koodali

Friday, July 16, 2010

పురాణములలో ఉన్నది అధర్మం కాదు......అంతటా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి ఆరవ భాగం...........

ఓం, శ్రీ మహా విష్ణువుకు లక్ష్మీదేవికి సరస్వతీదేవికి బ్రహ్మ దేవునికి సకల దేవతలకు నమస్కారములు.


ఇప్పుడు సీతారాముల కధలోని విషయములు కొన్ని చెప్పుకుందామండి. రామాయణం లోని పాత్రలు, వారి అవతార విశేషాలు, వారి పూర్వ కర్మ విశేషములు, శాపములు ఇవన్నీ చాలా పెద్ద కధ . ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని పెద్దలు చెబుతున్నారు కదండి. అదంతా పెద్ద కధ.
ఇక్కడ మనం సీతమ్మ వారి అగ్ని పరీక్ష, రాములువారు ఆమెను అడవులకు పంపించటం ఇదంతా అధర్మం అని కొంతమంది అంటుంటారు కదా ఆ విషయం గురించి నాకు తెలిసిన అభిప్రాయములు చెప్పుకుంటానండి ..ఇంతకుముందు హరిశ్చంద్రుల వారి కధలో చెప్పుకున్నట్లు వారు తమ ప్రజలకు ధర్మం యొక్క విలువను తెలుపుటకు తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు , శ్రీ మహావిష్ణువు లోకపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి.... లోకంలోని ప్రజలను అధర్మం నుండి రక్షించుటకు ఎన్నో అవతారములు ధరించి ,ఎన్నో కష్టములు సహించి లోకములను రక్షించారు. అందుకోసం మత్స్యావతారం, కూర్మావతారం వంటి అవతారములను కూడా ధరించారు. శ్రీ రామావతారములో శ్రీ లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవితో కలసి ఎన్నో కష్టములను అనుభవించి లోకులని రాక్షసులు బారి నుండి కాపాడారు. సీతారాములు ఆదర్శ దంపతులు.
రాములువారు ఏమి తప్పు చేశారు? తన భార్య కష్టముల పాలైనప్పుడు ఆమెకోసం ఎంతో ఆరాటపడి, రక్షించుకున్న మంచి భర్త. ఆ సందర్భములో ఎంతోమంది రాక్షసులను కూడా సం హరించారు.. రాములవారికి తాను విష్ణుమూర్తి అవతారమని తెలుసు. సీతమ్మ వారి జాడ తెలియని సందర్భములో ఆమె కోసం ఎంతో విలపించారు. దేవతలకు కూడా సుఖః, దుఃఖములు ఉంటాయి కదా!


ఇక సీతమ్మవారి అగ్ని పరీక్ష గురించి అంటే రాముల వారికి తమ అవతార రహస్యం గురించి తెలుసునట. సీతమ్మ మహాసాధ్వి అనీ తెలుసు. ఆమెకు ఏమీ కాదనీ తెలుసు. అందుకే అలా చేసిఉంటారు. లోకుల సంగతి ఆయనకు ముందే తెలుసు.ఈ కలికాలంలోనే దైవభక్తి కలవారు ఎంతో మంది , ధ్యానం, తపస్సు, యోగా చేసేవారు ఎన్నో మహత్తులు చూపిస్తున్నారు. ఒక యోగి ఆత్మకధలో ఎంతో మంది ఈ నాటి యోగుల గురించిన ఎన్నో మహత్యములను గురించి తెలుసుకున్నాము. మరి సాక్షాత్తు లక్ష్మీ దేవి అవతారమయిన సీతమ్మ వారికి అగ్నిపరీక్ష వల్ల ఏ ఆపదా రాదని రాముల వారికి తెలుసు.
శ్రీ షిరిడి సాయిబాబా వారి కధలో కూడా ఆయనకు ఖండ యోగం అనే మహాధ్భుత విద్య తెలుసునని చెప్పబడింది. అంటే ఖండయోగమనగా శరీరావయవములన్నియు విడదీసి తిరిగి కలుపుట. ఇలాంటి మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్, టి.వి ఇలాంటివి తెలియని మారుమూల తెగల ప్రజలకు వాటి గురించి చెబితే అస్సలు నమ్మరు. అలాగే ఇవి కూడా.మనకు తెలియక వాటి గురించి నమ్మలేకపోతున్నాము.

సరే అలా సీతమ్మవారు మహాత్ములు కాబట్టి అగ్నిపరీక్ష వారికి ఆపద కలిగించలేదు. అన్ని కష్టాలు అనుభవించి, అగ్నిపరీక్ష అనంతరం తిరిగి వచ్చి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూడండి.........వారిని ఒక పామరుడు తప్పుపట్టాడు. ఇది ఏమి న్యాయము? ఇలాంటి కొంతమంది గురించి ఆలోచించే రాముల వారు సీతమ్మవారి అగ్నిపరీక్షకు ఒప్పుకుని ఉంటారు.
.సీతమ్మవారు కూడా మరి తాను వనవాసం చెయ్యవలసిన అవసరం లేకపోయినా రాజభోగాలు అన్నీవదలి భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. కష్టాలు అనుభవించారు. ఆమె ఎంతో ఉత్తమ ఇల్లాలు.ఇక సీతమ్మను అడవులకు పంపించటం. ......... ఇక్కడ గమనించవలసినది ఏమంటే ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు. అప్పటి పాలకులు చాలా సెన్సిటివ్ గా ఉండేవారు మరి.
ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...
అసలు అప్పుడు కూడా రాములవారు ఆమె గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారంట. వాల్మీకి మహర్షి వద్ద ఆమె సురక్షితముగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశారట. అడవులకు పంపించటానికి ముందే వ్యాసులవారికి ఈ విషయం రాములు వారు తెలిపారట. అప్పట్లో ఒకరితో ఒకరు మనసు ద్వారా విషయములు తెలుసుకోవటం అనేవి ఉండేవంట. తపశ్శక్తి ద్వారా ఇది సాధ్యమట. ఇప్పుడు టెలిపతి అనే దానికి దగ్గరగా అర్ధం వస్తుందేమో. ...... సరే ముందే విషయం తెలియటం వల్ల వాల్మీకి మహర్షి వచ్చి ఆమెను ఆశ్రమానికి తీసుకువెళ్ళారని పెద్దలు చెబుతున్నారు.

రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి. సీతారాములు ఆదర్శ దంపతులు. .

భగవంతుని దయ. ....

2 comments:

  1. టపా చదివి కామెంట్ పంపినందుకు థాంక్స్ బ్రదర్. కానీ కామెంట్ కనిపించుటలేదు. కారణం తెలియటం లేదండి. అందుకు సారీనండి..

    ReplyDelete