koodali

Monday, December 30, 2019

ధర్మామీటర్ మరియు కొన్ని విషయములు...


ధర్మామీటర్ గురించి కొన్ని విషయములు..


  చాలాకాలం క్రిందట మా ఇంట్లో ధర్మామీటర్ ఉండేది.  అంటే, మా పిల్లల చిన్నప్పుడు వాళ్ళకు అప్పుడప్పుడు జ్వరాలు వచ్చేవి. 


తరువాత దైవం దయవల్ల అనారోగ్యాలు తక్కువగా వచ్చాయి. ధర్మామీటర్ అవసరం కలగలేదు.


 కొద్ధి  రోజుల క్రితం ,  నాకు కొద్దిగా జ్వరం, జలుబు..  ఉంటే కొత్త  ధర్మామీటర్ కొన్నాం. నార్మల్ కన్నా వేడి ఒక పాయింట్ ఎక్కువ ఉంది.


అయితే, మేము కొన్న ధర్మామీటర్ చూసిన తరువాత కొన్ని సందేహాలు కలిగాయి.



 పాతరోజుల్లో గాజుతో తయారుచేసిన ధర్మామీటర్ లో పాదరసం కనబడుతూ ఉండేది. 



జ్వరం చూడటానికి పిల్లల నోట్లో ధర్మామీటర్ పెడితే పిల్లలు కొరికేస్తారేమోననే భయం ఉండేది.



అయితే, పాత రోజుల్లో ధర్మామీటర్లు గ్లాసుతో చేసినవైనా ఉపరితలం అంతా నున్నగా ఉండి నీటితో శుభ్రంచేస్తే చక్కగా  శుభ్రం అయ్యేది.



మేము కొన్న కొత్త ధర్మామీటర్ ప్లాస్టిక్ తో చేయటం బాగుంది కానీ, మధ్యలో రీడింగ్ చూసే దగ్గర ఒక నొక్కు ఉన్నది.



నొక్కు ఉండటం వల్ల అక్కడ నీటితో శుభ్రం చేయవచ్చో, లేదో  తెలియలేదు. శుభ్రం చేసినా నొక్కు వద్ద సరిగ్గా శుభ్రం కాకపోవచ్చు.



ఇలా నొక్కు ఉండటం వల్ల హాస్పిటల్స్లో రోగులకు ధర్మామీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేయాలి. 



 ధర్మామీటర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే ఒకరి నుంచి మరొకరికి జబ్బులు వ్యాపించే  అవకాశముంది.



 ప్లాస్టిక్ ధర్మామీటర్ పైన నొక్కు లేకుండా  నున్నగా ఉండే విధంగా  తయారుచేస్తే శుభ్రం చేయటానికి సులువుగా ఉంటుంది.



ఇప్పుడు ఎన్నో కొత్త రకం ధర్మామీటర్లు వచ్చాయట. రోగులను తాకించకుండానే దూరంగానే ఉంచి జ్వరం చూసే విధంగా డిజిటల్ ఇంఫ్రారెడ్ ధర్మామీటర్లు కూడా విదేశాల్లో వచ్చాయట.


 అయితే మనదేశంలో ఇంకా అవి అంతలా వాడకం లేదు కాబట్టి , మనం  ధర్మామీటర్లు శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.


***********


 కొత్త ధర్మామీటర్ చూసిన  తరువాత,  నాకు కలిగిన అభిప్రాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో  ఈ పోస్ట్ రాయటం జరిగింది. 

బయట హాస్పిటల్స్లో ధర్మామీటర్ను స్పిరిట్ తో క్లీన్ చేస్తారట. 


అయినా  కూడా , రీడింగ్ కనిపించే దగ్గర నొక్కు లేకుండా నున్నగా ఉంటేనే శుభ్రం చేయటం సులువని నాకు అనిపించింది. 


***************


*  ప్రస్తుతం  సమాజంలో ,
  సరైన పద్ధతిలో జీవించే విధంగా సహాయం చేయమని దైవాన్ని ప్రార్ధించటం మంచిది.


2 comments:


  1. వైద్యులు ఎన్నో రకాల మందుల పేర్లను గుర్తుంచుకోవలసి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎన్నో సబ్జెక్ట్స్ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

    వైద్యులు, స్టూడెంట్స్ అనే కాకుండా అందరికీ జ్ఞాపకశక్తి చక్కగా ఉండాలి. ఇందుకొరకు
    దైవాన్ని ప్రార్దించటం అవసరం.

    సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

    ReplyDelete
  2. ఈ రోజుల్లో చాలామందికి స్వార్ధం ఎక్కువయ్యింది. ఎవరి కర్మ వారిది.

    కొందరు అనేక పాపాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమైనా కారణాలతో ఇక్కడి చట్టం నుంచి తప్పించుకున్నా కూడా దైవం నిర్ణయించే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.


    ReplyDelete