koodali

Friday, November 8, 2013

అసలే తెలుగు వారికి ( కొందరికి ) ఆడంబరత్వం ఎక్కువ.


ఈ  మధ్య  కాలంలో  తెలుగువారికి  ఆడంబరత్వం    మరీ   ఎక్కువైందనిపిస్తుంది.


  ఆడంబరంగా  ఖర్చు  పెట్టడం  వల్ల    అనేక  నష్టాలున్నాయి.


 వివాహాలు  మొదలైన  ఫంక్షన్స్  జరిగినప్పుడు  విచ్చలవిడిగా  ఖర్చు  చేస్తున్నారు. 


 అతిధులకు  ఎన్ని  ఎక్కువ  పదార్ధాలుతో  భోజనం  వడ్డిస్తే  అంత  గొప్ప  అనుకుంటున్నారు.  అతిధులు  కూడా    చాలా  ఆహారాన్ని  వేస్ట్  చేస్తుంటారు. 

బోలెడు  డబ్బు  ఖర్చు  చేసి   గిఫ్ట్స్  పేరుతో  స్టీలు  వస్తువులు,  ప్లాస్టిక్  మొదలైన  వస్తువులను  అతిధులకు  ఇస్తున్నారు.   


 ఇలా    అందరి  ఇళ్ళనిండా  వస్తువులు  నిండిపోతున్నాయి.  వాటిని  బయటపారవేయలేము.   

మా  ఇంట్లో  కొన్ని  వస్తువులు  ఎప్పటినుంచో  వాడకుండా  అలమరాలో  పడి  ఉంటున్నాయి.   ఇంట్లో   తక్కువ  వస్తువులు  ఉంటేనే  ఇల్లు  శుభ్రంగా  ఉంటుంది.


ఇవన్నీ  గమనిస్తే,  నాకు  ఏమనిపిస్తుందంటే,   ఇలా  ఇచ్చే  గిఫ్ట్స్  తీసుకోకుండా  ఉంటే  బాగుంటుందేమో  అనిపిస్తుంది.  


అతిధులకు    ఏమైనా   ఇవ్వాలనుకుంటే,   పండ్లు,  స్వీట్స్   వంటివి  ఇస్తే  బాగుంటుంది  కదా  !  అనిపిస్తుంది.   

   మన  పూర్వీకులు  ఇంతలా  వస్తువులను  వినియోగించేవారు  కాదు.

పూర్వీకులు  అతిధులకు  తాంబూలం  పండ్లు  వంటివి  మాత్రమే  ఇచ్చేవారు. అందువల్ల    ఇళ్ళు  మరియు  వీధులు     తక్కువ  చెత్తతో   శుభ్రంగా  ఉండేవి.  

తక్కువ  వస్తువులను  వాడితే   ప్రపంచములో   సహజవనరులు    కూడా  వేగంగా  వేగంగా  తరిగిపోవు. 

 
 
  వస్తువులను  తయారుచేయాలంటే  స్టీలు,  అల్యూమినియం,  ప్లాస్టిక్  వంటి  ఎన్నో  సహజవనరులు  అవసరమవుతాయి. 

 భూమిలో  ముడి  ఖనిజం  ఏర్పడాలంటే  ఎన్నో  వేల  సంవత్సరాల  కాలం  పడుతుందట.  వస్తువులను  తయారుచేయటానికి   అవసరమైన  ఒక  కిలో  ముడిపదార్ధం  కావాలంటే  ఎన్నో  టన్నుల  మట్టిని    తవ్వాలట. 

  ఈ  రోజుల్లో  యంత్రాల  వినియోగం  పెరిగిన  తరువాత  విచ్చల  విడిగా  ఖనిజాలను  త్రవ్వేసి  , టన్నుల  కొద్దీ  వస్తువులను  తయారుచేసి  వాడుతున్నారు.  


వాడుకున్న  ఖనిజాలను  రీసైక్లింగ్  చేసినా  ఎంతో  వ్యర్ధాలుగా  అయిపోతాయి  తప్ప,  ఖనిజముగా  మిగిలేది  తక్కువ.    అందుకే  ఇంకాఇంకా  ఖనిజాలకోసం  గనులను    త్రవ్వుతున్నారు. 


  
  పూర్వీకులు  ఒకసారి  తయారుచేసిన  వస్తువులను   ఎన్నో  సంవత్సరాలు  వాడేవారు.

  ఇప్పుడు  యూస్ అండ్  త్రో  అంటూ  వస్తువులను  ఎక్కువకాలం  వాడటం  లేదు  .  ఇలా  పారవేసిన  చెత్త  వస్తువుల  వల్ల  ప్రపంచమే    చెత్తబుట్టలా  తయారవుతోంది.  

 
 ఇప్పటి    తరాల  వాళ్ళము  ఇలా  ఖనిజాలను  ఖాళీ  చేస్తూ  పోతే    రాబోయే  తరాల  వాళ్ళకు  ఖనిజాలు  కరువై  ,  పొల్యూషన్ తో   కూడిన  ఖాళీ    ప్రపంచమే    మిగులుతుంది.


మా  డబ్బు  మా  ఇష్టం.  మా  డబ్బుతో  ఇష్టం  వచ్చిన  వస్తువులను  కొనుక్కుంటాం.  అనటానికి  లేదు.

   డబ్బు  మనదే  అయినా ,   సహజవనరులను    విపరీతంగా  వాడేయటానికి,  ప్రపంచాన్ని  చెత్తబుట్టలా  చేయటానికి   మనకు  హక్కు  లేదు  కదా  ! 







9 comments:

  1. Replies

    1. Goutami గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      దేవాలయాల సందర్శనకు ఊళ్ళు వెళ్ళి వచ్చాము.
      మీ వ్యాఖ్యలను ఈ రోజే చూశాను.
      రిప్లై ఇవ్వటములో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.

      తెలుగు వారికి ( కొందరికి ) ఆడంబరత్వం ఎక్కువ అని వ్రాసినందుకు చాలామందికి కోపం వచ్చి ఉంటుంది.

      నేను గమనించిన కొన్ని విషయాలను బట్టి అలా అనిపించి వ్రాసాను.

      Delete

  2. అసలే తెలుగు వారికి ఆడంబరత్వం ఎక్కువ!

    తెలుగు వారు కదండీ ! ఆ , డంబం 'తమ్ ' ఉన్నవాళ్ళాయే కూడాను !!

    జిలేబి

    ReplyDelete

  3. జిలేబి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    దేవాలయాల సందర్శనకు ఊళ్ళు వెళ్ళి వచ్చాము.
    మీ వ్యాఖ్యలను ఈ రోజే చూశాను.
    రిప్లై ఇవ్వటములో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.

    తెలుగు వారికి ( కొందరికి ) ఆడంబరత్వం ఎక్కువ అని వ్రాసినందుకు చాలామందికి కోపం వచ్చి ఉంటుంది.

    నేను గమనించిన కొన్ని విషయాలను బట్టి అలా అనిపించి వ్రాసాను.

    ReplyDelete
  4. Replies
    1. Tarangini గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యలను ఈ రోజే చూశాను.
      రిప్లై ఇవ్వటములో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.

      Delete
  5. అవును నిజమే ఒకరిస్తున్నారని ఇంకొకరు, అవసరం లేదనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. Ennela గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  6. మంచి విషయాన్ని చర్చించారు. ఆలోచించదగ్గ విషయం .

    ReplyDelete