koodali

Wednesday, March 17, 2010

భగవంతుని విషయములో మనము చేసేది తప్పా......

 

నా బ్లాగ్ పేరు ఆనందం.నావంటి సామాన్యులు కూడా మా అభిప్రాయములు తెలిపేవిధముగా ఇటువంటి టెక్నాలజీ కనిపెట్టిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.


భగవంతుని ఫొటోస్ గురించి నా అభిప్రాయములు చెప్పాలని ఉంది. దయచేసి మీరూ ఆలొచించండి.

మనము దేవుని ఫొటోస్ కూడా దేవునితో సమానముగా గౌరవిస్తాము. మరి ఎక్కువగా ప్రింట్ చేసి వాడిన తరువాత చెత్త లో వెయ్యటము వల్ల పుణ్యం రాకపోగా పాపము వస్తుందని నా అభిప్రాయము.



మనము గుడికి వెళ్ళేటప్పుడు దారిలో చించి పడవేసిన హారతి మఱియు అగరుబత్తి కవర్లు వాటిపైన దేవుని బొమ్మలు మీరు చూసే ఉంటారు. అవి తొక్కుతూనే మనము గుడిలోకి వెళ్తాము .మరి ఇది ఎంత ఘోరం.

ఈరోజుల్లో గుడి లో ఇచ్చే ప్లాస్టిక్ ప్రసాదం కవర్స్ పైన కూడా దేవుని బొమ్మలు ఉంటున్నాయి.


మరి ప్రసాదం తిన్నాక ఆ కవర్లు నీటిలో వేస్తే పొల్యుషన్. మరి అయిపోయిన ప్రసాదం కవర్లు ఎక్కడ వెయ్యాలి అన్నది సమస్య. వాటిని చెత్తకుప్పలలోనే వెయ్యటం ఎంతో పాపం .


అందుకే భగవంతుని బొమ్మలు తక్కువగా ప్రింట్ వేసి భగవంతుని ఎక్కువగా మనసులో నిలుపుకుందాము.ఆదేవుని దయకు పాత్రులమవుదాము.

మన పాత కాలములో ఇన్ని విగ్రహములు లేకపోయినా వారు మనకంతే తక్కువ భక్తులు కాదని నా అభిప్రాయము.

మనము అందరము ఈ విషయం దయచేసి ఆలోచించాలి.


ఈ రోజుల్లో మన కష్టాలకు ఇలా భగవంతుని అవమానించటము కూడా ఒక కారణమని నా అభిప్రాయము.

ఆ మద్య కొందరు మన దేవుని బొమ్మలు చెప్పులమీద ప్రింట్ వేసినందుకు ఛాలా బాధ పడ్డాము. మరి మనము చేసే పనులు కూడా అటువంటివే కదా దయచేసి ఆలోచించండి...
.



No comments:

Post a Comment