koodali

Monday, December 3, 2012

కొన్ని విషయాలు.


మేము  కొంతకాలం  క్రిందట  అమర్నాధ్  యాత్రకు  వెళ్ళాము.  అమరనాధ్  హిమాలయాల  పర్వతాలపై  వెలసింది. అక్కడ  ప్రవహించే  సెలయేళ్ళలోని  నీరు  ఎంతో  స్వచ్చంగా  మినరల్  వాటర్ లా   ఉంది. 


 అమర్నాధ్  గుహలో  చాలా  చల్లగా  ఉంటుంది.   గుహ  అంటే  ఇరుకుగా  ఏమీ  ఉండదు.  చాలా  ఎత్తుగా,  విశాలంగా   ఉంటుంది.  భక్తుల  కాళ్ళకు  చల్లదనం  తగలకుండా ,  దేవస్థానం  వాళ్ళు  గుహలో  కొంతమేర  పట్టాలు  వేసారు. 


 పూర్వం  అమర్నాధ్  వెళ్ళాలంటే  ఎక్కువ  రవాణా  సౌకర్యాలు  ఉండేవి  కావట.  ఇప్పుడు  చాలా    సౌకర్యాలను  ఏర్పాటు  చేసారు.  



  హిమాలయాలపై    వైలెట్,  పసుపు  పూలతో  చిన్నచిన్న పువ్వుల మొక్కలు  భలే  ఉన్నాయి. ఒక  దగ్గర   నీరు  జలజల  ప్రవహిస్తూ   సూర్యకాంతి   వల్ల  ఇంద్రధనుస్సు  ఏర్పడింది.  ఇలాంటి  వింతలెన్నో  ఉన్న  అదొక  అద్భుతమైన  ప్రపంచం.   అమరనాధ్  యాత్ర అద్భుతమైన  యాత్ర.
..................................

పార్వతీ  వల్లభ  నీలకంఠాష్టకం.....


1.నమో  భూతనాధం  నమో  దేవదేవం  నమః కాలకాలం  నమో  దివ్యతేజం


నమః కామభస్మం  నమశ్శాంతశీలం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం ..

2.సదా తీర్ధసిద్ధం  సదా  భక్తరక్షం సదా  శైవపూజ్యం సదా  శుద్ధభస్మం


సదా  ధ్యానయుక్తం  సదా  జ్ఞానతల్పం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం  ..

3.శ్మశానం శయానం  మహాస్థానవాసం  శరీరం  గజానం  సదా  చర్మవేష్టం


పిశోచం  నిశోచం పశూనాం  ప్రతిష్టం  భజే  పార్వతీ  వల్లభం  నీలకంఠం..

4.ఫణీ నాగకంఠే  భుజంగాద్యనేకం  గళేరుండమాలం   మహావీరశూరం


కటిం వ్యాఘ్రచర్మం  చితాభస్మలేపం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం ..

5.శిరశ్శుద్ధ  గంగా శివా వామభాగం  బృహద్దీర్ఘకేశం  సదామాం  త్రినేత్రం


ఫణీనాగకర్ణం  సదా  బాలచంద్రం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం  ..

6.ఉదాసం  సుదాసం  సుకైలాస వాసం  ధరానిర్ధరం  సంస్థితం  హ్యాదిదేవం  


అజా హేమకల్పదృమం  కల్పసేవ్యం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం ..

7.మునీనాం  వరేణ్యాం  గుణం  రూపవర్ణం  ద్విజానాం  పఠంతం  శివం  వేద  శాస్త్రం


అహో దీనవత్సం  కృపాలం  శివం  హి భజే పార్వతీవల్లభం  నీలకంఠం..  


8.సదా  భావనాధ  స్సదా  సేవ్యమానం  సదా  భక్తిదేవం  సదా  పూజ్యమానం


  సదా తీర్ధవాసం  సదా  సేవ్యమేకం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం   ..

ఫలం :  ఇష్టకామ్యార్ధ సిద్ధి,  ఆధ్యాత్మికాభివృద్ధి.  


వ్రాసిన  వాటిలో   ఏమైనా  పొరపాట్లు,  అచ్చుతప్పులు  వంటివి  ఉన్నచో ,   దైవం  దయచేసి  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను. 


Friday, November 30, 2012

స్త్రీలు ఆభరణాలను ధరించటం గురించి...


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.

 ................................

స్త్రీలు ఆభరణాలను   ధరించటం  గురించి...  నేను  పాత    టపాలలో  వ్రాసిన కొన్ని   విషయాలను  ఇక్కడ   ఇస్తున్నానండి.  

జున్,   2011

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

పూర్వం ఆడవాళ్ళు ఇప్పటిలా ఉద్యోగాలు చేసి సంపాదించటం తక్కువగా ఉండేది.

భర్త ఎంత ధనికుడయినా ఆడవారికి తమకంటూ సొంతానికి కొంత ధనం ఉంటే వాళ్ళకు స్వతంత్రంగా ఉంటుంది.

ఒక ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే .......... పండుగలకు కొత్త బట్టలు, ఆడుకొనే బొమ్మలు, తినే వస్తువులు ఇవన్నీ .......... తల్లిదండ్రులు పిల్లలు అందరికి ఇస్తుంటారు.

అలాగే,   తల్లిదండ్రులు   తమ ఆడపిల్లలకు    వారి వివాహం సందర్భంగా ........... ముచ్చటపడి ఆ పిల్లలకు కానుకలు ఇచ్చి అత్తవారింటికి పంపేవారు.

డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ,........ తక్కువగా ఉన్నవాళ్ళు తమకున్నంతలో కానుకలు ఇచ్చుకొనేవారు.

ఆ కానుకలు   ఆ ఆడ పిల్లలకు ఒకోసారి ఆపదలో అండగా కూడా ఉపయోగపడేవి.

అలా ఆడవాళ్ళు  పుట్టింటినుంచి తెచ్చుకున్న ధనాన్ని,  భర్త మొదలైన వారు కూడా వాడుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.


(  ఆ  రోజుల్లోని  వాళ్ళు.  )

స్రీ ధనంగా భావించి దానిని ఆమెకే ఉంచేసేవారు. ఆ కానుకలు ఆమె తమ పిల్లలకు ఇచ్చుకోవటం జరిగేది.

అలా ముచ్చటగా మొదలైన వ్యవహారం ............. ఇప్పుడు వికృతరూపం దాల్చి ఆ కానుకల కోసం ఎంతకైనా తెగించేస్థాయికి పరిస్థితులు వచ్చాయి.

తప్పు ఎక్కడ వచ్చింది అంటే,  మనుషుల మనస్తత్వాలు మారటం వల్ల వచ్చింది.

డబ్బు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాలు పెరిగిపోవటం,  తేరగా ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఆశ పడటం, డబ్బు కోసం హుందాతనం లేకుండా లేకిగా ప్రవర్తించటం, మానవసంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారిపోవటం వల్ల........... ఈ అనర్ధాలన్నీ జరుగుతున్నాయి.

చాలామంది మగవారినే ఆడిపోసుకుంటారు గానీ ........... ఈ డబ్బు గొడవల్లో భర్త ఒక్కడే కాదు. చాలా సార్లు అత్తా, ఆడపడుచుల ప్రమేయం కూడా ఉంటుంది. ....

ఒక భర్త తన భార్యను కొడుతున్నప్పుడు తోటి ఆడవాళ్ళుగా అత్తగారు , ఆడపడుచులు, అలా చేయటం తప్పు అని చెపితే ............... భార్యను కొట్టే భర్త ప్రవర్తన మారే అవకాశం ఎంతయినా ఉంది.

అలా చేయకపోగా కొందరు అత్తగార్లు, ఆడపడుచులు విషయాన్ని మరింత పెద్దది చేస్తారు.
...............


 స్త్రీలు ఆభరణాలు వేసుకోమని చెప్పటం వల్ల చాలా లాభాలున్నాయి. వాటిని ధరించటం వల్ల అందం, అలంకారం అని అందరికీ తెలుసు. 


ఇంకా ,
బంగారు ఆభరణాలు ధరించటం ,మట్టిగాజులు ధరించటం వల్ల ఆరోగ్యం కలుగుతుందట. 


స్త్రీలకు వివాహ సమయంలో పుట్టింటివారు, అత్తింటివారు ఆభరణాలు చేయిస్తారు.

ఈ ఆభరణాలు స్త్రీల దగ్గరే ఉంటాయి.  కాబట్టి,   అవి స్త్రీలకు ఆస్తిలాగా ఆపద సమయంలో ఆదుకుంటాయి.

ఉదా........ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు.

భర్తకు ఎప్పుడయినా అవసరమయితే భార్య తన ఆభరణాలు ఇవ్వటం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవచ్చు.

ఆ ఆభరణాలను తన పిల్లలకో , మనుమలకు, మనుమరాళ్ళకు ఇచ్చుకోవచ్చు.

ఇంకా,   పూర్వం మహారాణులు వంటి వారు కష్టాలలో ఉన్నప్పుడు ( ఉదా...శత్రువులు ముట్టడించినప్పుడు ) వారి ఆభరణాలు వారికి ఉపయోగపడేవట.


సీతమ్మ వారి జాడ కనుగొనే సందర్భంలో ఆమె జారవిడిచిన ఆభరణాల పాత్ర అందరికి తెలిసిందే.

స్త్రీలు ఆభరణాలు వేసుకోవాలి అనటం ద్వారా ................ స్త్రీలకు ఆభరణాల రూపంలో ఆర్ధికలాభాన్ని ఏర్పాటు చేశారేమో పెద్దలు అనిపిస్తుంది.

ఎందుకంటే, ఇంట్లో వాళ్ళు.... ఆడవాళ్ళ ఆభరణాలను అంత త్వరగా తీసుకోరు కదా !.మరీ కష్టాల్లో ఉంటే తప్ప. (ఇప్పుడు  పరిస్థితి   మారిపోయింది  లెండి.)

అయితే మితిమీరిన భోగాల వెనుక రోగాలు ఉన్నట్లు, మితిమీరి పసిడిని ప్రోగుచేస్తే దాని వెనుక దొంగల భయం వంటి ప్రమాదాలు ఉంటాయి.

ఇవన్నీ చూస్తే పెద్దలు ప్రవేశపెట్టిన ఆచారాల వెనుక... ఎన్నో విషయాలు ఉంటాయని అనిపిస్తుంది.



Wednesday, November 28, 2012

ఓం...


ఓం.
దైవానికి  అనేక  నమస్కారములు.
అగ్ని  లింగ  క్షేత్రమైన   తిరువణ్ణామలైలో  వెలిగించే  కార్తిక  దీపదర్శనం  ఎంతో  పుణ్యప్రదం.   తిరువణ్ణామలై  విశేషాలను  ఈ  లింక్ ల లో  చూడవచ్చు.

::: Om Arunachala ::: - Tiruvannamalai, Deepam, Girivalam ...


Thiruvannamalai Deepam - 2012 - YouTube



కార్తిక  పౌర్ణమి  రోజున కొందరు,   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారి  వ్రతం  చేసుకుంటారు. త్రిమూర్తి  స్వరూపులైన   శ్రీ  సత్యనారాయణ స్వామి  వారికి  అనేక  నమస్కారములు.



Monday, November 26, 2012

ఓం,శ్రీ విశ్వనాధాష్టకము.శ్రీ అన్నపూర్ణాష్టకము......

ఓం
శ్రీ విశ్వనాధాష్టకము

గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర  విభూషిత  వామభాగం
నారాయణ ప్రియ  మనంగ  మదాప  హారం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వాచామ  గోచర మమేయ  గుణస్వరూపం
వాగీశ  విష్ణు సురసేవిత పాదపీఠం
వామేన  విగ్రహవరేణ  కళత్రవంతం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

భూతాధిపం  భుజగభూషణ  భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం  జటిలం  త్రినేత్రం
పాశాంకు  శాభయవరప్రద  శూలపాణిం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

శీతాంశుశోభిత  కిరీట  విరాజమానం
ఫాలేక్షణాచల  విశోషిత  పంచబాణం
నాగాధిపా  రచిత  భాసుర  కర్ణపూరం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

పంచాననం  దురిత  మత్తమదంగజానాం
నాగాంతకం  దనుజపుంగవ  పన్నగానాం
దావానలాం  మరణశోక  జరాటవీనాం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

తేజోమయం  సగుణ  నిర్గుణ  మద్వితీయం
ఆనందకంద  మపరాజిత  మప్రమేయం
నాదాత్మకం  సకల  నిష్కళ  మాత్మరూపం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

ఆశాం  విహాయ పరిహృత్య  పరస్య  నిందాం
పాపేరతించ  సునివార్య  మనస్సమాధౌ
ఆదాయ  హృత్కమల  మధ్యగతం  పరేశం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

రాగాదిదోష  రహితం  స్వజనానురాగం
వైరాగ్య  శాంతినిలయం  గిరిజా సహాయం
మాధుర్య ధైర్య  సుభగం  గరళాభిరామం
వారాణసీ  పురపతిం  భజ  విశ్వనాధం .

వారాణసీ  పురపతేః స్తవం  శివస్య
వ్యాసోక్త మష్టక మిదం  పఠతే  మనుష్యః
విద్యాం శ్రియం  విపులసౌఖ్య  మనంతకీర్తిం
సంప్రాప్య  దేహవిలయే  లభతేచ  మోక్షం .

 విశ్వనాధాష్టక  మిదం  పుణ్యం  యః  పఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి  శివేన  సహమోదతే.

ఫలం..ధనధాన్యాలూ,  విద్యా  విజయాలూ,  ఇహపర  సర్వ సౌఖ్యాలు.

శ్రీ  అన్నపూర్ణాష్టకము

 
నిత్యానందకరీ  వరాభయకరీ  సౌందర్య  రత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర  పావనకరీ  ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల  వంశపావనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

నానారత్న   విచిత్ర  భూషణకరీ    హేమాంబరాడంబరీ
ముక్తాహార  విడంబమాన  విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు  వాసితాంగ  రుచిరే  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

యోగానందకరీ  రిపుక్షయకరీ  ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ  త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ  తపఃఫలకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

కైలాసాచల కందరాలయకరీ  గౌరీ  ఉమా  శాంకరీ
కౌమారీ  నిగమార్ధగోచరకరీ  ఓంకార  బీజాక్షరీ
మోక్షద్వార  కవాట  పాటనకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ .

దృశ్యాదృశ్య  విభూతి  పావనకరీ  బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక  సూత్రఖేలనకరీ  విజ్ఞాన  దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః  ప్రమోదనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

ఆదిక్షాంత  సమస్త  వర్ణనకరీ  శంభుప్రియే  శాంకరీ
కాశ్మీరే  త్రిపురేశ్వరీ  త్రినయనీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
స్వర్గద్వార  కవాటపాటనకరీ  కాశీ  పురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ 
మాతాన్నపూర్ణేశ్వరీ .


ఉర్వీసర్వజయేశ్వరీ  దయాకరీ  మాతాకృపాసాగరీ
నారీ  నీలసమానకుంతలధరీ  నిత్యాన్న  దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి   కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

దేవీసర్వవిచిత్రరత్న  రచితా  దాక్షాయణీ  సుందరీ
వామాస్వాదుపయోధర  ప్రియకరీ  సౌభాగ్య  మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ  దశాశుభకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్న  పూర్ణేశ్వరీ .

చంద్రార్కానల  కోటికోటి  సదృశా  చంద్రాంశు  బింభాధరీ
చంద్రారాగ్ని  సమాన  కుండలధరీ  చంద్రార్క  వర్ణేశ్వరీ
మాలాపుస్తక  పాశాంకుశధరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబన  మాతాన్నపూర్ణేశ్వరీ .

క్షత్రత్రాణకరీ  సదాశివకరీ  మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ  సదాశివకరీ  విశ్వేశ్వరీ  శ్రీధరీ
దక్షాక్రందకరీ  నిరామయకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి  కృపావలంబనకరీ  మాతాన్నపూర్ణేశ్వరీ .

అన్నపూర్ణే  సదాపూర్ణే  శంకర  ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య  సిద్ధ్యర్ధం  భిక్షాం  దేహీ చ  పార్వతి
మాతా చ పార్వతీ  దేవీ  పితా  దేవో  మహేశ్వరః
భాందవా  శ్శివభక్తాశ్చ  స్వదేశో  భువనత్రయమ్ .

ఫలం..ఇహానికి  ఆకలిదప్పులూ..పరానికి  ఏ కలి  తప్పులూ  కలగకపోడం.

............
వ్రాసిన  విషయాలలో  అచ్చుతప్పుల  వంటి  పొరపాట్లు  వచ్చినచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.  
 ..........................


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి .


Friday, November 23, 2012

అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో.......


* పురాణేతిహాసాలలోని   చరిత్రలను  తెలుసుకుంటుంటే,   దైవము మరియు   పెద్దలు  మన  కోసము   ఎంతగా   ఆలోచిస్తారో కదా  !  అనిపిస్తుంది. ప్రపంచములోని   ప్రతి ఒక్కరూ  మంచి   ప్రవర్తనను  కలిగి   దైవానికి   దగ్గరవ్వాలని (  మోక్షాన్ని  పొందాలని  ) వారి   అభిప్రాయం.

* ప్రపంచములో రకరకముల మనస్తత్వముల వాళ్ళు ఉంటారు  , ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తితో   ఒక్కో విధముగా    ప్రవర్తించవలసి ఉంటుంది.   అందుకే  ప్రాచీనులు  రకరకాల  కధలను  తెలియజేసారు.

* ప్రాచీన  గ్రంధాలలోని  కొన్ని   కధలలో  దైవ  నామాన్ని  స్మరించటం  వల్ల,   ఎన్నో   పాపాలు  చేసిన  వాళ్ళు  కూడా  నరకానికి  పోకుండా  స్వర్గానికి  వెళ్తారు.  అని  ఉంటుంది.  ఉదా..
అజామిళుని  కధ.  

* అజామిళుడు   ఎన్నో  పాపాలు  చేసాడు.  అయితే,   మరణించే  ముందు ,  నారాయణా.....అని    కొడుకు  పేరును  పిలవటం  వల్ల  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడని  కధలో  ఉన్నది. 
 
* మరి  కొందరు వ్యక్తులు   ఎన్నో  పాపాలు  చేసినా , మరణానికి  ముందు   అనుకోకుండా  శివాలయంలో  దీపపు  వత్తిని  వెలిగించటం  వల్ల    నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళారని  కధలో  ఉన్నది.

* (   ఇలాంటి  వాళ్ళు   చివరిలో  అనుకోకుండా  దైవనామస్మరణ  చెయ్యటానికి   కొన్ని  కారణాలు  ఉండవచ్చు.  ఉదా...బహుశా  వీళ్ళు   పూర్వజన్మలో   చేసిన  పుణ్యం  వల్లకానీ,  వీరి  తల్లితండ్రులు  చేసిన  పుణ్యం  వల్ల  కానీ  వీరికి  అనుకోకుండా  దైవస్మరణ  చేసే  అవకాశం  లభిస్తుందేమో అనిపిస్తుంది.  )


అజామీళుడు  వివాహం  చేసుకున్న  ఆమెకు  అంతకు  ముందే  ఒక  కూతురు  ఉన్నదట.  (  ఆమెకు   మొదటి  భర్త  వల్ల   పుట్టిన  అమ్మాయి.  )   భార్య  మరణించిన  తరువాత  అజామీళుడు  భార్య  యొక్క  కూతుర్ని  వివాహం  చేసుకుంటాడు. . ఈ  అమ్మాయి  అతడి  సొంతకూతురు  కాదు. సొంతకూతురు  కాకపోయినా,  అతడు  చేసినది  పెద్ద  తప్పే. 

* ప్రాచీనులు , 
అజామిళుని  కధ   వంటి   కధలను   చెప్పటంలో  ఎన్నో  అర్ధాలున్నాయి.

* ఎన్ని  పాపాలు  చేసిన  వారికైనా   మంచిగా   పరివర్తన   చెందటానికి  కొంత  అవకాశం  కలిగించాలని  పెద్దల  అభిప్రాయం  కావచ్చు.  ఇలాంటి  ఆశ  లేకపోతే    పాపాత్ములు  నిరాశానిస్పృహలతో    మరింతగా  పాపాలు  చేసే  అవకాశం  కూడా  ఉంది.


* కొందరు  అనేక  చెడ్డపనులు  చేస్తూ  ఉంటారు.  అయినా  వారికి  మనస్సులో  ఒక  మూలన  కొంచెం  పాపభీతి  ఉండే  అవకాశం  ఉంది. వాళ్ళు  ఎన్నో పాపాలు చేసిన   తరువాత   తమ  తప్పు   తెలుసుకుని,   అయ్యో !  మనకు దైవ పూజ చేసి  ఉత్తమగతులు  పొందే   అర్హత ఉందో  ? లేదో  ?  అనుకుంటారు.



* ఇలాంటి  వాళ్ళకు    కూడా  దైవపరమైన  ఆశను  కలిగించి,   మంచిమార్గంలోకి  వచ్చే  విధంగా  చేస్తాయి  ఇలాంటి  కధలు. 


* అజామిళుడి  వంటి  పాపాత్ముడే  నారాయణ  నామస్మరణం  చేత  నరకానికి  బదులు  స్వర్గానికి  వెళ్ళాడనే  కధను  చదివిన  కొందరు  చెడ్డవాళ్ళకు  ............ తాము  కూడా  నారాయణ  నామ  స్మరణం  చేస్తే,   మరణించిన  తరువాత నరకానికి  బదులు స్వర్గానికి  వెళ్ళవచ్చు  కదా  !  అనే  ఆలోచన  మొదలవుతుంది.  



* ( ఎన్ని  తప్పులు  చేసిన  వాళ్లకయినా   నరకానికి  వెళ్ళటం  అంటే  ఇష్టం  ఉండదు  కదా ! )


* ఇలాంటి  వాళ్ళు  కూడా     దైవ  నామ  స్మరణాన్ని  ,  పూజలు  చేయటాన్ని  మొదలుపెట్టి ,   అలా   పూజలు  చేస్తూచేస్తూ....  ఉండటం   వల్ల  క్రమంగా  ఆ  పాపాత్ములలో  మార్పు  వచ్చి  మంచిగా  పరివర్తన  చెందుతారు.



* మందులు  మనకు  ఇష్టం  ఉండి  వేసుకున్నా,  ఇష్టం  లేక  మ్రింగినా   అనారోగ్యాన్ని  పోగొడతాయి  కదా  !  అలాగే  ఏ  కారణంతో  దైవనామస్మరణాన్ని  మొదలుపెట్టినా   ఫలితం  లభిస్తుంది.  

అయితే  దైవనామ  స్మరణం  చేసే  వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు ,  నీతినిజాయితీలను  బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి.  కొందరికి  ఒక  జన్మలో  మంచి  మార్పు  కనిపిస్తే,   మరి  కొందరిలో  కొన్ని  జన్మలు  పట్టవచ్చు.  


*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   కొందరికి   రోగం  త్వరగా  తగ్గుతుంది.  కొందరికి   ఆలస్యంగా  తగ్గుతుంది.  మందులు   సరిగ్గా  వేసుకోకుండా,  పధ్యం  సరిగ్గా  పాటించని  వారికి  రోగం  త్వరగా  తగ్గకపోవచ్చు  కూడా.



* ఈ   కధలను  విని  , జీవితమంతా  పాపాలు  చేస్తూ   కొద్దిగా   దైవనామాన్ని  స్మరించితే  చాలు....  ఇక  పాపాలన్నీ  పోయి,  స్వర్గానికి  వెళతాం  కాబోలు .... అని    అపార్ధం  చేసుకోకూడదు .


*  తప్పులు  చేసినవాళ్ళు  తాము  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,   ఇకనుంచి    చెడ్డపనులను  చేయటం  మాని,  పుణ్యకార్యాలు  చేయటం  మొదలుపెడితే ,  అప్పుడు  వారికి  పడే  శిక్ష  గణనీయంగా  తగ్గే  అవకాశం  ఉంది. 


* అంతే  కానీ,  ఎన్ని  పాపాలు  చేసినా  ఫర్లేదు ,   కొన్ని   పుణ్యకార్యాలు  చేస్తే  చాలు ..  చేసిన  పాపాలు  కొట్టుకుపోతాయి  అనుకోకూడదు. 


*  అలాగైతే  రావణాసురుడు  
కూడా  పూజలు    చేసాడు. అతను    దైవపూజలు    చేసాడు  కదా  !  క్షమించేద్దాంలే.......  అని  దైవం  అనుకోలేదు.  ఎన్ని  పూజలు  చేసినా  కూడా ,  రావణుడు  తాను  చేసిన  తప్పులకు  చివరికి  నాశనం  అయ్యాడు. 

* అందుకని  ఒక  చేత్తో    పూజలూ  చేస్తూనే,   ఇంకో చేత్తో    పాపాలు  చేయటం ..... అనే  మనుషుల  అతితెలివి  విధానం  మంచిది  కాదు.

 ..................

*చేసిన  తప్పులకు  పశ్చాత్తాపపడి,  ఇక ముందు  పాపాలు  చేయకూడదని  భావించి , మంచి  మార్గంలోకి  రావాలనుకునే  వారికోసం,  వారిలో  మంచి  మార్పు  కోసం   ఇలాంటి  కధలను  పెద్దలు  అందించారు  అంతే కానీ  ,  చేసిన  తప్పులకు  పశ్చాత్తాపడకుండా , పూజలు  చేస్తూనే    మళ్ళీ  మళ్ళీ  చెడ్డపనులు  చెయ్యాలనుకునే  వారి  కోసం  ఇలాంటి  కధలు  చెప్పబడలేదు.

..................................

* దైవం  ఎంతో  దయామయుడు.   వ్యక్తులు  కొన్ని   తప్పులు  చేసినా  ఓపికగా  ఉండి,  వ్యక్తులలో  మార్పు  రానప్పుడు,  ఇక  శిక్షను  విధిస్తారు. 


*  (  శిక్షను  విధించటం  కూడా  వ్యక్తుల  మంచికోసమే.  వారు  మరిన్ని  పాపాలు  చేయకుండా  ఉండటానికే.  )

* శ్రీకృష్ణుడు  శిశుపాలుని  నూరు  తప్పుల  వరకూ  క్షమించి,   అప్పుడు  సంహరించారు.

*  హనుమంతుడు,  అంగదుడు,    లంకకు  వెళ్ళి  హితవు  చెప్పినా  కూడా   రావణుడు  వినిపించుకోలేదు.  రాములవారి  వద్దకు  సీతాదేవిని  పంపించలేదు.  అప్పుడు   ఇక,   రాముడు  రావణుని  సంహరించటం  జరిగింది.

...............................
* అందుకని ,     తెలిసోతెలియకో   తప్పులు  చేసినా    సరిదిద్దుకుని , ఇక  ముందు  తప్పులు  చేయకుండా  ఉండటానికి  ప్రయత్నించాలి.   జీవితంలో  సరైన  దారిలో  నడిచే  శక్తిని  ఇవ్వమని   భగవంతుని  ప్రార్ధించాలి.
...............................

 

Wednesday, November 21, 2012

అరుదైన, చిత్రమైన మొక్క , మరియు...

ఏడాదికి  ఒకసారి  ఉగాది  రోజే   మొలకెత్తి ,  మొగ్గతొడిగి  పుష్పించే  అరుదయిన  మొక్క  గురించి  మీరు  విన్నారా  ?

ఈ  మొక్కను   ముంగారి  మొలక   (  ఉగాది  పుష్పం  ) అంటారట.

  మద్దికెర  మండలం  అగ్రహారం  గ్రామంలో  ఇలాంటి  మొక్క  వచ్చిందట.

ఏటా  ఉగాది రోజు  మొలకెత్తి  సాయంత్రం  లోగా  వాడిపోయే  మొలకను  రైతులు  పంటలపుష్పంగా  పిలుస్తారు.  కొందరు  కాలాన్ని  నిర్ణయించే  పుష్పంగా   భావిస్తారట .


గడ్డి  కూడా  మొలవని  నేలలో  ఎలాంటి  తేమ  లేకపోయినా  ఒకే  రోజులో మొలకెత్తి   రెండు  అడుగులు  పెరగడంపై  నిపుణులు  సైతం  ఆశ్చర్యానికి  గురవుతున్నారు. 



ఈ  మొక్క  పదికి  పైగా  మొగ్గలు  తొడిగితే  ఆ  ఏడు  పంటలు  బాగా  పండుతాయని  రైతుల  నమ్మకం.  

ఇలాంటి  మొక్కలు  అగ్రహారం  ప్రాంతంలో  మాత్రమే  కనిపిస్తాయట.

హైదరాబాద్ కు  చెందిన  శాస్త్రవేత్తలు  సైతం  ఈ  మొక్కను  పరిశీలించారట.  


ఒకే  రోజు  మొలక  రావటం,  మొగ్గ  తొడగటంపై  పరిశోధనలు  చేస్తున్నారట. 

 (కొన్ని  సంవత్సరాలకు  క్రితం  ఈనాడు  దినపత్రికలో  ఈ  విషయాలను  వ్రాసారండి..)
............................


  ఆధునిక  విజ్ఞానశాస్త్రపు  సూత్రాలకు  అంతుచిక్కని   రహస్యాలెన్నో  సృష్టిలో  ఉన్నాయి.  


గగుర్పాటు  కలిగించే  గొంగళి పురుగు  తపస్సమాధి  స్థితి  లాంటి  దశను  దాటాక ,  రంగురంగుల  సీతాకోకచిలుకగా  మారే  విధానం  కూడా  అద్భుతం,  ఆశ్చర్యకరం. .


 దైవసృష్టి  ఎంతో  అద్భుతమైనది,  మన  అంచనాలకు,  ఆలోచనలకూ    అంత  సులువుగా  అందనిది. 

...........................................................

ముంగారి  మొలక చిత్రాలను బ్లాగ్ లో పెట్టానండి. అయితే, అంత క్లియర్ గా కనిపించటం లేదు.

జాగ్రత్తగా గమనిస్తే, మొదటి చిత్రంలో ఒక సన్నటి మొలకకు పైన ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి.

రెండవ చిత్రంలో పెరిగి వంపు తిరిగిన సన్నటి మొక్క కనిపిస్తోంది.



Monday, November 19, 2012

ఓం నమఃశ్శివాయ.

ఓం.
కార్తిక  సోమవారం  సందర్భంగా....

లింగాష్టకం.


1..బ్రహ్మమురారి సురార్చితలింగం

....నిర్మల భాసితశోభితలింగమ్
జన్మజదుఃఖవినాశకలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం

....కామదహనకరుణాకరలింగమ్
రావణదర్పవినాశకలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం

....బుద్ధివివర్ధనకారణలింగమ్
సిద్ధసురాసురవందితలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం

....ఫణిపతివేష్టితసేవితలింగమ్
దక్షసుయజ్ఞవినాశనలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందనసేవితలింగం

....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం

....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం

....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం

....సర్వసముద్భవకారణలింగమ్
అష్టదరిద్ర వినాశనలింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం

....సురవనపుష్పసదార్చితలింగమ్
పరమపదం పరమాత్మక లింగం

....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం

....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి

....శివేన  సహ  మోదతే.
గౌరీస్తుతి 

 
నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.