koodali

Friday, September 16, 2016

ఆంధ్రప్రదేశ్ ...... కొన్ని విషయాలు..

  
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గమనించదగ్గ కొన్ని విషయాలున్నాయి.

రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, 


రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

...............  


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.


నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా,  ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.


అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.


నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు. 


  రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.

.....................

రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు. 


 తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.


  రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.


రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా, మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.


రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.

అమరావతి చుట్టుప్రక్కల  కూడా  కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.

....................

 రాష్ట్రానికి  పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.


అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.


 పారిశ్రామికవేత్తలు  భూమి తక్కువధరలో కావాలంటారు.


 కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.


భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు. 


అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ  మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.


అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.


అయితే పరిశ్రమల వల్ల  కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.


.....................

 
మాకు.. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ..ప్రాంతాలలో బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు. నేను.. గుడివాడ, విశాఖపట్నం, కర్నూలులో ..కొన్ని సంవత్సరాలు నివసించటం వల్ల ఆ ప్రాంతాలు నాకు తెలుసు.

 రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............

రాజధాని గురించి గొడవలు పడటం కన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిది. భారతదేశానికి ఢిల్లి రాజధాని అని చెప్పుకుంటాము. ఇతరరాష్ట్రాల వారు వారి రాజధాని పేరు చెప్పుకుంటారు. ఇతరరాష్ట్రాలకు కూడా వారి రాష్ట్రంలో అనేక ప్రాంతాలుంటాయి. అయితే, వాళ్ళు కూడా రాష్ట్రం అంతటా ఒక్కటిగా భావించి, వారి రాజధాని పేరు చెప్పుకుంటారు. 
 
 
udaa..తెలంగాణాలో ఉన్న కరీంనగర్, మెదక్, ఇంకా వేరే ఊర్ల వారు.. మా ప్రాంతంలో రాజధాని పెట్టాలి అని అనలేదు. హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చేయటం ఏమిటి? అని కూడా అనటం లేదు. హైదరాబాద్ ..మా రాజధాని ..అని గొప్పగా చెప్పుకుంటారు.
ఆంధ్రప్రజలు కూడా ఉత్తరాంధ్ర.. రాయలసీమ..కోస్తా.. అని కాకుండా, తామంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి, అందరూ చక్కగా ఉండాలి.


దేశంలో అన్ని ప్రాంతాలు చక్కగా అభివృద్ధి కావాలి. అయితే, కొన్ని ప్రాంతాలలో అక్కడి భౌగోళిక పరిస్థితులు,  వాతావరణకారణాలవల్ల త్వరగా అభివృద్ధి జరగదు. ఉదా.. ఎడారి భూములు, కొండప్రాంతాలు ..ఇలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి కొంచెం నిదానంగా  ఉంటుంది. 
 
 
అయితే..ప్రజలు, ప్రభుత్వాలు..అభివృద్ధి పట్ల పట్టుదల కలవారయితే, ఎడారిలో కూడా సిరులు కురిపించి చక్కగా జీవించవచ్చు. ఒకే తల్లి కన్నబిడ్దలలో కూడా కొందరు అభివృద్ధిలోకి వస్తారు. కొందరు వెనుకబడి ఉంటారు. ఇందుకు అనేక కారణాలుంటాయి.కారణాలు తెలుసుకుని పట్టుదలగా పైకి రావాలి.
 
 
  ప్రజలు ఒకరితో ఒకరు గొడవలు పడటం, కొట్టుకోవటం..వంటివి జరిగే ప్రాంతాలుకాని, రాష్ట్రాలు కానీ అభివృద్ధిలో వెనుకబడి ఉంటాయి. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు.. అందువల్ల అభివృద్ధి చెందాలంటే ప్రజలు గొడవలు లేకుండా చక్కగా ఉండాలి. 
 
 
రాజధానికి డబ్బు సరిపోకుంటే, విజయవాడ గుంటూరు..జంటనగరాలుగా.. రాజధానిగా అమరావతివరకు సంస్థలను, కార్యాలయాలను ఏర్పాటుచేయవచ్చు.

దేశంలోని పెద్ద నగరాలు జనాభాతో కిక్కిరిసి ఉన్నాయి.   మురికితో గబ్బు కొట్టే పరిసరాలు ఉంటాయి మరియు పెద్దకాంక్రీట్ కట్టడాలు, జిలుగువెలుగులు ఉంటాయి.

పెద్దనగరాలలో డ్రైనేజ్ సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందువల్ల పెద్ద సంస్థలను చిన్న నగరాలలో కూడా ఏర్పాటు చేస్తే  మంచిదని, కొంత జనాభా అటు వెళ్తారని కొందరు నిపుణుల అభిప్రాయం.

పోలవరం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, త్వరగా పూర్తి  చేయలేమనుకుంటే.. రెండు ప్రాజెక్టులుగా కట్టవచ్చేమో? పెద్దప్రాజెక్టుల కన్నా, చిన్నచిన్న ప్రాజెక్టుల వల్ల ఉపయోగాలున్నాయని, నష్టాలు ఉండవని కొందరు నిపుణుల అభిప్రాయం.
 
*************
ఆంధ్రప్రజలకు ఐక్యత లేనప్పుడు, చిన్న రాష్ట్రాలుగా  విడిపోయి ఎవరి బతుకు వారు బతకటం మంచిది. అంతేకానీ, సంవత్సరాల తరబడి అభివృద్ధి లేకుండా ఎంతకాలం?
 
********
కొన్ని  అభిప్రాయాలను వ్రాసాను. ఇక ఎవరి అభిప్రాయాలు వారివి.




Thursday, September 15, 2016

ఉన్న భూమి జాగ్రత్తగా వాడుకోవాలి....

 
 
ఈ  రోజుల్లో  పరిశ్రమలకు భూమి ఇవ్వటం కోసం రైతుల నుంచి భూమి తీసుకుంటున్నారు.

ఈ రోజుల్లో పరిశ్రమలు అవసరమే  కానీ, ఆహారం  కొరకు వ్యవసాయం  కూడా అవసరమే కదా!

................
ఈ  మధ్య కూరగాయల ధరలు  బాగా పెరిగాయి. ఇదేమిటి ? సడన్ గా ఇంతగా ధరలు పెంచేశారని అడిగితే కూరగాయలు అమ్మేవాళ్ళు  ఏమన్నారంటే..


 ముందుముందు ఇంకా  ధరలు పెరుగుతాయండి, పంటభూములు ఎక్కువ లేవు కదా.. పంటలు వేయటం తగ్గిపోయింది..అని జవాబిచ్చారు.

 వాళ్ళు నిజమే చెప్పి ఉండవచ్చు లేక రేట్లు పెంచటానికి అలా చెప్పి ఉండవచ్చు. 


అయితే వాళ్ళు అన్న దాంట్లో చాలా నిజం ఉంది. వ్యవసాయ భూమి విస్తీర్ణం తగ్గుతూ  పోయే కొలది ఆహార కొరత ఏర్పడుతుంది. 

ఇప్పటికే  దేశంలో పండే పంట సరిపోనందువల్ల..? విదేశాలనుంచి  ఆహారధాన్యాలను  దిగుమతి చేసుకుంటున్నారు.

పండుతున్న పంటలో కొంత భాగం సరిగ్గా నిలువ చేయకపోవటం వల్ల  గోడౌన్లలో పాడవుతోందనీ వార్తలు వచ్చాయి.


అనేక కారణాల వల్ల ఈ రోజుల్లో  పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. 


అటు రైతుకూ గిట్టుబాటు  ధర  రావటం లేదు..ఇటు వినియోగదారులకూ  ధర అందుబాటులో  లేదు. మధ్య దళారులు బాగుపడుతున్నట్లు ఉంది. 



ఇలాంటి పరిస్థితిలో .. ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూములను పారిశ్రామిక  అవసరాలకు  కేటాయించేస్తే ....ఆహారకొరత మరింత తీవ్రమై, పప్పు దినుసుల కొరకు మరింతగా విదేశాలపై  ఆధారపడే పరిస్థితి రావచ్చు.


 తద్వారా ఆహారదినుసుల  ధరలు  మరింత పెరిగే అవకాశం ఉంది.


పరిశ్రమలు ఉన్నంత  మాత్రాన కడుపు నిండదు కదా!

..........................

  మనకు వ్యవసాయం బాగుంటే విదేశాల  నుండి ఆహారదినుసులను  దిగుమతి చేసుకునే ఖర్చు ఉండదు. 

వ్యవసాయం బాగుంటే దేశంలో అందరి కడుపు నిండుతుంది. ఆకలి చావులు ఉండవు.

అందరికీ పుష్టికరమైన ఆహారం లభించినప్పుడు అనారోగ్యాలూ తగ్గుతాయి. తద్వారా వైద్యానికి  పెట్టే   ఖర్చు తగ్గుతుంది. 

వ్యవసాయాధారిత  పరిశ్రమలను నెలకొల్పితే ఉద్యోగాలూ  వస్తాయి. రసాయన పరిశ్రమల  పొల్యూషన్  కూడా  తగ్గుతుంది.

................
భూమి చాలా విలువైనది. భూమి విస్తీర్ణం పెరగదు కదా... ఉన్న భూమినే జాగ్రత్తగా  వాడుకోవాలి.

 పరిశ్రమలకు  భూములను అధికంగా ఇచ్చేస్తే  వ్యవసాయానికి  ఇబ్బందితో పాటూ , భవిష్యత్తులో  కొత్త పరిశ్రమలు ఏర్పాటు  చేయాలంటే  భూమి  లభించని పరిస్థితి కూడా వస్తుంది.


అందువల్ల, సాధ్యమైనంత తక్కువ భూమిలో  పరిశ్రమలు ఏర్పాటుచేసేవారికి  ప్రాముఖ్యత  ఇవ్వాలి. 


పరిశ్రమల ఏర్పాటు  విషయంలో అన్నీ  పెద్దపెద్ద  పరిశ్రమల  వారికే అవకాశాలు  ఇవ్వటం  కాకుండా ..చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వారికి కూడా అవకాశం  ఇవ్వాలి.
 




Monday, September 12, 2016

స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్..


దయచేసి పూర్తిగా  చదవమని కోరుకుంటున్నాను ..  
..................................
సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రాణాలు వదిలిన త్యాగధనులకు వందనములు.

.......................
  ఎన్నికల  సమయంలో నాయకులు  ఓట్ల  కోసం అనేక  హామీలు  ఇస్తూ తరువాత మాట తప్పుతున్నారు.

 ఇప్పటివరకు  నాయకులు ఇచ్చిన  హామీలు నెరవేర్చి ఉంటే భారతదేశం ఎప్పుడో  అభివృద్ధి చెంది ఉండేది.

 ఎన్నికల సమయంలో  పార్టీలు  మాట ఇవ్వటం..తరువాత  మాట తప్పటం  తరచూ  జరుగుతోంది.
………………………….

  విభజన  తరువాత  కేంద్రం..ఆంధ్రప్రదేస్కు నిధులు ఆలస్యంగా ఇవ్వటం జరిగింది.

 ఇలాంటి అనుభవాల  వల్ల ప్రజలలో  ప్యాకేజీ అంటే నిధులు సరిగ్గా  అందుతాయో? లేవో ? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే ఆంధ్రప్రభుత్వం..  కేంద్రం ఇచ్చిన నిధులను వేరే విధంగా ఖర్చు చేస్తోంది కాబట్టి మేము త్వరగా నిధులు ఇవ్వటం లేదనటం సరైనది కాదు.

ఉదా.. తెలుగుదేశం, బీజేపీ కలసి ఎన్నికల సమయంలో ఇచ్చిన   రైతు రుణమాఫీ వంటి వాగ్ధానాల గురించి ఆశలు పెట్టుకుని ప్రజలు ఓట్లు వేశారు.

ఎన్నికలలో  గెలిచిన  తరువాత రుణమాఫీ గురించి ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి రుణమాఫీకొరకు ప్రభుత్వం ప్రయత్నించింది. 

అయితే ప్రభుత్వం వద్ద నిధులు చాలినంత లేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన నిధులను కొంతవరకూ రైతు రుణమాఫీ కొరకు వాడటంలో తప్పులేదు..
............

ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక ప్యాకేజ్  ఇచ్చినా ప్రత్యేక  హోదా ఇచ్చినా కేంద్రానికి ఖర్చు అవుతుంది.

 ప్యాకేజ్  ఇస్తే సూటిగా డబ్బు ఇవ్వాలి. ప్రత్యేక హోదా అయితే రాష్ట్రాల నుంచి వచ్చే కొన్ని పన్నులు కేంద్రానికి తగ్గుతాయి.

ఇవన్నీ గమనించి కాబోలు ఇక మీదట ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోవటం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు  ఎక్కువగా అభివృద్ధి చెందలేదని అంటున్నారు.

 కొన్ని పరిశ్రమల వాళ్ళు  రాయితీల కోసం ప్రత్యేకహోదా  ఉన్న రాష్ట్రాలలో  చిన్న పరిశ్రమ పెట్టినా అక్కడ  పరిశ్రమను నడిపించకుండా  రాయితీలు మాత్రం తీసుకుంటున్నారట. 

స్థానికులకు ఎటువంటి ఉద్యోగాలను ఇవ్వటం లేదంటున్నారు.
.....................   

పరిశ్రమలు వచ్చినంత మాత్రాన  బోలెడు ఉద్యోగాలు వచ్చేస్తాయనుకోవటానికి  లేదు. 

 విదేశాలలో  కూడా నిరుద్యోగ సమస్య ఉంది.

యంత్ర వినియోగం పెరగటం, స్త్రీలు , పురుషులు  కూడా ఉద్యోగాల  కోసం పోటీ పడటం..వంటి  అనేక  కారణాల  వల్ల ప్రపంచవ్యాప్తంగా  నిరుద్యోగ సమస్య  పెరిగింది.
..........................

పారిశ్రామిక రాయితీల  వల్ల స్వదేశీ, విదేశీ పారిశ్రామికసంస్థలు  రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తామని వచ్చారనుకోండి. వాళ్ళు వందలు, వేల ఎకరాల భూమి అడుగుతారు.

 ప్రభుత్వం వద్ద  భూమి లేదు. అటవీభూమి ఇవ్వటానికి వీల్లేదు. ఇక మిగిలింది రైతులభూమే.

రైతులు  తమ భూమిని పరిశ్రమలకు  ఇవ్వవలసి  ఉంటుంది.

పారిశ్రామిక  రాయితీల  వల్ల పరిశ్రమల  అధిపతులకు  లాభం..

పన్నుల  ఆదాయం  తగ్గటం  వల్ల  ప్రభుత్వాలకు  నష్టం..

ఇక, భూమిని  ఇచ్చే రైతులకు లాభమా ? నష్టమా  ?  అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. 
...................

పరిశ్రమలకు  రాయితీలు ఇవ్వటం, భూములు ఇవ్వటం వల్ల పరిశ్రమల అధిపతుల  సంపద బాగా పెరుగుతుంది. 

 పెద్ద పరిశ్రమలు కాకుండా చిన్న, మధ్యస్థాయి  పరిశ్రమలను ఎంకరేజ్ చేయాలి. తక్కువ భూమితో పరిశ్రమ పెట్టేవారిని ఎంకరేజ్  చేయాలి.

 అంకుర పరిశ్రమలు పెట్టే యువతకు, వ్యాపారాలు చేయటానికి ఆసక్తి  ఉన్న యువతకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తే....సంపద కొంతమంది బడా పరిశ్రమల వాళ్ళ వద్ద  మాత్రమే కాకుండా దిగువ, మధ్య స్థాయి ప్రజలు కూడా  స్వతంత్రంగా పైకి ఎదగటానికి అవకాశముంటుంది.

....................
 పరిశ్రమల విషయంలో ఎన్నో విషయాలను ఆలోచించాలి..

 ఉదాహరణకు ..  ఒక పారిశ్రామికవేత్త  తాను   పరిశ్రమ పెట్టాలంటే 500 ఎకరాలు ప్రభుత్వం  ఇస్తే 500 మందికి ఉద్యోగం కలిపిస్తామని ప్రకటించారు.

 అంటే  500 ఎకరాలు ఇస్తే 500 మందికి మాత్రమే ఉద్యోగాలు  ఇవ్వటం అంటే ఏమంత గొప్ప విషయం. 

 ఈ రోజుల్లో కొందరు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారంటే .. ఉద్యోగస్తులను సాధ్యమైనంతగా  తగ్గించి యంత్రాలతో పని జరపటం చేస్తున్నారు.


పారిశ్రామికవేత్తలు  కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలరు.

 ఒకసారి ఉద్యోగంలో  చేరిన వ్యక్తి  సుమారు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూనే  ఉంటారు.

 ఈ లెఖ్ఖన  ప్రతి సంవత్సరమూ  ఇంజనీరింగ్ కాలేజీల నుంచి  లక్షల  మంది ఉత్తీర్ణులయి వస్తున్న అందరికీ  ఉద్యోగాలు  ఎలా ఇవ్వాలి... 

......................
దేశంలో పేదరికం, నిరుద్యోగం..వంటి సమస్యలు తగ్గాలంటే  సంపద  కొందరి వద్దే ఉండటం కాకుండా అందరి మధ్యా  పెరగటం అనేది ముఖ్యం.

 నల్లడబ్బును నియంత్రంచితే  దేశంలో ఎన్నో  సమస్యలు తగ్గుతాయి.

 సంపద ఉంటే సహజవనరులు  త్వరగా  తరిగిపోకుండా, పర్యావరణం  పాడవకుండా  అనేక ఉద్యోగాలను  సృష్టించవచ్చు.
.......................

వందల కోట్ల ఆస్తులున్న పారిశ్రామికవేత్తలు ఎందరో ఆంధ్రకు చెందిన వారు ఉన్నారు.

 ఇలాంటివారు  రాయితీలతో సంబంధం లేకుండా  ఆంధ్రలో పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుంది కదా!

  చెన్నై..వైజాగ్ కారిడర్  వల్ల పరిశ్రమలు వస్తాయంటున్నారు మరి.. 

……..
ఇక స్పెషల్  స్టేటస్  విషయానికి  వస్తే  కేంద్రం స్టేటస్ ఇవ్వనంటోంది. 

ఇప్పుడు  రాష్ట్రానికి  నిధుల అవసరం  ఎంతైనా  ఉంది..అందువల్ల  కేంద్రం ఇస్తామంటున్న  నిధులను  తీసుకుంటే బాగుంటుంది ఏమో..

 ఇప్పటికే  ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంతో  సమైక్య రాష్ట్రంలో చాలా నష్టపోయాము.

  పొరుగు రాష్ట్రాలు  అభివృద్ధిలో  ముందుకు వెళ్తుంటే ..

. మనకు ఇస్తామంటున్న  నిధులను  వద్దని తిరస్కరించి...   ఇవ్వమంటున్న స్పెషల్ స్టేటస్  కోసం  చాలాకాలం పోరాడే ఓపిక ప్రజలకు ఉందా  ? 

ప్యాకేజీని వదులుకుని హోదా కోసం ఎదురుచూస్తే ఎంతకాలం వేచి ఉండాలో ?

...............
  పార్లమెంట్లో ప్రధానమంత్రి అంతటి  వ్యక్తి ఇచ్చిన ప్రకటనకే  విలువ ఇవ్వని  ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేట్లు  లేదు.

 అందువల్ల   ఈ ప్యాకేజ్ కు  చట్టబద్ధత  కల్పించాలి. 
..........................

విభజన సమయంలోనూ ఉమ్మడి  ఆస్తుల పంపకంలో  ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది.

 స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి  ఇప్పుడు ఇవ్వనంటున్నారు.

స్పెషల్ స్టేటస్  ఇవ్వకుంటే   ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ తో  పాటు   వైజాగ్ రైల్వే  జోన్, కడపలో  స్టీల్ ఫేక్టరీ ..వంటివి ఇస్తే  బాగుంటుంది.
......................

 ముఖ్యమైన  విషయం  ఏమిటంటే.. ఇప్పటికే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం త్వరితగతిన న్యాయం చేయాలి. 

ప్రకటించిన ప్యాకేజ్  త్వరితగతిన  ఇవ్వాలి.

............
ప్యాకేజ్ వద్దంటూ  స్పెషల్ స్టేటసే  కావాలి అంటూ ఇప్పుడే ఉద్యమాలు చేస్తే ........ .

.  స్పెషల్ స్టేటస్..స్పెషల్ ప్యాకేజ్ ..  రెండూ అందక రెంటికి చెడ్ద రేవడి అవుతుందేమో  రాష్ట్రం పరిస్థితి.

 ప్రస్తుతానికి ప్యాకేజ్ ఒప్పుకుని తరువాత స్పెషల్ స్టేటస్ అడిగితే బాగుంటుందేమో..

ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజ్  కేంద్రం నుండి సరైన సమయానికి సక్రమంగా  రాష్ట్రానికి చేరటం జరగాలి.

అందిన ప్యాకేజ్ సమయానికి సక్రమంగా వినియోగం జరగాలి.అప్పుడే ఉపయోగం ఉంటుంది.

ప్రస్తుతానికి  నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను. ఈ విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి.


Thursday, September 8, 2016

1.దృష్టిలోపం తగ్గటానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులు....2.కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి....





ఆసక్తి ఉన్నవారు లింక్స్ వద్ద చూడగలరు.

   Ayurveda For Improving Eyesight
ayurveda-foryou.com/treat/improve-eyesight.



       Ayurvedic Remedy for Eye Sight Improvement | Ayurpedia

      ************************

      ఇంతకుముందు నాకు కళ్లజోడు లేదు. ఈ  మధ్యనే కళ్ళజోడు అవసరం పడింది. 

       బై  ఫోకల్  మరియు  ప్రొగ్రెస్సివ్ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి.

       బై ఫోకల్ నుండి కొన్ని లక్షణాలను ప్రొగ్రెస్సివ్ నుండి కొన్ని లక్షణాలను తీసుకుని కొత్తరకం కళ్ళజోడు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది.

      అంటే కళ్ళజోడును బై ఫోకల్ విధానంలోనే ఉంచి  మధ్యలో విభజన గీత ప్రదేశంలో మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందనిపించింది.

       అంటే కళ్ళజోడు అంతా ప్రొగ్రెస్సివ్ విధానం కాకుండా కళ్ళజోడు అంతా బై ఫోకల్ పద్ధతిలో తయారుచేసి ... విభజనగీత  వద్ద మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

       ప్రొగ్రెస్సివ్లో దృశ్యాన్ని చూడటానికి కళ్లు తమకు తామే సర్దుకోవలసి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త దృశ్యాన్ని చూసినప్పుడల్లా కళ్లు అలసిపోయే అవకాశం ఉందనిపించింది.

      అదే బై ఫోకల్ మధ్యలో కొద్ది భాగానికి మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే కళ్ళకు కలిగే శ్రమ గణనీయంగా  తగ్గుతుందనిపించింది.

      ఇలాంటి  విధానం సరైనదో కాదో నాకు తెలియదు.నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.
      ...................... 

      రీడింగ్ గ్లాసెస్ తో కొందరికి దూరపు దృశ్యాలు సరిగ్గా కనిపించవట.

      మొదట్లో  నాకు రీడింగ్ గ్లాసెస్  ఉండేవి. నా విషయంలో రీడింగ్ గ్లాసెస్తోనే దగ్గర దృశ్యాలు, దూరపు దృశ్యాలు కూడా చక్కగా కనిపించేవి.

      ( బహుశా అప్పుడు నాకు ఉన్న దూరదృష్టి, దగ్గరదృష్టి కూడా  1.5 రీడింగ్ గ్లాసెస్ కు సరిపోయి ఉంటుంది.)

      అయితే కళ్ళజోడు షాప్ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ తో దూరపు దృశ్యాలు చూడకూడని చెప్పటంతో డాక్టర్ వద్దకు వెళ్లి బై ఫోకల్ వేయించుకున్నాను.

       బైఫోకల్ నాకు అనీజీగా ఉండటంతో ప్రొగ్రెసివ్ మార్చాను ప్రొగ్రెసివ్ ఇంకా అనీజీగా ఉండేది. ఇలా కళ్లజోడ్లు మార్చటంతో కళ్లు అలసి దగ్గరదృష్టిలోపం మరికొంచెం పెరిగింది. కొద్దిగా మెడనొప్పులు కూడా వచ్చాయి.

      ............................


      ఇంకో విషయం ఏమిటంటే,  రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడకూడదని కొందరు అంటారు.


      ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ,  కొందరు  దూరపు వస్తువులను సరిగ్గా చూడలేని  వాళ్ళకు ఇచ్చే  కళ్ళజోడుకు విభజనగీత  ఉండదు. అద్దం అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. 

        వీళ్లు ఆ అద్దాలతోనే దూరపు వస్తువులనూ చూడగలరు..దగ్గర వస్తువులనూ చూడగలరు.

       ఈ విషయాన్ని గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...

      . కొందరు   ఒకే అద్దంతో దూరపు  మరియు దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు ( వాళ్ళు అలా చక్కగా చూడగలిగినప్పుడు)..

      . రీడింగ్ గ్లాస్ వాడేవాళ్ళు ...వాటితో దూరపు వస్తువులను  కూడా చూడటానికి కూడా ఉపయోగిస్తే తప్పేమిటి  ? అనే సందేహం అనిపిస్తుంది.

       దృస్టి లోపం ఎక్కువ పెరిగినప్పుడు  ఎలాగూ బైఫోకల్  గానీ ప్రొగ్రెస్సివ్ గానీ ఇస్తారు.

      నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.

       దైవం దయవల్ల నాకు ప్రస్తుతం దృష్టిలోపం ఎక్కువగా లేదు.

      అవసరమైనప్పుడు  రీడింగ్ గ్లాసెస్ వాడుతూ కళ్ళజోడు పవర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.




    దృష్టి లోపాలు..కళ్ళజోడుతో సమస్యలు..




    ఈ రోజుల్లో అనేక  కారణాల వల్ల దృష్టి లోపాలు బాగా పెరిగాయి.చాలామందికి కళ్ళజోడు వాడే అవసరం వస్తోంది.

    అయితే కళ్ళజోళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి.

    కొద్దిపాటి దృష్టి లోపం ఉన్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ వంటి వాటితో సరిపెట్టుకోవచ్చు.

    సమస్య మరింత పెరిగితే బై ఫోకల్ గ్లాసెస్  లేక  ప్రొగ్రెస్సివ్   గ్లాసెస్  వేసుకోవలసి ఉంటుంది.

     ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి.

    బైఫోకల్స్ అంటే కళ్ళజోడు రెండు భాగాలుగా ఉండి మధ్య ఒక గీత ఉంటుంది. ఈ గీత భాగంలో చూస్తున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది.

    ఇలాంటప్పుడు మెట్లు ఎక్కే సమయంలో సరిగ్గా కనిపించక పడిపోయే అవకాశం కూడా ఉంది.

     అయితే ఇదంతా కొన్ని రోజులలో అలవాటు అవుతుంది లెమ్మని సర్దిచెబుతారు.

    అలవాటు అవుతుందా లేదా అన్నది ఎవరి అభిప్రాయం వారిది.అలవాటు కాలేకపోయినా వేరే దారి లేక సరిపెట్టేసుకుంటారు చాలామంది.
    ...................

    కళ్ళజోడు తయారీలో తప్పులుంటే,  కొత్త కళ్ళజోడు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఉంటుంది. 

     కళ్ళజోడు షాపుకు వెళ్ళి అడిగితే కొందరు సరిగ్గా చేసి ఇస్తారు. 

     ఏం చేయలేం .అలాగే సర్దుకోవాలని చెప్పే వాళ్ళూ కొందరు ఉంటారు. 

    ************
     బైఫోకల్స్తో ఉన్న  సమస్య నుంచి బైట పడటం కోసం ప్రొగ్రెస్సివ్  అనే కొత్త కళ్ళజోళ్లు వచ్చాయి. అయితే వీటితో  కూడా సమస్యలు ఉన్నాయి.

    చాలామంది విషయంలో ప్రోగ్రెస్సివ్ అద్దాలు అలవాటు కావటం కష్టమని అద్దాల తయారీ దారులు కూడా చెబుతారు.

      కొందరు అద్దాల తయారీదారులేమో ప్రోగ్రెస్సివ్ మంచివి అంటారు  . కొందరేమో బైఫోకలే మంచివి అంటారు.

     మరికొందరేమో లేసర్ ఆపరేషన్ మంచిది కదా... అంటూ సలహాలు ఇస్తారు.

    లేసర్ ఆపరేషన్తో కూడా సమస్యలు ఉంటాయి. ఇలా  ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి.

    కళ్ళజోడు సరిగ్గా లేకకపోతే మెడ నొప్పులు వచ్చే ప్రమాదముంది.

    ఏతావాతా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.. శరీరంలో ఏ భాగమైనా సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటమే అన్నింటికన్నా మంచిది.

    అవసరం ఉన్నా లేకపోయినా కంప్యూటర్లు, టీవీలు అదేపనిగా చూడటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

     అందువల్ల నా అభిప్రాయం ఏమిటంటే ఎంతవరకూ అవసరమో అంతవరకే  టీవీని, కంప్యూటర్ వాడాలి.

    అయితే దురదృష్టం ఏమిటంటే .. ఈ రోజుల్లో చాలా మందికి ఉద్యోగరీత్యా  కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయ్యింది.

    ఇందువల్ల ఎందరో స్పాండిలైటిస్,వెన్ను నొప్పి, నరాల సమస్యలు, కళ్ళ సమస్యలు... వంటి సమస్యలతో బాధపడుతున్నారు.


    Monday, September 5, 2016

    వినాయక చవితి శుభాకాంక్షలు....



    అందరికి  వినాయక  చవితి  శుభాకాంక్షలు.

    ***********
    mari konni vishayaalu..

    ప్రపంచంలో అనేకప్రాంతాలున్నాయి. అక్కడి వాతావరణపరిస్థితులను బట్టి మొక్కలు, చెట్లు..ఉంటాయి. చలిప్రాంతాలలో యాపిల్స్ బాగా పెరుగుతాయి. వేడిప్రాంతాలలో  ఉసిరి..వంటివి పెరుగుతాయి. ఏ ప్రాంతాలవారు ఆ ప్రాంతంలో లభించే ఆహారాన్ని తింటే మంచిదంటారు. ఇది నిజమే.


     కానీ,ఈ రోజుల్లో భారతదేశం నుంచి చలిప్రాంతాలైన విదేశాలకు వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏం తింటే మంచిదని సందేహాలు వస్తాయి. తరతరాల నుంచి వరి,జొన్న..వంటివి తినే వారికి వారి జీన్స్ కు అవి అలవాటుఉండి, అవి తింటే చక్కగా ఉంటుందట. చలి ప్రాంతాలవారికి గోధుమ,బార్లి వంటివి బాగా పండుతాయి కాబట్టి, అవి తినటం అలవాటు. 


    అయితే, గోధుమలో  ఉండే గ్లుటెన్ చాలామందికి పడదు. ఈ రోజుల్లో గోధుమ పంటలు వేయని దక్షిణభారతం వారు కూడా గోధుమరొట్టెలు తింటున్నారు. యాపిల్స్ తింటున్నారు. విదేశాలకు వెళ్లినవారికి కూడా తరతరాలనుంచి అలవాటైన తమ సొంత దేశం యొక్క ఆహారానికి వారి జీన్స్ అలవాటుపడిఉంటాయి.


     కాబట్టి, నాకు ఏమనిపిస్తుందంటే, ఎక్కడపండే పంటలు అక్కడివారు తింటే చాలా మంచిది. అయితే ఇతర ప్రాంతాల పంటలను తిన్నా కూడా శరీరం క్రమంగా అలవాటు పడుతుందనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ ఉండే ఓట్స్, ఆలివ్స్..వంటివి తినొచ్చు, భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్న వరి, కూరగాయలు కూడా తినొచ్చు అనిపిస్తోంది.


    మనుషుల కోణం సంగతి అటుంచితే, మొక్కలు, చెట్లు కోణం నుంచి కూడా పరిశీలించాలి. కొన్ని మొక్కలు వాటికి అనువైన వాతావరణంలోనే చక్కగా పెరుగుతాయి. కొన్ని మొక్కలు విదేశాల నుంచి తెచ్చినా కూడా, భారతదేశంలో కూడా పెరుగుతాయి. ఉదా..యాపిల్స్ మొక్కలను విజయవాడ వంటి వేడి ప్రాంతాలలో పెడితే సరిగ్గా పెరగవు. అవకాడో మొక్కలను గుంటూరు లో పెంచితే కాయలు కాస్తున్నాయి.

    ఈ విషయాల గురించి మరిన్ని పరిశోధనలు జరగాలి.


    Friday, September 2, 2016

    మరి కొన్ని విషయాలు....గంగా నది వంటి నదిలో కూడా..


    ఈ మధ్యనే దేవాలయాలలో వరుణయాగాలు చేసారు . 

    దైవం  దయ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి.

     దైవానికి అనేక కృతజ్ఞతలు.                                        
    .......................................

    వర్షాల వల్ల  ఊళ్ళలోని నీరు కాలువల ద్వారా నదులలోకి చేరుకుంటుంది.  ఊళ్ళలో  పడ్డ వర్షంతో పాటు  ఊరిలోని మలినాలు కూడా నదిలోకి చేరుకుంటాయి. 

    అయితే, పాతరోజుల్లో రసాయన వ్యర్ధాలు, ప్లాస్టిక్  వంటివి లేవు కాబట్టి , సహజసిద్ధమైనవే వాననీటితో కలిసి నదులలోకి చేరి, నదులు కలుషితం కావటం తక్కువగా ఉండేది.

     అయితే, ఈ రోజుల్లో  కొన్ని  పరిశ్రమల ద్వారా విడుదలయ్యే  రసాయన వ్యర్ధాలు... వంటివి కూడా డ్రైనేజ్ ద్వారా  నదులలో , సముద్రాలలో కలిపేస్తున్నారు. 

    ఇంటి  శుభ్రతకు వాడే అనేక రసాయనాలు, ఆసిడ్స్ వంటివి కూడా  డ్రైనేజ్ ద్వారా మట్టిలో, నీటిలో.... కలిసిపోతున్నాయి.

    గంగా నది వంటి నదిలో కూడా ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాలను వదులుతున్నారంటే  ఏమనుకోవాలి?

     డ్రైనేజ్  నీరు నదులలో కలువకుండా , డ్రైనేజ్  నీటిని శుద్ధి చేసి ..ఆ శుద్ధి చేసిన నీటి  ద్వారరహదారుల ప్రక్కన మొక్కలను పెంచవచ్చు.

     నదులలో, సముద్రాలలో  మురికిని కలుపకుండా 
    జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కూడా నదులను, సముద్రాన్ని పూజించిన పుణ్యాన్నిపొందవచ్చు.