళ్లకి రోగం తగ్గుతుంది లేకపోతే ఎన్ని మందులేసినా ప్రయోజనము ఉండదు. ప్రస్తుతం ఆ స్టడీ లింక్ ఇవ్వలేను కానీ మీరు లిటరేచరు వెతికితే దొరుకుతుంది. మంచి డాక్టర్ అని కొందరు నమ్మకం పెట్టుకుంటారు, దేముడు అని కొందరు నమ్మకం పెట్టుకుంటారు. కానీ ఆ నమ్మకం ఉండాలి తగ్గటానికి అని నిరూపించారు.

    ReplyDelete
  4. Harvard Study Suggests Meditation Turns on Disease Fighting Genes

    A group at the Harvard Medical School have found that deep relaxation seems to switch off disease causing genes while switching on genes that help protect us from disease. In the study they followed people who used relaxation methods like meditation and yoga, but if deep relaxation is the thing that seems to help, one must consider the use of hypnosis, as well. Big potential for people who practice self-hypnosis, and for hypnotism practitioners, as well.


    http://www.familyhealthguide.co.uk/meditation-switches-on-disease-fighting-genes.html

    ReplyDelete
  5. కొందరి విషయంలో ..............వారి పూర్వ పాపకర్మ ........ వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని పెద్దలు చెప్పటం జరిగింది కదండి. ఆ ప్రకారం చూస్తే రోగాలు,ఆధ్యాత్మికత, కర్మఫలమూ ముడిపెట్టిచూడవచ్చేమోనండి.

    ఇలాంటి ఎన్నో విషయాలు " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో వివరంగా చెప్పటం జరిగిందండి.

    అందులో ఒక యోగి రోగంతో చనిపోయిన ఒకరోగిని తిరిగి బ్రతికించటం గురించి వివరంగా చెప్పారు.

    మనిషి యొక్క నమ్మకానికి కూడా ఎంతో శక్తి ఉంటుందని చెప్పబడింది. మీకు కుదిరితే ఈ గ్రంధం తప్పక చదవండి.

    అమెరికాలో కూడా వారి ఆశ్రమాలు ఉన్నాయట. అక్కడ ఈ గ్రంధం తప్పక ఉంటుంది.

    ఈ గ్రంధంలో ఎంతో విజ్ఞానం వివరించబడింది.

    ప్రాచీన గ్రంధాలలాగ ఈ పుస్తకం కూడా మొదటిసారి చదివిన దానికన్నా చదివేకొద్దీ వివరంగా అర్ధమవుతుంటుంది..

    ReplyDelete
  6. "Autobiography of a Yogi" ....... ఈ గ్రంధం గురించి వివరాలు నెట్ లో ఉండటం ఇప్పుడే చూసానండి..

    ReplyDelete
  7. మీ మొదటి ప్రశ్న: పెద్ద పెద్ద డాక్టర్లకి కూడా జబ్బులు.......
    డాక్టర్లు కూడా మనుషులే అన్న సంగతి మర్చి పోతున్నారు.. మామూలు మనుషులుకి వుండే శరీర లక్షణాలే వాళ్ళకీ వుంటాయి... జబ్బులు ఎటాక్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఏమీ వుండదు... మనకన్న శ్రమ ఎక్కువగా వుంటుంది (టెన్షన్ కూడా ఎక్కువ, జాబ్ లో రిస్క్ ఎక్కువ).. కాని నేను చూసిన చాలా మంది పెద్ద డాక్టర్లు తొంభై ఏళ్ళు వచ్చినా చాలా ఆరోగ్యం గా వున్నారు.. ఉదా: డా.సిన్హా (ప్రముఖ కార్డియాలజిస్ట్), డా.రఘు రామారావు (స్కిన్), డా.సత్యమూర్తి (ఇ.ఎన్.టి) (మా వైజాగ్ వాళ్ళు)...ఇంకా చాలామందిని చూసాను..
    ఇక పోతే ఆధ్యాత్మికంగా చాలా ప్రఖ్యాతి చెందిన వారు చాలా చిన్నతనంలోనే కాలం చేసారు: వుదా: ఆది శంకరాచార్య, స్వామి వివేకానంద
    వ్యాధులకి వారు: గురుదేవులు రామ కృష్ణ పరమహంస, షిర్డి బాబా, మొన్నటి సత్యసాయి బాబా ...
    ఏసుక్రీస్తు ని కూడా చాలా దారుణంగా శిలువ వేయబడడం జరిగింది....
    మరి వీరంతా డైరెక్టుగా సాక్షాత్తూ దేవునితో మాట్లాడిన వారే .. అందులో సందేహం లేదు.. మరి వారి మరణాలు ఇంత కఠినంగా, దారుణంగా ఎందుకున్నాయి?

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యలకు , తరువాత పోస్ట్ ద్వారా నాకు తెలిసినంతలో అభిప్రాయాలను చెప్పటానికి ప్రయత్నించానండి...

      Delete
  8. "Autobiography of a Yogi" . పుస్తకం నెట్ లో చూశాను. చదవాలి. థాంక్స్.

    ReplyDelete