koodali

Wednesday, February 4, 2015

పంచదార తయారీలో జంతువుల ఎముకలకు సంబంధించిన అవశేషాల వాడకం ఉంటుందా..

ఈ విషయంలో నిజానిజాలు సరిగ్గా తెలియటం లేదు ..ఈ విషయం శుద్ధశాకాహారులకు చాలా అయోమయాన్ని కలిగించే విషయమే. చాలా స్వీట్స్ తయారీలో పంచదారను వాడుతారు కదా మరి.

పంచదార ఉన్న పదార్ధాలు తినకుండా తప్పించుకోవటం కష్టమైన పని.


దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో కూడా పంచదార కలిసే అవకాశం ఉంది. ఉదా.. పంచామృతం వంటివి.


 ఇవన్నీ గమనిస్తే, దేవుని ప్రసాదం తయారీలో బెల్లం వాడితే మంచిదనిపిస్తోంది.పంచామృతంలో కూడా పంచదార బదులు బెల్లం వాడితే మంచిది .

......................

తెల్ల పంచదార తయారీ కోసం ఎముకలు అవసరం అయితే.. పంచదార తెల్లగా ఉండవలసిన అవసరమేమీ లేదు.


అసలు, పంచదార తెల్లగా ఉండవలసిన అవసరమేముంది. బెల్లంలా ఉంటే నష్టమేమీ లేదు కదా. 


పూర్వకాలంలో పంచదారను ఎలా తయారుచేసేవారో ? ఆ పద్ధతిలో ఇప్పుడూ  తయారుచేస్తే బాగుంటుంది.

.................
పటికబెల్లం తయారీ ఎలా ఉంటుందో ? దీనిని కూడా పంచదారతో తయారు చేస్తారా ?
....................

 విదేశాల్లో 100 శాతం శుద్ధ శాకాహార పంచదార కూడా లభిస్తుందట. ఈ శుద్ధ శాకాహార పంచదార తయారీలో ఎముకలతో తయారయిన బొగ్గును ఉపయోగించరట.


మనదేశంలో ఎందరో శాకాహారులున్నారు. మనదేశంలో కూడా ఇలాంటి 100 శాతం శుద్ధ శాకాహార పంచదార  తయారు చేస్తే ఎంతో బాగుంటుంది.


ఆశ్చర్యమేమిటంటే, శాకాహారులు ఎక్కువగా ఉండే భారతదేశంలో శుద్ధశాకాహార చక్కెర లభించటం కష్టంగా ఉంటే , మాంసాహారులు ఎక్కువగా ఉండే విదేశాల్లో శుద్ధశాకాహార చక్కెర చక్కగా లభించటం.

...................

విదేశాల్లో కూడా శుద్ధ శాకాహారులుంటారట. వీళ్ళు జంతువుల నుంచి లభించే ఎటువంటి ఉత్పత్తిని కూడా ఆహారంలో తీసుకోరట. ఉదా.. పాలను, పాల ఉత్పత్తులను కూడా తీసుకోరట. ఇలాంటి వారికోసం 100 శాతం శుద్ధశాకాహార చక్కెర విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉందట.


 కొంతకాలం క్రిందట విదేశాల్లో మాడ్ కౌ డిసీజ్ బాగా వ్యాపించింది. ఇలాంటి వ్యాధుల భయంతో కూడా కొందరు శుద్ధ శాకాహారచక్కెరను వాడే అవకాశం ఉంది.

...............

విదేశాల్లో చెరకుగడలతో తయారు చేసిన పంచదారతో పాటు బీట్ పంచదార, ఖర్జూరంతో తయారు చేసిన పంచదార..వంటివి లభిస్తాయట. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మంచిది.


 ఖర్జూరం ఎడారుల్లో కూడా పండుతుంది. నీరు అంతగా లభించని రాయలసీమ వంటి ప్రాంతాలలో విస్తారంగా ఖర్జూరం తోటలను పెంచి ఖర్జూరంతో చక్కెరను తయారు చేయవచ్చు. 


ఆర్గానిక్ సుగర్ తయారీలో.. ములక్కాయల విత్తనాల ద్వారా కూడా చక్కెరను శుద్ధి చేయవచ్చట..మనదేశంలో కూడా ఇలాంటివి ఉపయోగిస్తే బాగుంటుంది. 

..............

మనదేశంలోనూ చక్కెర తయారీ మిల్లులు ఉన్నాయి. దయచేసి వీరు శుద్ధశాకాహార చక్కెరను తయారు చేస్తే ఎంతో పుణ్యం చేసినవారవుతారు. 

శుద్ధశాకాహారచక్కెరను తయారుచేసి అమ్మితే ప్రజలకు ఎంతో మేలు చేసిన వారవుతారు.

...............
ఈ విషయాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ లింక్ వద్ద చూడవచ్చు.

Is Your Sugar Vegan? - The Vegetarian Resource Group



Search Results

7 comments:

  1. పంచదార వాడొద్దు అని అందరూ అంటారు, అందరూ బెల్లం లేదా పటిక బెల్లం వాడ మంటారు - ఈ రెండూ సుధ్ధమైనవి. మనం నూటి శాతం శుభ్రమైన పంచదార కోసం డబ్బులు వెచ్చించడం కన్నా పటిక బెల్లం పొడి చేసుకుని వాడుకుంటే మంచిది!

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నేను కూడా, పంచదార బదులు బెల్లం గానీ పటిక బెల్లం పొడి గానీ వాడవచ్చు అనుకున్నాను. అయితే పటికబెల్లం తయారీ గురించి అంతర్జాలంలో గమనిస్తే ఈ క్రింది విధంగా ఉన్నది.

      తయారుచేయు విధానము :
      ఒక గ్లాసు నీరు గిన్నె లో తీసుకొని వేడి చేసి రెందు గ్లాసుల పంచదార పోస్స్తూ కలపాలి . ఒక పరిమితమైన వేడిలోనే పంచదార అంతా కరిగిపో్యేవరకూ ఉంచి .... దానిని 5-6 రోజులు అలాగే నిలువా ఉంచాలి . అప్పుడు ఒక పొర ఉపరితలము పై ఏర్పడును . అడుగుబాగము న పంచదార పటికలు ఏర్పడి నీరు , పైన తెట్టు తీసివేయగా మనకు కావలసిన పటిక పంచదార పటికలు గిన్నె అడుగున ఉంటాయి.
      ..........................

      * చెరకుగడల రసాన్ని మరగించి, దానిని చల్లబరచి పటికబెల్లాన్ని తయారుచేయటం అనేది సరైనపద్ధతి. ఈ పద్ధతిలో తయారయిన పటికబెల్లాన్ని సందేహాలు లేకుండా చక్కగా వాడుకోవచ్చు.

      అయితే, అంతర్జాలంలో చదివిన పటికబెల్లం తయారీ విధానాన్ని గమనించితే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. పటికబెల్లం ఎలా తయారుచేస్తారో సరిగ్గా అర్ధం కావటం లేదు.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. నిజమేనండీ!పూర్ణచంద్ గారి బ్లాగులో చూశాను.అసలు తెల్లని పదార్ధాలౌ అన్నీ పాలు,వరి బియ్యం,పెరుగు వీటినన్నిట్నీ తక్కువగా వాడాలట!మోడర్న్ డయటెటిక్స్ కూడా వొప్పుకుంటున్న నిజమిది!పంచదార కన్నా బెల్లం,పటికబెల్లం మంచిదని నాకూ అనిపిస్తున్నది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండీ! బాగా తెల్లగా పాలిష్ చేసిన బియ్యం వంటివి తింటే మధుమేహం వంటి జబ్బులు వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు.పూర్ణచంద్ గారి బ్లాగులో ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలను వ్రాసారు.

      ఇవన్నీ గమనిస్తే, తెల్లగా పాలిష్ చేసిన పంచదార కంటే.. బెల్లం మరియు ముడి పంచదార వాడకమే మంచిదనిపిస్తుంది. పటికబెల్లం తయారీ గురించి సరిగ్గా తెలిస్తే పటికబెల్లాన్ని కూడా వాడుకోవచ్చు.

      Delete
  4. నమస్కారములు
    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్య వాదములు

    ReplyDelete
  5. నమస్కారములు
    మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఇలాంటి ఎన్నో మంచి విషయాలను కనుగొని అందరికీ తెలియజేస్తున్న వారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

    ReplyDelete