koodali

Saturday, March 27, 2010

జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

 

 

ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము. పిల్లలు వారి జీవితాంతం ఈ అమ్మా,నాన్న ఉంటారాలేక... వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని .....అతి చిత్రమయిన పరిస్తితిలో చాలామంది పిల్లలు ఉన్నారు.


అంటే మరి.... తల్లితండ్రి వేరే పెండ్లి చేసుకుంటే......... కొత్తా అమ్మానాన్న వస్తారు కదా అలా అన్నమాట.


ఇది రాయటానికి నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజుల్లో భార్యాభర్తలను చూస్తే నాకు చాలా జాలిగా కూడా ఉంటుంది. రకరకముల ప్రాబ్లంస్ ,ఒకోసారి పెద్దలు పంతాలు ,పట్టింపులు కూడా పెద్దపెద్ద గొడవలవుతాయి.



ఏదిఎలా ఉన్నా ఒక జంట గుర్తుంచుకోవాల్సింది ఏమంటే......... మనము జీవితములో చిన్నతనములో పెద్దల మాట గౌరవిస్తాము. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,అల్లుళ్ళను చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటే అప్పుడు మనకు ఒపిక ఉండదు కాబట్టి.


మరిఈ మద్య కాలంలో జీవితములో ఎంతమందికి అంటే ఆఫీసులలో పైవారికి ,ఇంటిప్రక్కవారికి,పనివారితోను,కూరలవారితోను,మనసొంతపిల్లలతోను, ఇలాఎంతో మందితో సర్దుకుపోతుంటాము.మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.

మరి భార్యాభర్తలు కూడా ఇలా సర్దుకుపోతే ఈప్రపంచములో చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారి జీవితము ఎంతో సంతోషముగా ఉంటుంది.



నాకుతెలుసు ఇది కష్టమయిన పని అని. కాని కొంచము ప్రయత్నించిచూడండి. మనము కుటుంబం అన్నాక పెద్దల వల్ల , పిల్లలు, ఆర్దిక సమస్యలవల్లా భార్యాభర్తలకు తప్పక గొడవలు వస్తాయి. బయటివారికి ఇవన్నీ ఉండవు కాబట్టి ఇన్ని సమస్యలు రావు,



మనము మన చిన్నతనములో మన అమ్మమ్మా,నాయనమ్మా ఊర్లు వెళ్తే,......... వారు ఎంత ఆప్యాయముగా మనల్ని చూసారో మనపిల్లలకు కధలుగా చెపుతాము.


మరి మన పిల్లలకు మనము ఇలాంటి ప్రేమలు ఇవ్వాలంటే మన పిల్లలు మనుమలు, మనుమరాండ్రు మన ఆప్యాయతలు పొంది సుఖముగాపెరగాలంటే ఈనాటి భార్యాభర్తలు కూడా సర్దుకుపోకతప్పదు.



మనపెద్దలు సర్దుకుపోయారు కాబట్టి మనము ఇలాసంతోషముగా ఉన్నాము. మనపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తమ సొంత అమ్మ బదులు వేరే అమ్మ ,....సొంతనాన్న బదులు వేరే నాన్న ఉంటే వారి మనస్సూ ఎంత భాదగా ఉంటుందో ఆలోచించండి. వారు ఎంత బాగా చూసినా సరే..


ఈసారి పోట్లాటలు వచ్చినప్పుడు బయట అయితే కోపము ఎలా అణుచుకుంటామో గుర్తు తెచ్చుకోండి. అందరి కాపురములు సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను. ...

 

No comments:

Post a Comment