koodali

Monday, February 15, 2016

శానిటరీ నాప్కిన్స్ మరియు హాస్పిటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు...కాల్చివేయటానికి యంత్రాలు..

 
 
శానిటరీ నాప్కిన్స్  మరియు హాస్పిటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు  బయటపడేయటం వల్ల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

 పాతకాలంలో శానిటరీ నాప్కిన్స్ కొంతకాలం వాడిన తరువాత వాటిని కాల్చివేసేవారు. 


ఈ రోజుల్లో శానిటరీ నాప్కిన్స్..  చాలామంది బయట పడేస్తున్నారు.  వీటిని  బయట చెత్తలో వేయకుండా కాల్చివేయటం మంచిది.


 ఈ రోజుల్లో శానిటరీ నాప్కిన్స్ కాల్చివేయటానికి  యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.  ఈ యంత్రాలలో  చిన్నవి , పెద్దవి కూడా ఉన్నాయి.


 ఇంట్లో వాడటానికి చిన్నది 8,500, 12,000.. ధరలో లభిస్తుంది. పెద్దవి ఎక్కువ రేటు ఉంటాయి . 


 (  పుండ్లు .. శుభ్రం  చేయటానికి వాడిన  దూది  మొదలైనవి కూడా ఇందులో వేయవచ్చునేమో  ? )


 పెద్ద యంత్రాలు  హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్ మరియు పాఠశాలలు, కాలేజీలు, బస్సుస్టాండ్లు, రైల్వేస్టేషన్స్ వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుంది.



ఇక హాస్పిటల్స్ నుండి వెలువడే వ్యర్ధాలను బయట పారబోయటం వల్ల రోగాలు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 



హాస్పిటల్స్  వ్యర్ధాలను నాశనం చేయటానికి పెద్ద యంత్రాలను ఏర్పాటుచేయాలి.ఇలాంటి చర్యల వద్ద రోగాలు వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది.


స్వచ్చభారత్ కావాలంటే  ఇలాంటివీ ఏర్పాటు చేయాలి.


 అనారోగ్యం వచ్చిన తరువాత వెచ్చించే ఖర్చుతో పోల్చుకుంటే ఈ యంత్రాల కొరకు చేసే ఖర్చు వల్ల ఎన్నో లాభాలున్నాయి. 



మరింత సమాచారం కొరకు  ఈ క్రింద కొన్ని లింక్స్ ఇస్తున్నాను.


Sanitary Pad Disposal Sanitary Pad Burner Easy & Safe ...


Sanitary Napkin Disposal Machine in Coimbatore, Tamil ...

Medical or Hospital Waste (STERI)

Demonstrating proper medical waste management in India

....................

కమోడ్ , చెప్పుకోలేని సమస్యలు...

 టాయ్లెట్ వాడే కమోడ్లలో, ఇండియన్ కమోడ్ డిజైన్ వల్ల శరీరం కమోడ్ కు తగలదు.

అయితే ఈమధ్య కాలంలో చాలామంది మోకాళ్ల నొప్పితో వంగలేకపోతున్నారంటూ చాలా చోట్ల పైన కూర్చునే విధంగా టాయ్లెట్ కమ్మోడ్ కట్టించుకుంటున్నారు. 


ఇళ్ళల్లోను, బయట కూడా కొత్తవిధానం కమోడ్ లే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కమ్మొడ్ పైన కూర్చుంటే మన శరీరం కమ్మొడ్ కు తగులుతుంది. 

ఇంతకుముందు వాడిన వారు అక్కడే కూర్చుని వెళ్తారు. ఇలాంటప్పుడు, ఒకరినుంచి ఒకరికి జబ్బులు వచ్చే అవకాశముంది. 

 

అందువల్ల, మనం వాడేముందు కమ్మొడ్ పైన టాయ్లెట్ పేపర్ వేసి, దానిపైన కూర్చోవటం కొంతవరకు బెటర్. 

ఇంకో సమస్య ఏమిటంటే, మలవిసర్జన సమయంలో మలం నీటిలో పడినప్పుడు కొన్ని చుక్కలు చింది శరీరంపై పడే పరిస్థితి ఉంటుంది. 

స్త్రీలకయితే ఆ నీటి చుక్కలు శరీరపు ప్రైవేట్ పార్ట్స్ లో పడే అవకాశముంటుంది. ఇది తలచుకుంటేనే చాలా భయం వస్తుంది. 



బయట టాయ్లెట్స్ ఎందరో వాడుతారు. ఎన్ని భయంకరమైన జబ్బులు వచ్చే అవకాశముందో తెలియదు.  

 నీటితో  శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే, ఆధునిక టాయ్లెట్స్ లో నీరు క్రింద పడకుండా  పొడిగా ఉండాలంటారు. 

షాపింగ్ మాల్స్, హోటల్స్, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, 
యిర్ పోర్ట్స్..ఇలా ఎన్నో చోట్ల టాయ్లెట్స్ వాడతారు.



లాంగ్ జర్నీస్ లో బయట టాయ్లెట్స్ వాడక తప్పదు. ఎక్కువసేపు టాయ్లెట్ వెళ్ళకుండా ఆపుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశముంది.  టాయ్లెట్స్ సమస్యల వల్ల ప్రయాణం అంటేనే భయమొస్తుంది. 


ఇలాంటప్పుడు మనమే టాయ్లెట్ పేపర్, డెట్టాల్ తీసుకెళ్లి కమ్మొడ్ పైన జల్లి వాడుకోవాలేమో? 

 అసలు కమ్మోడ్ పైన కూర్చోకుండా, చెత్త ఎత్తే చిన్న చాట తీసుకెళ్ళి మలవిసర్జన తరువాత కమోడ్లో వేసి.. పైప్ నీటితో క్లీన్ చేస్తే ఎలాగుంటుంది? అని కూడా అనిపిస్తుంది.


 కమ్మొడ్ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ..

 మలం ఒకేసారి నీటిలో పడకుండా నిదానంగా జారి నీటిలో పడేటట్లు, ఆ నీరు మనిషి మీద చిందకుండా, నీటికి...మనిషి కూర్చున్న దానికి కొంత దూరం ఉండేటట్లు కమోడ్ లోపలి భాగాన్ని తయారు చేయాలి. ..

అంటే, మనిషి కూర్చున్న క్రింద కాకుండా కొంత దూరంగా కమ్మోడ్ నీటిగుంత ఉండాలి.

.....................

 ఇదంతా ఇంత వివరంగా రాయవలసి రావటం ఏమిటో ఖర్మ. కొంతకాలం తరువాత ఈ పోస్ట్ డిలిట్ చేసేస్తాను.

....................... 

 కుదిరినంతలో భారతీయ మోడల్ కమోడ్ వాడటం మంచిది.





3 comments:

  1. ఇంట్లో సోఫాలు వంటి ఫర్నిచర్ కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు.
    అలాగే, శానిటరీ నాప్కిన్స్ డిస్పోసల్ మెషీన్ చిన్నది కొనుక్కుంటే ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.



    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete