koodali

Monday, September 2, 2024

ఇలాంటి పరిస్థితులు మారాలి... ..

 

సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చిపడటం వల్ల కూడా ..కొన్ని సమస్యలు కలిగి ప్రజలలో ఆందోళన కలుగుతుంది.

 దేశంలో సమస్యలు ఒకదానితరువాత ఒకటి  ఉంటూనే ఉన్నాయి.  సమస్యలు ఎందుకొస్తున్నాయి? వీటిని ఎలా పరిష్కరించుకోవాలని అందరూ ఆలోచించి పరిష్కరించుకోవాలి.


దేశంలో
 ఎప్పుడూ సమస్యలేనా?  ..ఇంకెప్పుడు భారతదేశం బాగుపడుతుంది?అవినీతి, స్త్రీల పట్ల అత్యాచారాలు, నిరుద్యోగసమస్య..ఇలాంటి పరిస్థితి మారాలి.   ఇవన్నీ పోవాలి.  పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. 

 
భారతదేశం ఎంతో గొప్పదేశం అయ్యుండి కూడా, ఇక్కడి ప్రజలు ఎందుకు దేశాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు?  స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా కూడా భారతదేశం పేదదేశంగా ఎందుకు ఉంది? ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా నిరాశ కలుగుతుంది .


 మనం మనదేశాన్ని అభివృద్ధి చేసుకోలేని చేతకాని దద్దమ్మలం,  చవటలం కాదు కదా..దేశపౌరులందరూ   దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి.
 సమాజాన్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే, కొన్నిసార్లు కఠినంగా ఉండటం కూడా అవసరం.

పాలకులు సమాజాన్ని చక్కగా అభివృద్ధి చేయాలి..అదే సమయంలో చెడ్డగా ప్రవర్తించేవారిని శిక్షించాలి.

 పాలకులు చెడ్డవారిపట్ల ఉదాశీనంగా, చేతకానివారిలా ఉంటే సమాజానికి హాని జరుగుతుంది. సామరస్యం అంటూ..చెడు పట్ల ఉదాశీనంగా ఉండటం గొప్ప అనిపించుకోదు.

 యువత ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లే పరిస్థితి కాకుండా,  స్వదేశంలోనే చక్కగా జీవించేలా వ్యవస్థలను మార్చుకోవాలి.

 ఎప్పుడూ సినిమాలు, క్రికెట్, సోషల్మీడియా, అస్తమాను సెల్ఫోన్లు చూడటం..అని కాకుండా, పట్టుదలగా దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించే దిశగా యువత మరియు ప్రజలందరూ  మారాలి.

 జనాలు కొందరు ఒక మైక్ పుచ్చుకుని, పనిచేసే వారి వద్దకు వెళ్ళి అనేక ప్రశ్నలు అడుగుతూ విసిగిస్తుంటారు. ఇంకా కొందరు రెచ్చగొట్టే ప్రశ్నలు వేస్తూ గొడవలు పెడుతుంటారు.

.......... 

ఒక దేశం శుచి, శుభ్రత బాగుంటే చాలా ఆహ్లాదంగా ఉండి, విదేశీయులు కూడా గౌరవిస్తారు. ప్రజలు శుచిశుభ్రత సరిగ్గా పాటించకపోతే, వారిపట్ల  కఠిన చర్యలు తీసుకోవాలి. 

భారతదేశాన్ని శుభ్రమైన వీధులు చక్కటి చెట్లతో అందంగా తీర్చిదిద్దటానికి ఎక్కువడబ్బు అవసరం ఉండదు. ప్రతివీధిని ఎప్పుడూ శుభ్రంగా పచ్చటి చెట్లతో ఆహ్లాదంగా ఉండేలా ఎక్కువ సిబ్బందిని నియమించాలి.

డ్రైనేజ్ నీళ్లను మంచిగా శుభ్రపరిచి రోడ్లవద్ద ఉన్న మొక్కలు, చెట్లకు పోయవచ్చు. ఇలా చాలామందికి ఉపాధి లభిస్తుంది. చిన్న ఉద్యోగాల కొరకు విదేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతుంది.

 భారతదేశంలో చక్కటి వాతావరణం వల్ల పంటలు బాగా పండుతాయి. తక్కువధరకే ఆహారాన్ని అందరికి అందించవచ్చు. 
 పప్పుధాన్యాలు గోడవున్లలో పాడవకుండా నిల్వచేసి అందరికి అందుబాటులోకి తేవాలి. 

 ఆహారధాన్యాలను రైతుల వద్ద బాగా తక్కువ ధరకు కొని,  దొంగతనంగా నిల్వచేసి ఎక్కువధరలకు అమ్మే వ్యాపారస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి.

 ఈ రోజుల్లో అందరికి దుస్తులు తక్కువ ధరలో కూడా అందుబాటు ధరలో లభిస్తున్నాయి కాబట్టి దుస్తులకు కొరతలేదు.

 విద్య కొరకు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మెరుగైన ప్రమాణాలతో బాగు చేస్తే అందరికి తక్కువధరకే విద్య అందుబాటులో ఉంటుంది. 

ప్రభుత్వ స్కూల్స్ , ఇప్పుడు ఉన్న సెంట్రల్ స్కూల్స్ లా ఉంటే చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదవటానికి ఆసక్తి చూపిస్తారు.

వ్యవసాయం, ఉద్యోగాలు, సేవారంగంలో ఉపాధితో పాటు, చిన్న మధ్యతరహా పరిశ్రమలతో కూడా ప్రజలు ఉపాధి పొందవచ్చు.

 ప్రభుత్వ హాస్పిటల్స్ లో మరింతమంది వైద్యులను, ఇతర సిబ్బందిని నియమించితే చాలామందికి ఉపాధి లభిస్తుంది,  అందరికి తక్కువ ధరకే వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఆయుర్వేదం, హోమియో వైద్యాలను కూడా ప్రోత్సహించాలి.

(ఇంట్లో చక్కగా వండిన ఆహారం తిని ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే, అనారోగ్యంతో హాస్పిటల్స్ కు వెళ్లే పరిస్థితులు ఎక్కువ రావు.)

ఆహారం, విద్య, వైద్యం, శుచిశుభ్రతతో.. దేశం బాగుండాలంటే, మరీ ఎక్కువ డబ్బు అవసరంలేదు. చేయాలనే పట్టుదల, అందుకు మనస్పూర్తిగా పని చేయటం చేయాలి. 

ఎవరైనా విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఇక్కడ స్థిరపడితే జనాభా బాగా పెరిగి స్థానికులకు ఆహారం, ఉపాధి అవకాశాలు సరిగ్గా లభించవు కాబట్టి, అక్రమవలసలను సమర్ధవంతంగా అరికట్టాలి. 

జనాభా ఎక్కువైతే ప్రభుత్వాల వద్ద ఉన్న డబ్బు కూడా సరిపోదు. తక్కువమంది సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ వద్ద చక్కటి పరిస్థితుల కొరకు ధనవంతులు సాయపడవచ్చు.

 ఉదా..స్కూల్స్, కాలేజీలు,  హాస్పిటల్స్..వద్ద వాటర్ టాంకులు, కొత్తగా గదులు నిర్మించటం, కుర్చీలు..వంటి అవసరమైన సామాగ్రిని కొన్నివ్వటం, పేదవాళ్లకు తక్కువ ధరకు ఆహారాన్ని అందించటం, మొక్కలు పెంచటం ..ఇలా ఎన్నో విధాలుగా సాయపడవచ్చు. 

రోడ్లవద్ద మొక్కలు పెంచటం, అత్యంత పేదలకు షెల్టర్స్ నిర్మించటం..ఇలా ఎన్నో విధాలుగా ధనవంతులు సమాజానికి సాయపడవచ్చు.ఇందువల్ల వారికి ఎంతో పుణ్యం వస్తుంది, మనస్సుకు ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. 

ఇలా ధనసహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కాజేసే వారి చేతుల్లో ఆ డబ్బు పడకుండా జాగ్రత్తగా వినియోగించబడాలి.

ప్రజలు, అధికారులు, ప్రభుత్వం..కలిసి పనిచేస్తే భారతదేశం కూడా ప్రగతిపధంలో పయనిస్తుంది. 

 .............................

 మనుషులు నైతికవిలువలతో ప్రవర్తించాలి. నైతికవిలువలతో ఉండేవారు అధర్మంగా ప్రవర్తించరు. అసభ్యతతో  కూడిన రచనలు, సినిమాలు, సీరియల్స్ తో సమాజాన్ని పాడుచేయరు. నైతికవిలువలు ఉన్న వ్యాపారస్తులు అధికధరలతో ప్రజలను పీడించి లాభాలు పొందరు. నైతికవిలువలు కలిగిన వాళ్లు పర్యావరణాన్ని పాడుచేయరు. నైతికవిలువలతో ఉండే వాళ్లున్న సమాజంలో సమస్యలు తక్కువగా ఉంటాయి. 
.....................

రాజకీయాలు స్వచ్చంగా ఉండేలా మార్పులు జరగాలి. అవినీతి పోవాలి. పేద, ధనిక అసమానతలు తగ్గాలి.. భారతదేశం గత వైభవాన్ని పొందాలి. భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకులు కావాలి.

 అంతా  దైవం దయ.

..............

మంచి అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు. 

.....................

 oka  link..

 ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వా...

 

2 comments:


  1. కొందరు తమ ఇంట్లో కొన్ని వస్తువులు కొంతకాలం వాడి, బాగున్నాకూడా బయట పడేస్తుంటారు. అలా చెత్తలో వేయటం కాకుండా, పార్కుల వద్ద కొన్ని అలమారాలు పెట్టి అందరికి కనిపించేలా వాడిన వస్తువులు అక్కడ పెట్టి, వాటిని ఎవరైనా తీసుకునేలా ఏర్పాటు చేస్తే, అవసరమైన వాళ్లు ఆ వస్తువులు, దుస్తులు..తీసుకువెళ్తారు.

    ReplyDelete
  2. పార్కుల వద్ద పాతసామాగ్రి పెట్టవచ్చంటే, కొందరు జనం పార్కులను పాతసామాగ్రి కుప్పలుగా చేస్తారేమో? అందువల్ల, పార్కుల వద్ద కాకుండా వేరే దగ్గర ఇలా ఏర్పాటు చేయవచ్చు.

    ReplyDelete