koodali

Monday, March 23, 2020

జలుబు, దగ్గు తగ్గటానికి పానకం..........



  ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, సామాన్యమైన జలుబు, దగ్గు మొదలయినా  అది మామూలు జలుబునా?  లేక కరోనానా ? అనే భయం కూడా కలుగుతుంది.

 టెన్షన్ పెరిగితే అనారోగ్యం కలిగి  హాస్పిటల్ కు వెళ్ళే పరిస్థితి రావచ్చు.  

  ఇలాంటి పరిస్థితిలో మామూలు జలుబు, దగ్గు లేకుండా చూసుకోవటం ఎంతో అవసరం. 

 కషాయం వాడుకుంటే  మామూలు జబ్బు, దగ్గు  తగ్గిపోతుంది. 

ఆయుర్వేద మందుల వల్ల రోగనిరోధకశక్తి పెరిగి , కరోనా సోకే ప్రమాదం తగ్గే అవకాశం కూడా ఉంది.

***************

ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.

ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.

బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}


శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...


ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని  గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలిఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి. 

అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి.


ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.


ఇలా రోజూ ఉదయమే ఒకగ్లాస్ త్రాగాలి. ఒక  వారం  రోజులు త్రాగాలి.


ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.


..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. 

పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు. సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. 


కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.

ఈ  కషాయం త్రాగిన  తరువాత పావుగంటవరకూ  ఏమీ తినకుండా ఉంటే మంచిది. 


కుటుంబానికి దూరంగా ఉంటూ  చదువుకుంటున్న  పిల్లలకు, ఉద్యోగస్తులకు ఇలాంటి పొడిని కొట్టి పంపవచ్చు. చ్యవనప్రాశ వంటివి ఇచ్చి పంపవచ్చు. వాటిని వాడే విధానాన్ని సరిగ్గా తెలియజేయాలి. 

..............

కొంతమందికి
 జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా,  వారం రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.

అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి  వారం  రోజులు వాడితే మంచిది.


.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు ,దగ్గుతో చాలా బాధపడుతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. 


ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ కూడా బాగా పనిచేస్తుందండి..త్రిఫల, త్రికటు చూర్ణం..వంటివి కూడా బాగా పనిచేస్తాయి. 

అయితే ఆయుర్వేద మందులను కొంతకాలం వాడి,  కొంతకాలం గ్యాప్ ఇవ్వాలట. వాడే విధానం, డోసెజ్..వంటివి ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకుని వాడుకోవాలి. 

************

ఈ కషాయం నెలకు 5 లేక 6 లేక 7  రోజులు వాడాలి. ఎక్కువరోజులు వాడితే వేడి చేస్తుంది.  



ధనియాల కషాయం వాడేరోజుల్లో కూరల్లో ధనియాల వాడకం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ధనియాలు మందు కాబట్టి,  మోతాదు మరీ పెరగకుండా వాడుకోవాలి.


ధనియాలు, పసుపు, అల్లం, వెల్లుల్లి..వంటివి తగు మోతాదులో వాడుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఎక్కువమోతాదులో వాడితే అనారోగ్యం కలుగుతుంది. 

మందు అంటే తగుమోతాదులో మాత్రమే వాడాలి.



( నాకు తెలిసినంతలో రాసాను. ఎంతకాలం వాడాలనే విషయం గురించి  మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే  ఆయుర్వేదవైద్యులను సంప్రదించవచ్చు.) 

**************

 ఆయుర్వేదం  రెమెడీల  గురించి ఇతర దేశాలకు కూడా వారి భాషలో సమాచారం ఇవ్వవచ్చు.

కరోనాకు ప్రెవెన్షన్ గా కొందరు హోమియోలో  మందులు ఉన్నాయంటున్నారు.

 కరోనాకు  అల్లోపతిలో ఇప్పటివరకు మందులు లేవు కానీ ప్రయోగాలు చేస్తున్నారట . అయితే మందు రావటానికి కొంతకాలం పడుతుందట.



1 comment:


  1. కొబ్బరి చిప్పలకు తెల్లటి భాగం వెనుక ఒక పొర ఉంటుంది.

    కొబ్బరిని పైన ఉండే పొరతో తింటే మంచిదికాదని కొందరు అంటున్నారు.

    పచ్చికొబ్బరి పొట్టు పీలర్ తో తేలికగానే వస్తుంది. ఎండుకొబ్బరి పైపొట్టు పీలర్ తో తేలికగా రాదు.

    కొబ్బరి,కారట్ వంటివి తురమడానికి స్టీల్ పరికరం అమ్ముతారు.

    కొబ్బరిచిప్పను వెనుకకు తిప్పి, పొట్టు ఉన్న వైపు భాగాన్ని ఆ పరికరంపై తురిమితే ఎండుకొబ్బరి పైపొట్టు సులభంగా వస్తుంది.


    ReplyDelete