koodali

Monday, October 3, 2011

భక్తి యోగములో కొంత భాగము......3.


ఓం.

ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించినవాడవై దీనిని గూడ నాచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మల యొక్క ఫలములను త్యజించివేయుము.


వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.


సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.


ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో,లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు
.

( వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..).



No comments:

Post a Comment