..
కొందరు ఏమంటున్నారంటే, కుంభమేళా లో అనేకమంది స్నానాలు చేయటం.. వంటివాటి వల్ల పొల్యూషన్ జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు.
వర్షాలు పడినప్పుడు భూమిపైన ఉన్న సుగంధాలు, దుర్గంధాలు, మంచివి, చెడువి...కూడా..అనేకమైనవి ..వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి..
మనుషులు బయట పడేసే వ్యర్ధాలు, చెత్తా, చెదారం, పశుపక్ష్యాదుల మలమూత్ర విసర్జనలు, వాటి మృతకళేబరాలు.. వంటివి కూడా వాననీటితో పాటు నదుల్లోనూ, కాలువల్లోనూ కలుస్తాయి...
మాంసాహారం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేలు, లక్షలుగా పశుపక్ష్యాదులను చంపి, మిగిలిన టన్నుల వ్యర్ధాలను బైటపడేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్రం.. బీచ్ ల వద్ద అనేకమంది స్నానాలు చేస్తారు. ...స్విమ్మింగ్ పూల్స్ లో చాలామంది ఈతకొడుతుంటారు. ...స్విమ్మింగ్ పూల్స్ నీటిలో బ్లీచింగ్ పౌడెర్.. వంటివి కలుపుతారు.
అయితే, నదుల్లో నీరు ఒకదగ్గర నుంచి ఇంకో దగ్గరకు దూరప్రాంతాలనుంచి పారుతూ చక్కగా ప్రవహిస్తుంది కాబట్టి, బ్లీచింగ్ పౌడర్ ..వంటివి వేయరు.
ఇక, పుష్కరాల సమయంలో నదులనీటికి ఎంతో శక్తి ఉంటుందని పెద్దవాళ్లు తెలియజేసారు.
అందువల్ల, ఎన్నో సంవత్సరాల కొకసారి నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల సమస్యలు ఏమీ ఉండవు.
కుంభమేళాకు వెళ్తే రోగాలొస్తాయని కొందరు అంటున్నారు..కొన్నాళ్ళక్రితం కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. మరి కరోనా రోగం ఎందుకొచ్చినట్లు?
*********
ఆధునిక కాలంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక వ్యర్ధాలను, విషపదార్ధాలను, నగరాలనుంచి వచ్చే డ్రైనేజ్ ను ...నదులలోకి, సముద్రంలోకి వదిలేస్తుంటారు..వాటివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి.
ఆధునిక పోకడలతో పర్యావరణం పాడయ్యింది. రసాయనాల పంటలు వాడి అనారోగ్యాలు వస్తున్నాయి. అనేక విష రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భనీరు పాడవుతోంది.
మనం వాడుతున్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్లు..వంటి వాటివల్ల కూడా ఓజోన్ పొర పల్చనయ్యే ప్రమాదముందని ఒక దగ్గర చదివాను....గాలిలో కలిసే విషవాయువుల వల్ల కూడా ఓజోన్ పొర రంధ్రాలు పడుతోందంటున్నారు.
అప్పుడు ఓజోన్ పొర పల్చనయ్యి , అతినీలలోహిత కిరణాలు భూమిపై వ్యాపించి కొత్త విపత్తులు రావచ్చు.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.
ఇలా చాలా జరుగుతున్నాయి. వీటి గురించి ఆలోచించితే మంచిది.
No comments:
Post a Comment