ఈ
రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు
ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి.
మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్
ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను ఎంతకని ఆపగలం?
మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. మంత్రాలను మనస్సులో కూడా అనుకోవచ్చు.
దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల,
వాతావరణం కూడా శుద్ది అవుతుంది.
ధ్యానం ఎంతో శక్తివంతమైనదని అంటారు. ధ్యానము పైకి అందరికి వినిపించేలా చేయకపోయినా కూడా, ధ్యానము శక్తివంతమైనది.
ఇళ్ళలో
వీలున్నప్పుడు కొద్దిసేపయినా భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది.
తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా ఉన్న మంత్రాల కాసెట్ పెడితే మంచిది.
వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి.
(ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.)
చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు.. పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి సమస్యలు ఉంటాయి. చిన్న శబ్దంతో పెట్టినా కూడా, ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మంచిమార్పు వచ్చే అవకాశముంది.
కొన్ని దేవాలయాల్లో మైకుద్వారా
వినిపించేలా కాసెట్ పెట్టి మంత్రాలను, భక్తిగీతాలను వినిపిస్తారు.
మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి. పెద్దశబ్దంతో పెట్టే మైకులకు సమీపంలో ఉండే ఇళ్లల్లో ఉండే వారికి కొన్ని సమస్యలుంటాయి....
ఒకరిమాట
ఒకరికి సరిగ్గా వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము.
కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే
హాయిగా ఉంటుంది.
*********************
ఈ
రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..ద్వారా ప్రసారమవుతున్న వాటిలో, మంచి ప్రోగ్రాంస్ తో పాటు హింసతో కూడిన ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.
చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు.
సీరియల్స్ చూస్తే, ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది.
అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి.
సీరియల్స్ చూస్తే, ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది.
అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి.
కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.
చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.
ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు.
చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.
ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు.
సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.
.......................
ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి, ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది.
.................
oka link..
No comments:
Post a Comment