దుస్తులు శరీర రక్షణ కోసం వేసుకుంటారు. ఇవి ఎండ, వాన, చలి నుంచి, ఇంకా ఇతరుల దృష్టి నుంచి శరీరాన్ని కప్పి కాపాడతాయి.
అయితే, ఈ రోజుల్లో కొందరు స్త్రీలు అసభ్యంగా ఇతరులకు శరీరాన్ని ప్రదర్శించే రీతిలో దుస్తులు వేసుకుంటున్నారు. ఏమన్నా అంటే మాకు నచ్చినట్లు దుస్తులు వేసుకుంటాము. ఎవరికీ అడిగే హక్కు లేదంటూ దబాయిస్తున్నారు.
సమాజంలో ప్రతిదానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సమాజం సజావుగా సాగాలంటే కొన్ని కట్టుబాట్లు ఉండాలి కూడా. నా ఇష్టం వచ్చినట్లు రోడ్డు పై కారు నడుపుతాను...... నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను. అంటే ఎవరూ ఒప్పుకోరు..... అంతా మా ఇష్టమే.. అంటే కుదరదు కదా !
బాంకుకు డబ్బు పట్టుకెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తగా సంచిలో వేసి ఎవరికంటా పడకుండా తీసుకెళ్తాం . అంతేకానీ, అందరికీ ఆ డబ్బును ప్రదర్శించుకుంటూ తీసుకెళ్ళం కదా ! దొంగలు ఉంటారు ... బాంకులకు వెళ్ళేటప్పుడు డబ్బును జాగ్రత్త చేసుకోమని పోలీసులు , ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు చెబుతారు.
మీరేమిటి జాగ్రత్తలు
చెప్పేది ? అంతా మా ఇష్టం.....అని వారిని తూలనాడి , ఎవరిష్టం
వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే , ఏదైనా జరగరానిది జరిగితే ?.....
మళ్ళీ ఆ పోలీసులను, పెద్దవాళ్ళనే సహాయం కోసం దేబిరించుకోవాలి. మన
మంచి కోరి చెప్పే పెద్దవాళ్ళ మాట వింటే మనకే మంచిది. డబ్బు ముఖ్యమైనదే కానీ , స్త్రీ జీవితం మరింత ముఖ్యమైనది.
కొందరు ఏమంటారంటే, నిండుగా దుస్తులు వేసుకునే ఆడవారి పట్ల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అసభ్యంగా దుస్తులు వేసుకోవటం తప్పుకాదు ..... అంటూ వాదిస్తున్నారు. ఆ వాదన తప్పు.
డబ్బును ఎంతో జాగ్రత్తగా ఇనప్పెట్టెలో పెట్టినా ఒకోసారి కొందరు దొంగలు ఇనప్పెట్టెను పగలకొట్టి దోచుకుపోతారు. అలాగని ఇనప్పెట్టెలో పెట్టటం మానేయము కదా ! మరిన్ని తాళాలు వేసి పెట్టెలో దాస్తాము.
చక్కగా దుస్తులు వేసుకున్న స్త్రీలకు కూడా,......అనేక కారణాల వల్ల , ఆపదలు కలిగే అవకాశం ఉంది. అంతమాత్రం చేత అర్ధనగ్నంగా దుస్తులు వేసుకు తిరిగితే తప్పేమిటి ? అని వాదించటం హాస్యాస్పదం.

ఇంకొక విషయం ఏమిటంటే, నిండుగా దుస్తులను ధరించిన స్త్రీల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసేవారున్న సమాజంలో, అర్ధనగ్నంగా ఉండేవారిని చూస్తే వారు మరింత రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది.
ఈ
రోజుల్లో, కొన్నికధలు, కొన్నిసినిమాల్లో అసభ్య వస్త్ర ధారణ, అసభ్య
దృశ్యాలు ఎన్నో ఉంటున్నాయి. ఆధునిక విజ్ఞానం వల్ల సెల్ ఫోన్లు,
అంతర్జాలం, టీవీ చానల్స్ వల్ల అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా
ఎప్పుడూ ఈ అసభ్య దృశ్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి
చూసేవారి మీద ఆ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది.
ఇక ఆ ప్రభావంతో పసి పిల్లలు, పండు వృద్ధులు, చక్కగా దుస్తులు ధరించే స్త్రీలు అని తేడా లేకుండా అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉంది. అసభ్యంగా దుస్తులు వేసుకునే ఆడవాళ్ళు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
శారీరికంగా స్త్రీలు పురుషుల కన్నా బలహీనులు కాబట్టి , ఎంత డేరింగ్ నేచర్ ఉన్న ఆడవాళ్ళకయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
కొందరు ఆడవాళ్ళయితే ... ఆడవాళ్ళు మగవాళ్ళతో ఎప్పుడయినా , ఎలా తిరిగినా .. ఫరవాలేదు. అని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చేవారికి వారి పిల్లలు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుంది.
మరికొందరేమో , మగవాళ్ళు ప్రాచీనకాలంలా పంచలు వేసుకుంటున్నారా ? మేమెందుకు ప్రాచీన కాలంలాగా నిండుగా దుస్తులు వేసుకోవాలీ ? అని ప్రశ్నిస్తుంటారు.
మగవాళ్ళు పంచలు వేసుకోపోయినా నిండుగా పాంట్ షర్ట్ వేసుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు వేసుకునే చిన్న షార్ట్స్, చిన్న బనీను అలా నిండుగా ఉండటం లేదు కదా !
( ఉష్ణదేశాల్లోని మగవారికి పాంట్, షర్ట్ కన్నా , పంచలే ఆరోగ్యం అట. ఇది వేరే విషయం. )
అయినా మగవారు షార్ట్స్ మాత్రమే వేసుకుని వీధుల్లో తిరిగినా అసభ్యంగా అనిపించదు. ఆడవాళ్ళేమీ వారిని గమనించరు, పట్టించుకోరు.
మగవాళ్ళు పొట్టిదుస్తులు వేసుకుని తిరగటానికీ , ఆడవాళ్ళు మగవాళ్ళలా పొట్టి దుస్తులు వేసుకుని తిరగటానికీ చాలా తేడా ఉంది మరి.
అసభ్యంగా దుస్తులు వేసుకుని కనిపించే సినిమాల్లోని ఆడవాళ్ళని , మగవాళ్ళు మెచ్చుకుంటూ ప్రోత్సహించటం వల్ల ఆనక కష్టాలు వస్తాయి. అలా ఉంటే మగవాళ్ళకు నచ్చుతుంది కాబోలు .... అనుకునే ఆడవాళ్ళూ ఉంటారు. అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయి భార్యగా వస్తే , అప్పుడు అబ్బాయి లబలబలాడటం వల్ల ఉపయోగమేమీ ఉండదు.
పరాయి ఆడవాళ్ళు అసభ్యకరమైన దుస్తులు వేస్తే చూడాలని ఉబలాటపడే మగవాళ్ళు కూడా తమ కుటుంబసభ్యులు వేసుకుంటే లబలబలాడతారు.
అందరూ ఇలాంటి అసభ్య వాతావరణాన్ని గట్టిగా వ్యతిరేకించినప్పుడే ఇవన్నీ తగ్గుతాయి.