koodali

Friday, October 28, 2011

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని ..........



సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు అనంతంగా ఉన్నాయి.

రమణ మహర్షుల వారు " నేను " అంటే ఏమిటి అని విచారణ చెయ్యమని చెప్పారట.

మనం మనకే అర్ధం కాము.

మన మనస్సు, మన శరీరం ఇవన్నీ కలిపి నేను అని భావిస్తూ
ఈ " నేను " కోసం , ఎంతో తాపత్రయపడిపోతాము.

చిత్రమేమిటంటే మన మనస్సు గురించి కానీ, మన శరీరంగురించి కానీ మనకు ఏమీ తెలియదు.,

తెలుసుకోవాలన్నా మనకి ఏమీ అర్ధం కాదు.

మన మనస్సు మనదే అనుకుంటాము కానీ ,

మరి మన మనస్సు మనం చెప్పినట్లు ఎందుకు వినదన్నది ఎంత ఆలోచించినా అర్ధం కాదు.

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని వాళ్ళను నిందించటం అనవసరం.

నా మనస్సు, నా మనస్సు అని నేను తాపత్రయపడటమే కానీ, దానికి అలాంటి మొహమాటమేమీ ఉన్నట్లు కనిపించదు.

మనం ఏపనైతే చెయ్యకూడదు అనుకుంటామో మన మనస్సు ఆ పనే చెయ్యాలని
ఒకోసారి మొండికేస్తుంది.

దీనిని అదుపులో పెట్టటం చాలా కష్టం.

చాలాసార్లు ఈ మనస్సును అదుపులో పెట్టలేక నేను ఎంత నరకాన్ని అనుభవించానంటే ,

నాకు అనిపిస్తుంది, చెరకు గడలు యంత్రంలో నలిగేటప్పుడు అనుభవించే బాధ ఇలాగే ఉంటుందేమో ! అని.

అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే, భగవంతుని శరణు వేడాలి అని పెద్దలు చెబుతారు.

అయితే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు.

మట్టి కూజా కాలితేనే కదా గట్టి కూజా తయారయ్యేది.

గొంగళిపురుగు దశ తరువాతే అందమైన సీతాకోక చిలుక దశ వస్తుంది.

అలాగని నేనేదో సీతాకోకచిలుక దశకు వచ్చేశానని కాదు.


కష్టాలు వచ్చినప్పుడు
ఎవరూ కూడా గాభరాపడకుండా ఉండాలి అని చెబుతున్నాను అంతే . .

కష్టాలు సుఖాల కొరకే.


కష్టాల వల్ల పూర్వపాపం ఖర్చయిపోతుంది. సుఖాలవల్ల పూర్వపుణ్యం ఖర్చయిపోతుందని పెద్దలు చెప్పారు కదా !


అయితే నా మనస్సు అంటే నాకు ఇష్టమే. దైవప్రార్ధన చేయాలంటే దాని సహాయం కూడా అవసరమే కదా !


అంతా దైవం దయ.

ఇక శరీరం...దానిగురించి మాత్రం మనకేం తెలుసు.?

ఇలా ఆలోచించగా
.... ఏం తెలుస్తుందంటే మన మనస్సు, శరీరం వేటిపైనా మనకు అంతగా అడ్డూ, అదుపు, అధికారం లేవని అర్ధమవుతుంది.


మన శరీరంలో మనం శ్వాస తీసుకునే ప్రక్రియ కూడా మన ప్రమేయం లేకుండానే జరిగేటట్లు ముందే ఏర్పాటు చేయబడి ఉంది.

అందుకే కదా మనం నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.

ఎంత అద్భుతమైన దైవసృష్టో కదా ! అనిపిస్తుంది.

మన శరీరం అనబడేది ఆక్సిజన్, కార్బన్, వంటి కొన్ని ఎలిమెంట్స్ తో తయారుచేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా !

అంటే శరీరమంటే గాలి, నీరు ఇలాంటివేనన్నమాట.

మరి అందులో చైతన్యం ఎలా వస్తుందో? జీవులు ఇన్నిపనులు ఎలా చేస్తున్నారో ?

అంతా అత్యంత ఆశ్చర్యం, అద్భుతం.

ఆధునిక శాస్త్రవేత్తలు శరీరంగురించి ఇలా చెబుతున్నారు.

Question: What Are the Elements in the Human Body?


Answer: Most of the human body is made up of water, H2O, with cells consisting of 65-90% water by weight. Therefore, it isn't surprising that most of a human body's mass is oxygen. Carbon, the basic unit for organic molecules, comes in second. 99% of the mass of the human body is made up of just six elements: oxygen, carbon, hydrogen, nitrogen, calcium, and phosphorus.

1. Oxygen (65%)
2. Carbon (18%)
3. Hydrogen (10%)
4. Nitrogen (3%)
5. Calcium (1.5%)
6. Phosphorus (1.0%)
7. Potassium (0.35%)
8. Sulfur (0.25%)
9. Sodium (0.15%)
10. Magnesium (0.05%)
11. Copper, Zinc, Selenium, Molybdenum, Fluorine, Chlorine, Iodine, Manganese, Cobalt, Iron (0.70%)
12. Lithium, Strontium, Aluminum, Silicon, Lead, Vanadium, Arsenic, Bromine (trace amounts)

Reference: H. A. Harper, V. W. Rodwell, P. A. Mayes, Review of Physiological Chemistry, 16th ed., Lange Medical Publications, Los Altos, California 1977.


శాస్త్రవేత్తలు చెప్పినట్లు శరీరం అంటే గాలి, నీరు అయితే మన పెద్దలు చెప్పినది కూడా అదే కదా ! అంతా మట్టి, గాలి, నీరు, అంతా మాయ.

ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది కదా !
అంతా దైవం దయ....

(నేను వ్రాసినవి చదివి నాకు ఏవో సినిమా కష్టాలవంటి కష్టాలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి. దైవం నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు.

అయితే,
ఈ రోజుల్లో చాలామంది జీవితంలో 90 శాతం మంచి ఉన్నా కూడా, మిగిలిన 10 శాతం లోటును గురించే ఆలోచిస్తూ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు కదా ! . నేనూ అలాగే.. ) ..



4 comments:

  1. శాస్త్రవేత్తలు చెప్పినట్లు శరీరం అంటే గాలి, నీరు అయితే
    --------------
    వాటిని ఉపయోగించి సజీవ శరీరాన్ని చెయ్యలేము కదా. అందుకే ఇంకా ఏదో ఉంది. అదే దైవత్వ మేమో.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    "వాటిని ఉపయోగించి సజీవ శరీరాన్ని చెయ్యలేము కదా. అందుకే ఇంకా ఏదో ఉంది. అదే దైవత్వ మేమో." మీరు చెప్పినది నిజమేనండి.

    " ఒక యోగి ఆత్మకధ " గ్రంధంలో పెద్దలు చెప్పటం జరిగింది. ప్రాచీనులు చెప్పిన విషయాలు నిజమని ఇప్పుడు తెలుస్తున్నది. అన్నట్లు చెప్పటం జరిగింది....

    ReplyDelete
  3. విశ్వంలోనూ, మెరుపు, ఉరుము వంటి వాటిలోనూ, ఇంకా అన్ని జీవులలోనూ అంతర్లీనంగా ఉండే శక్తి లేక చైతన్యము కూడా దైవప్రసాదితమే అని ఎందరో పెద్దలు చెప్పటం జరిగింది.

    ReplyDelete
  4. జీవులలో అంతర్లీన శక్తుల గురించి నేను రేపు పోస్ట్ వేస్తున్నాను చూడండి.

    ReplyDelete