koodali

Friday, February 19, 2016

వేప ..తింటే సంతానం కలగదా ? చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఆస్పిరిన్ తీసుకుంటే ప్రమాదమా ?

కొందరు అనేక కారణాల వల్ల వేపాకుల పేస్ట్ తింటారు. 

అయితే,  వేప కడుపులోకి తీసుకుంటే సంతానం కలగకుండా చేసే గుణముందంటున్నారు. 

 వేపాకు పేస్ట్ కంటే వేపనూనె బాగా పవర్ఫుల్ గా ఉంటుంది.

 వేపనూనె మొక్కలపై డైరెక్ట్ గా వేస్తే ఆకులు మాడినల్లగా అయ్యే అవకాశం ఉంది. 

అందువల్ల వేపనూనె త్రాగటం వంటి  విషయాలలో  సంతానం పొందే వయసులో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.


కడుపులో పురుగులు పోవటానికి, మరియు మధుమేహం ఉన్నవారు కూడా వేప  తింటుంటారు.

 ఇవన్నీ ఆయుర్వేద వైద్యులను అడిగి చేయటం మంచిది.

ఈ క్రింద లింక్ వద్ద  మరిన్ని వివరాలను చూడగలరు. 




 చికన్ పాక్స్ వచ్చిన వారు  ఆస్పిరిన్ వాడకూడదని అంటున్నారు.  

చికన్ పాక్స్  వచ్చినప్పుడు ఆస్పిరిన్ వాడితే ఎన్నో దుష్ఫలితాలు వస్తాయట. 

వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్రింద లింక్ వద్ద చదవగలరు.


Chickenpox Treatments and drugs - Mayo Clinic



  మందులు వాడేటప్పుడు   వైద్యులను అడిగి  వాడటం  మంచిది.


No comments:

Post a Comment