koodali

Wednesday, May 4, 2011

మతవాదులు..........ఆధునికభౌతిక వాదులు.........అత్యాశాపరులు .......... .ఎవరివల్ల ప్రపంచానికి...............



కొందరు ఏమంటారంటే.. మతవాదుల వల్లనే
ప్రపంచంలో ఎక్కువగా రక్తపాతం, హింస జరిగిందని అంటారు. ఇది నిజం కాదు.

అధికారం కోసం, ఆధిపత్యం కోసం, ఆర్ధికాభివృధ్ధి కోసం, ............... అహంకారంతోనూ, అపార్ధాలతోనూ, ............ ఆధునిక అభివృధ్ధి పేరుతోనూ జరుగుతున్న హింసతో పోలిస్తే మతవాదుల వల్ల జరిగిన హాని ఎంత ?

కొందరు స్వార్ధపరులు తమ అవసరాలకోసం కూడా మతాన్ని వాడుకున్నారు. నిజమైన ఆధ్యాతికవాదులు అలా చేయరు.


*నిజమైన ఆధ్యాత్మికవాది వల్ల ప్రపంచానికి ఏ హాని కలగదు.


మొదటి ప్రపంచ యుధ్ధం, రెండవ ప్రపంచ యుధ్ధము అధికారం కోసమూ, ఆర్ధికాధిపత్యం కోసమూ జరిగాయి.

ఆ సందర్భంగా జరిగిన రక్తపాతమూ, హింసతో పోలిస్తే ............?

ధికారం కోసం, ఆధిపత్యం కోసం, ఆర్ధికాభివృధ్ధి కోసం చరిత్రలో ఎన్నెన్ని యుధ్ధాలు జరిగాయి. ఎంత నష్టం జరిగింది.

అత్యాశాపరుల వల్ల, అవినీతిపరులవల్ల, ప్రపంచానికి జరిగిన హానీ తక్కువదేమీ కాదు.


* ఇవన్నీ వదిలేసి మతవాదుల వల్లనే ఎక్కువ హాని జరిగిందని అనటం అన్యాయం.

*ఆధునిక కాలంలో అభివృధ్ధి పేరుతో కూడా ఎంతో హింస జరుగుతోంది.

ప్రపంచానికి, పర్యావరణానికి, కోట్లాది మూగజీవులకు ఎంతో హాని కలుగుతోంది.

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ అసమతుల్యత, గ్లోబల్ వార్మింగ్ ఇటువంటి వాటి వల్ల మనుషులే కాక, ఎన్నో జీవులూ బాధలు పడుతున్నాయి.


ఇదంతా మనిషి చేసుకున్న స్వయంకృతాపరాధం.

మనిషి తన అంతులేని కోరికల కోసం చేస్తున్న చేష్టల వల్ల ఎన్నో మూగజీవులు మూగగా బాధను అనుభవిస్తున్నాయి. ........... . చెప్పుకోటానికి వాటికి చేతరాదుగా ! వాటికి దేవుడే దిక్కు.


* పూర్వం యుధ్ధాల వల్ల మనుషులు మాత్రమే బాధలు పడేవారు............. ఇప్పుడు ఆధునిక అభివృధ్ధి పేరుతో జరుగుతున్న చేష్టల వల్ల కోట్లాది మూగజీవులు కూడా బాధలు పడుతున్నాయి............ వాటిదీ మనలాంటి భాదే కదా !


పురుగుమందుల వాడకంలో ప్రమాదాల గురించి సరైన అవగాహన లేక ......... పంజాబులో వందల మంది రైతులు కాన్సర్ వ్యాధి బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి.

పరిశ్రమల ద్వారా విడుదల చేస్తున్న ప్రమాదకర రసాయన వ్యర్ధాలు ............. నదులలో , సముద్రాలలో కలసి, భూమిలో ఇంకి,........... ఆ నీటితో పండించిన ఉత్పత్తులు తినటం వల్ల .............మనుషులు, ఇతర జీవులు అనేక రోగాల బారిన పడటం జరుగుతోంది.

ఇక అణు కర్మాగారాలనుంచీ విడుదలయ్యే అణువ్యర్ధాలను ఎక్కడ వదలాలన్న దానికి పరిష్కారం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ............ వాటి దుష్ప్రభావాలు ఎన్నో తరాల తర్వాత కూడా కనిపిస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే.


*మనుషులు ఎదురుగా ఒకరినొకరు యుధ్ధం చేసి చంపుకుంటేనే హింస , రక్తపాతం అనక్కర్లేదు. ..... ఇంతకు ముందు చెప్పుకున్నవి కూడా హింస అనే అంటారు.

* ఆద్యాత్మికత వల్ల మనుషులలో భయం, భక్తి పెరిగి కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండటానికి ప్రయత్నిస్తారు............ విశ్వాన్ని సృష్టించిన పరమశక్తికి కృతజ్ఞత చూపించటం మనిషి కనీస ధర్మం.

అయితే కొందరు స్వార్ధపరుల వల్ల మరి కొందరు తెలిసీతెలియనివాళ్ళ
వల్ల మతం విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి.......... అంతకు మించి దాని వల్ల ప్రమాదం లేదు.

కానీ మిగతా వాటితో జరుగుతున్న హాని తో పోలిస్తే మతవాదుల వల్ల జరుగుతున్న హాని ఎంతో తక్కువ..

ఆధునిక విజ్ఞానం అంటే నాకు వ్యతిరేకత ఏమీ లేదండి. ........ ఆ విజ్ఞానం హాని చెయ్యకుండా ప్రపంచానికి ఉపయోగపడాలన్నదే నా అభిప్రాయం.

ఈ మధ్యన మనరాష్ట్రం విద్యార్ధులు సౌరశక్తితో పనిచేసే వాహనాలు కనిపెట్టారని అన్నారు............ ఇది చాలా సంతోషకరమైన విషయం. ...........

* ఇలా వివిధరంగాలలో ప్రపంచానికి మేలు చేస్తున్నవారందరూ అభినందనీయులు..
 

4 comments:

  1. ** ఆద్యాత్మికత వల్ల మనుషులలో భయం, భక్తి పెరిగి కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండటానికి ప్రయత్నిస్తారు...
    -----------
    నిజాన్ని ఒక వాక్యంలో చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. భౌతిక వాదానికి స్వార్ధం తోడైతే ఇంకా అటువంటి మనిషి సృష్టించే విధ్వన్సాన్ని ఆపటం చాలా కష్టం. పోలీసులకూ చట్టానికీ చిక్కకుండా చాలా పనులు చేయగలడు. అవసరమైతే వాటిని తనకు అనుకూలం గా మార్చుకో గలడు.

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.

    ReplyDelete
  4. కృతజ్ఞతలండి.

    ReplyDelete