koodali

Monday, December 22, 2025

పగిలిన గాజుముక్కలను....

 

ఎన్నో గాజు సామాన్లను వాడతాం. అవి పగిలినప్పుడు మాత్రం వాటిని ఎక్కడ ఎలా పడెయ్యాలో అనేది కష్టంగా ఉంటుంది.


 పగిలిన గాజుముక్కలను అలాగే బయట పడేస్తే అవి గుచ్చుకుని పారిశుధ్యసిబ్బందికి, బయట ఆహారం కొరకు తిరిగే జంతువులకు గుచ్చుకుని గాయాలు అయ్యే ప్రమాదముంది.

 అందువల్ల గాజు ముక్కలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి, చాలా పాతబట్టలను మందంగా వాటికి గట్టిగా చుట్టి,  మరల ప్లాస్టిక్ కవర్లో చుట్టి అప్పుడు వాటిని ప్లాస్టిక్ చెత్త వేసే డబ్బాలలో వేయాలి. 

ఏదైనా పెట్టెలో పెట్టి పడేస్తే ఇంకా మంచిది. ఇంకా ఏమైనా పద్దతులు కూడా ఉండవచ్చు. 

 పగిలిన గ్లాస్ పడెయ్యటానికి విడిగా చెత్తబాక్సులను ఏర్పాటు చేయాలి.

 గాజు సామాను కొనకుండా జాడీలను, మట్టిపాత్రలను కొనవచ్చు.

పాతకాలంలో జాడీలను వాడేవారు. ఇప్పుడు కూడా జాడీలను అమ్ముతున్నారు. అలాగే జాడీలు తయారుచేసే పద్ధతిలో కప్పులు, చిన్న జాడీలు, మగ్గులను కూడా అమ్ముతున్నారు. అవి పగిలినా కూడా గాజుగ్లాసులా పదునుగా గుచ్చుకోవు. 
 

ఈ రోజుల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా పడేసి వదిలేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సమాజంలో. అలాకాకుండా, సమాజం బాగుండేలా పాటించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. 



No comments:

Post a Comment