koodali

Monday, November 11, 2013

సీతాఫలాన్ని చేతికి అంటకుండా తినాలనుకుంటే.....


ఇప్పుడు  సీతాఫలాలు  వచ్చే  కాలం.  తియ్యగా  ఉండే  సీతాఫలాలంటే  చాలామంది  ఇష్టపడతారు. 


సీతాఫలాన్ని    కొంచెంకొంచెం  ఒలుచుకు  తింటే   కూడా  బాగానే  ఉంటుంది. 


 అయితే, కొన్ని    సీతాఫలాలపైన    దుమ్ము,  తెల్లటి  బూజు  ఉండే  అవకాశం  ఉంది. 


*  సీతాఫలాలను   ఒలుచుకుని   తినేటప్పుడు    గుజ్జు  చేతికి  అంటకుండా,  ఇంకా  పండుపై  ఉండే  దుమ్ము,  తెల్లటి  బూజు   నోట్లోకి  వెళ్ళకుండా  ఉండాలంటే   ఇలా  తినవచ్చు.


*  సీతాఫలాన్ని  రెండు    భాగాలుగా  చేయాలి.

*  అప్పుడు  రెండు  కప్పులుగా  కనిపిస్తుంది.

*  ఒక  చిన్న  స్పూన్  తీసుకోవాలి.

*  స్పూనుతో  సీతాఫలములోని  గుజ్జును  నిదానంగా  తినాలి.  


*  అంటే, కప్పు  నుంచి    స్పూనుతో  ఐస్  క్రీమును  తిన్నట్లు  అన్నమాట.

(గింజలను  ఊసేయాలి.)

  *  తిన్న  తరువాత  ఖాళీ  అయిన  సీతాఫలపు    రెండు   కప్పులను  పడేయవచ్చు.

*  ఇలా  తినటం  వల్ల     తినేసిన  సీతాఫలపు    తొక్కను పారవేయటం  కూడా  తేలిక.




1 comment:


  1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    http://ayurbless.blogspot.in...వెబ్ సైట్ చాలా బాగుంది.

    ఆయుర్వేదం గురించి ఎన్నో చక్కటి ఉపయోగకరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

    ఇంత చక్కటి వెబ్ సైట్ గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి.

    ReplyDelete