koodali

Monday, September 24, 2012

ఆద్యంతములు లేని దైవం ఈ విశ్వాన్ని సృష్టించారు.

ఓం 

శ్రీ  వీరబ్రహ్మేంద్రస్వామి  వారు  అనేక  విషయాలను  తెలియజేసారు.   పిండం  యొక్క  అభివృద్ధి    వంటి  విషయములను  కూడా    చక్కగా  తెలియజేసారు.    పెద్దలు  తెలియజేసిన  విషయాలను,  వారి  విజ్ఞానాన్ని    గమనిస్తే   ఎంతో  ఆశ్చర్యంగా  ఉంటుంది. 


పెద్దలు  ఇంకా  ఎన్నో  విషయాలను  మనకు  తెలియజేసారు.


ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు. 


ఈ  మహా శక్తి  తన  సంకల్ప మాత్రం  చేతనే  విశ్వాన్ని  సృష్టించటం  జరిగింది.  ఈ  సృష్టిలో  అణువణువునా  సృష్టికర్త  అయిన  దైవం  ఉనికి  ఉంటుందట. 

...................
మనం  ఒక  పని  చెయ్యాలంటే  ఎంతో  ఆలోచించి  చేయవలసి  వస్తుంది.     ఇంత  పద్ధతిగా  ప్రపంచం  ఏర్పడిందంటే  దాని  వెనుక  ఎంతో  ఆలోచన   తప్పక  ఉంటుంది..... ఉండాలి  కూడా...  

  ఆలోచన  లేనప్పుడు  ఇంత  చక్కటి  సృష్టి  ఎలా  సాధ్యం  ?  అసలు   ఆలోచన  లేనిదే  ఏ  పనైనా  ఎలా  చేయగలం  ? 

కొందరు  భావిస్తున్నట్లు  ఆలోచన  అనేది  లేకుండా  యాధృచ్చికంగా  సృష్టి   జరగటం  అనే  దానికి  అర్ధం  ఏమిటి  ?  

నిర్జీవమైన , ఆలోచనలేని స్థితిలో యాధృచ్చికంగా సృష్టి ఎలా జరుగుతుంది ?    అది  సాధ్యం  కాని  విషయం.


  సృష్టిలో  ఆది  నుంచి  ఆలోచన  ఉంది.  అందుకే  దైవం  ఈ  సృష్టిని  తన  సంకల్పమాత్రం  చేతనే  సృష్టించారు....  అని  పెద్దలు  చెప్పి   ఉంటారు. 


 ఒక్క  వాక్యంలో   నా  అభిప్రాయం  ఏమిటంటే,     ఆద్యంతములు   లేని    దైవం   ఈ  విశ్వాన్ని  సృష్టించారు.

......................................

ఈ  విశ్వంలో  భూమి  ఒక  చిన్న  ప్రదేశం  మాత్రమే.  భూమిపై  ఉన్న  మనకు  తెలిసిన  విషయాలు  అత్యల్పం.  ఇతరలోకాల్లో ,  కేవలం  సంకల్పమాత్రం  చేతనే , ఎన్నో   పనులను  చేయగల  జీవులు  కూడా   ఉంటారట.  


 వారు   తమ  సంకల్పమాత్రం  చేతనే  తాము  కోరుకున్న  రూపాన్ని పొందగలగటం,    తమ  రూపాలను   తాము  కోరుకున్నట్లు  మార్చుకోవటం  వంటివి  కూడా   చేయగలరట.   వారే  అలా  చేయగలిగినప్పుడు    విశ్వం  లోని  అన్ని  లోకాలకు   సృష్టికర్త  అయిన  దైవం  తమ   సంకల్పమాత్రం  చేతనే  ఏమైనా  చేయగల  సమర్ధులు.


...............................
సంకల్పబలంతో  అసాధ్యాలు  చేయగలగటం  అనే  విషయాన్ని    కొందరు  ఒప్పుకోరు.  కానీ,   ఈ  రోజుల్లో  కూడా  మనం  చూస్తున్నాము.  కొందరు  తమ  సంకల్పబలం  చేత  ఎన్నో  అసాధ్యాలను  సాధ్యం  చేసి  చూపిస్తున్నారు.

  జుట్టుతో,  పళ్ళతో   లారీలను,  విమానాలను  లాగి  చూపిస్తున్నారు.  ఇవన్నీ  ఆధునిక  విజ్ఞానానికి  అంతుచిక్కని  విషయాలే.  ఏ  శక్తితో  వాళ్ళు  అలా  చేయగలుగుతున్నారు  ? 


 ఇలాంటి  చిత్ర విచిత్రాలెన్నో   ఈ  రోజుల్లో  కూడా    ప్రపంచంలో  జరుగుతున్నాయి.
........................

నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  మన   శరీరం  ఎలా  పనిచేస్తుందో   మనకు  పూర్తిగా  తెలియదు.  అంతెందుకు.. మన  మనస్సు    ఎలా  పనిచేస్తుందో  మనకు  పూర్తిగా  తెలియదు. 


ఇక  విశ్వ  రహస్యాల  గురించి,  దైవ  రహస్యాల  గురించి  మనకు  పూర్తిగా  ఎలా  తెలుస్తుంది  ? అతి కొద్దిగా  తెలిసినా  ఇతరులకు  అర్ధమయ్యేటట్లు  వివరించటం  కొన్నిసార్లు  చేతకాదు.

  మనం  తినే  వస్తువు  రుచిని  ఇతరులకు  వివరించటం  సాధ్యం  కాదు  కదా  !  వస్తువు  రుచి  తెలియాలంటే  ఆ  వస్తువును  తామూ   రుచి   చూడాలి .


అలాగే  కొన్ని  ఆధ్యాత్మిక    విషయాలను  వివరంగా   తెలుసుకోవాలంటే  ఎవరికి  వారు  ప్రయత్నించి   తెలుసుకోవాల్సిందే.  ( ఉదా.... ధ్యానం  వంటి  విషయాల  ద్వారా...). గురువుల  ద్వారా   తెలుసుకోవచ్చు .

......................................

  కొందరు  మహానుభావులు   ఆధ్యాత్మిక విషయాలను  ఇతరులకు  చక్కగా  వివరించగలరు.  
ఉదా... అష్టావక్ర  మహర్షి    జనకమహారాజుకు   ఆధ్యాత్మిక విషయాలను    తెలియజేసిన  విధానం  అద్భుతమైనది.


11 comments:

  1. very good concept visit our blog మనవు

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీ బ్లాగ్ నేను చూసానండి. చాలా బాగుంది.
    మీరు చక్కటి విషయాలను వ్రాస్తున్నారు.

    ReplyDelete
  3. దేవుడు విశ్వాన్ని సృష్టించలేదు. తానే విశ్వంగా మారాడు.

    ReplyDelete

  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, ఈ సృష్టిలో అణువణువునా సృష్టికర్త అయిన దైవం ఉనికి ఉంటుందట.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. SNKR gaaru,
      Rigvedam lo "Even the gods came only after the sat came into being" ani raayataaniki kaaranam, aa paramaatma 'Brahma', Vishnu, Parameswara dieties ni srushtinchaadu. Brahma lo nunchi vachinade Rigvedam. anduke alaa cheppabadindi.

      Inka srushti ela uniki loki vachindo vivaramgaa kavalante ee krindi book chadavandi.

      http://archive.org/stream/AnuragSagarOfKabir/Anurag-Sagar-Complete#page/n52/mode/1up

      Delete
    2. SNKR గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఒకసారి త్రిమూర్తులు మణిద్వీపానికి వెళ్ళి పరమాత్మ ఆదిపరాశక్తిని అద్భుతంగా స్తుతించారు.

      విష్ణుమూర్తి చేసిన స్తుతి లోని కొంత భాగం...

      * అమ్మా !....నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు. ఊహించలేరు. ఇంక ఇతరుల మాట చెప్పాలా ! ......అంటూ ఇంకా ఎంతగానో స్తుతించారు.

      ఆదిపరాశక్తి మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలు అమ్మవారిని అద్భుతంగా స్తుతించారు. ఆ స్తుతిలోని కొంత భాగం.......

      *....మహాదేవీ ! .... ఇంతటి మహోపకారాన్ని చేసిన నిన్ను ఏమని స్తుతించగలం, ఎలా స్తుతించగలం ? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే, మేమా గ్రహించి స్తుతించగల్గడం !...అంటూ ఇంకా ఎంతగానో స్తుతించారు.

      * ఈ విశ్వానికి కర్త దైవం ....అనే విషయం నిర్ధారణ అయింది.

      * ఇక, ఆద్యంతములు లేని దైవం వంటి విషయాల గురించి జగన్మాతాపితరులైన పరమాత్మఆదిపరాశక్తికే తెలుస్తుంది.
      ......................................

      నాకు సంస్కృతం తెలియదండి. ఇంగ్లీష్ కూడా తెలుగంత బాగా అర్ధం కాదు.
      స్త్రీలు వేదాలు చదవగూడదని కొందరంటారు. చదవవచ్చని కొందరంటారు. అయితే, వేదాల గురించి తెలిసిన పండితుల వల్ల వేదాలలోని కొన్ని విషయాలు నాకు తెలుసు.

      సృష్టిని గురించి " భగవద్గీత " గ్రంధంలో ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది. శ్రీకృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి.

      " శ్రీ దేవీ భాగవతము " గ్రంధంలో కూడా సృష్టిని గురించి అనేక విషయాలున్నాయి.

      " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము" గ్రంధంలో కూడా సృష్టిని గురించి అనేక విషయాలున్నాయి.

      ఈ గ్రంధాలలోని విషయాలలో నాకు అర్ధం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. అర్ధమైన కొన్ని విషయాలలో కూడా ఏ విషయం ఎంతవరకూ బహిరంగంగా చెప్పవచ్చో ఒకోసారి అర్ధం కాదు.
      గ్రంధాలలోని అన్ని విషయాలను బహిరంగంగా చెప్పకూడదని అంటారు కదా !

      " శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణచరితామృతము " గ్రంధం వారైతే కాపీరైట్స్ ద్వారా తెలియజేసారు.

      అందుకని ఈ గ్రంధాలను ఎవరికి వారు చదవటం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి.

      వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

      Delete
    3. Madhu Mohan గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  6. anrd గారు, స్త్రీలు వేదాలు చదవ కూడదా?! ఏమోలేండి తీసేశా. పాపమేదైనా వుంటే అది నాదే. :)
    ----
    మోహన్ గారు, ఒరిజినల్ సూక్తంలో 'సత్ ' లేదు, అనువాదంలోనే వుంది. మీ లింక్ చూస్తాను, ధన్యవాదాలు.

    ReplyDelete
  7. ఫరవాలేదు. ఇందులో పాపం ఏమీ రాదు లెండి.

    స్త్రీలు వేదాలను చదవటం గురించి నాకూ సరిగ్గా తెలియదండి. అయితే చదవకూడదని కొందరంటారు మరి.

    వేదాలు చదివి అర్ధం చేసుకోవటం ...... ఇవన్నీ చేస్తూ ఉంటే స్త్రీలకు కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి సమయం సరిపోదు కదా ! అందుకే స్త్రీలకు అలాంటి విషయాలను చెప్పి ఉండరు.

    స్త్రీ తన కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చటం వంటివి చేస్తే చాలు.... వేదాలు చదవకపోయినా, తేలికగా పుణ్యం వచ్చే అవకాశాన్ని పెద్దలు కలిగించారు.

    ReplyDelete
    Replies
    1. :)) svargaaniki short-cut annamaaTa!

      Snkr

      Delete