కొందరు గొప్పవారు ఎన్నో గొప్ప విషయాలను తెలియజేస్తున్నారు.
*********
కొందరు తాము మూఢనమ్మకాలను నమ్ముతూ.. వాటిని ప్రచారం చేస్తారు. మూఢనమ్మకాలవల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుంది. అందువల్ల మూఢనమ్మకాలను ప్రచారం చేయకూడదు, పాటించకూడదు.
*************
ఈ రోజుల్లో కొందరు, భక్తి పేరుతో జనాలను మోసం చేస్తున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటివారి మాటలను నమ్మి, వారు ఏం చెబితే అది చేయనక్కర లేదు.
ఈ మధ్య కాలంలో కొందరు .. మూఢనమ్మకాలను చెప్పి భక్తులను ఆందోళనకు గురిచేసి, వారిని కుటుంబసభ్యులకు దూరం చేసి, వారి ఆస్తులను తీసుకుని మోసం చేస్తున్నట్లు వార్తలు ద్వారా తెలిసింది.
*************
మరి కొన్ని విషయములు....
ప్రాచీనగ్రంధాలలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని పండితులే అంటుంటారు. ఈ
రోజుల్లో గమనిస్తే .. ప్రాచీనగ్రంధాలలో ఉన్న విషయాల గురించి కొందరు ఎవరికి
తోచినట్లు వారు చెబుతున్నారు. ఇక తరతరాలనుండి ఎందరు తమకు తోచినట్లు
గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసారో చెప్పలేము.
కొందరు తెలిసితెలియని
వాళ్లు, స్వార్ధపరులు కూడా ..గ్రంధములలో మార్పులుచేర్పులు చేసే
అవకాశముంది. అందువల్ల ప్రతిదీ గుడ్దిగా నమ్మటం కాకుండా విచక్షణతో ఆలోచించి
నిర్ణయాలు తీసుకోవాలి.
సమాజంలో రకరకాల అభిప్రాయాల వారు ఉంటారు
కాబట్టి, ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో?
తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి
విషయంలో విచక్షణతో ఉండాలి.
ప్రాచీనగ్రంధాలు ప్రామాణికమని మనకు తెలుసు. అయితే, కొన్నింటిలో కొన్ని ప్రక్షిప్తాలు చేర్చారని అంటున్నారు.
తరతరాలనుండి ఎందరో ఎన్నో రచనలు రచించారు. అందులో ఏవి ..ఏ విషయములు ప్రామాణికమయినవో ..సరిగ్గా తెలిసినవారు చెబితే అవి ప్రామాణికమని అందరికీ తెలుస్తుంది.
పురాణేతిహాసాల
గురించి రచనలు చేయటం, వ్యాఖ్యానించే స్వేచ్చ.. భక్తులు అందరికీ ఎప్పుడూ
ఉంటుంది. అయితే, ఆ రచనలు, వ్యాఖ్యలు.. అభ్యంతరకర పద్ధతిలో ఉండకూడదు.
ప్రామాణికమైన గ్రంధాల ప్రకారం చక్కగా ఉండాలి.
ప్రాచీన గ్రంధాలలోని
కొన్ని విషయాలు పైకి కనిపించేవి ఒకలా ఉంటే, అంతరార్ధాలు అనేకం ఉండవచ్చు.
అందువల్ల అన్నింటిగురించి గబుక్కున ఒక నిర్ణయానికి రాకూడదు.
ఇంతకుముందు
ఏం జరిగిందో తెలియదు. భవిష్యత్తులోఅయినా..ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలలో
మార్పులుచేర్పులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలి.
***************
పాపాలు చేయకూడదని, ధర్మాన్ని పాటించాలని అందరికి తెలుసు. పాపాలను చేయకూడదనే విషయాన్ని చక్కగా పాటిస్తే ఎన్నో సమస్యలు ఉండవు.
దైవాన్ని..ధర్మాన్ని నమ్ముకుంటే దైవమే రక్షిస్తారు.
................
క్రింద వ్రాసిన విషయములు ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాయటం జరిగింది.
సినిమాల్లో పౌరాణిక గ్రంధాలను మార్పులుచేర్పులు చేయటం ఎవరు చేసినా ముమ్మాటికీ తప్పే. దానికి ఆ ప్రాంతం వారు.. ఈ ప్రాంతం వారు అని ఉండదు.
కొందరు కొన్ని సినిమాల్లో దేవతల మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పాటలు వ్రాసారు, డైలాగులు వ్రాసారు. డాన్సులు చేసారు. ఉదా..యమధర్మరాజు అంటే ఎంతో ధర్మమూర్తి. మరి వారిని కొన్ని సినిమాల్లో కామెడీగా చూపించారు.
ఆ
సినిమాలను తీసినవారు, నటించినవారు, మాటలు వ్రాసినవారు, పాటలు
వ్రాసినవారు, పాడినవారు, ఆ సినిమాలు చూసి గొప్పగా ఎంజాయ్ చేసిన
ప్రేక్షకులు ఉన్నారు. తాము పూజించే దేవతలను వెటకారం చేస్తున్నామనే విజ్ఞత
కూడా లేకపోయింది.
సినిమాల
వల్ల సమాజంపై ఎంతో ప్రభావం ఉంటుంది. కొన్ని సినిమాలు మంచివి ఉన్నాయి.
కొన్ని సినిమాల వల్ల సమాజంపై ఎంతో చెడు ప్రభావం కూడా పడింది.
కొన్ని
సీరియల్స్ వారు కూడా మూఢనమ్మకాలను సీరియల్స్ ద్వారా ప్రచారం చేస్తూ
ప్రజలలో భయాలను కలిగిస్తున్నారు. సోషల్మీడియా ద్వారా మూఢనమ్మకాలను,
భయాందోళలను పెంచేవారు కూడా ఉన్నారు.
ఇక,
ఎన్నో గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇకమీదట అయినా ఎవరూ
మూలగ్రంధాలను మార్పులుచేర్పులు చేయకుండా కాపీరైట్స్ ఉండాలి.
సంస్కృతం నుండి తమ భాషలోకి అనువదించటం వరకు తప్పులేదు కానీ, ఆ అనువాదాలు కూడా మూలగ్రంధంలో ఉన్నవి ఉండాలి. ఈ రోజుల్లో యూట్యూబులో కూడా ఎవరికి తోచినట్లు వారు గ్రంధాలను మార్పులుచేర్పులు చేయటం కూడా చేయకూడదు.
గ్రంధాలలోని
ప్రక్షిప్తాలను గుర్తించి సరి చేస్తే బాగుంటుంది. అయితే, ఏవి
ప్రక్షిప్తాలో ఏవి కాదో ?
ప్రక్షిప్తాలను సరిదిద్దాలంటే కష్టమైనపని...ఏవి ప్రక్షిప్తాలో? తెలియదు కాబట్టి, గ్రంధాలలో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంగీకరించి, వాటి విషయంలో విచక్షణతో ఉండాలి. సమాజంలో అయోమయం, అపార్ధాలు.. కలిగే విధంగా గ్రంధాలలోని విషయాలను చెప్పకుండా ఉండవచ్చు.
మరి కొన్ని విషయములు....
Link.. ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.
No comments:
Post a Comment