koodali

Tuesday, March 30, 2010

విడాకుల వలన లాభమా....

 
 
అసలు 90 పర్సెంట్ ఆడవాళ్ళు, 90 పెర్సెంట్ మగవాళ్ళు ఒకే మెంటలిటి ఉంటుందని నా అభిప్రాయము. కొంతమంది రెండు, మూడు పెండ్లిండ్లు చేసుకున్నాక అప్పుడు తత్వము తెలుసుకుంటారు. ఇక చేసేదిలేక అప్పుడు సర్దుకుపోవటము నేర్చుకుంటారు. తాము చాలా సంతోషముగా ఉన్నట్లు ప్రపంచానికి కనిపిస్తారు. ఈ సర్దుకుపోవటము మొదటి పెండ్లివారితోనే అయితే కనీసము వారి తల్లితండ్రులు,పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు.
 

పోనీ,  ఇంకో అవకాశం చూడాలి.. అనే ఆశ ఉండటం సహజం కాబట్టి, ఒక వివాహం ఫెయిల్ అయినప్పుడు, తిరిగి  ఇంకో వివాహం చేసుకోవటం కొంత వరకూ ఫరవాలేదు. అలాగని పదేపదే ఫెయిల్ అవటం, తిరిగి వివాహాలు చేసుకోవటం సరికాదనిపిస్తుంది.


ఈ సారి భార్యాభర్తలూ మీమద్య గొడవ వచ్చినప్పుడు మీరు ముసలి వారు అయ్యాక మీ పిల్లలు,కోడళ్ళు,అల్లుళ్ళు, లేక వ్రుద్దాశ్రమములో ఎవరయినా మిమ్ములను విసుక్కోవటము మీరు ఓపికలేక నోరుమూసుకుని సర్దుకుపోవటము ఊహించుకోండి. ఇది పెద్దయ్యాక ప్రతి ఒక్కరికి తప్పని పరిస్తితి. మరి వారందరిమాట వినే మనము భార్య మాటభర్త, భర్తమాటభార్య వింటే తప్పేమిటి.ఇంకా మనసు భరించక పోతే భగవంతుని సహాయము చెయ్యమని ప్రార్దించండి.


ఇక మరీ తప్పని పరిఖర్మ ప్రకారము విడిపోవాలిసివస్తే వేరే వారి కాపురము లో చిచుపెట్టకుండా గౌరవముగా ఉంటే బాగుంటుంది. అప్పుడుఅందరూ గౌరవిస్తారు. అందరి కాపురములు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. 



2 comments:

  1. Chaala chakkaga chepparandi. Exactly my thoughts.

    ReplyDelete
  2. చదివినందుకు థాంక్స్ సార్.

    ReplyDelete