ఎండలు మండిపోతున్నాయంటూ చాలామంది గోల పెడుతున్నారు. రహదారుల ప్రక్కన ఎక్కువగా చెట్లు పెంచితే ఎంతో బాగుంటుంది. ఎక్కడ వీలుంటే అక్కడ విదేశీ మొక్కలు కాకుండా, దేశవాళీ వేప, కానుగ, బాదాం..వంటి చెట్లు విరివిగా పెంచాలి. అప్పుడు ఎంతోకొంత వేడి తగ్గుతుంది. ప్రతి ఊరిలోనూ చాలా మొక్కలను, చెట్లను పెంచాలి. శుద్ధి చేసిన మురుగు నీటిని మొక్కలకు, చెట్లకు పోయవచ్చు. చెరువులు, కాలువలు ప్రక్కన కూడా చెట్లను పెంచితే బాగుంటుంది. కొన్ని ఊర్లు నదీ తీరాల వద్ద ఉంటాయి.. ఆ ఊర్లలో నదుల తీరం ప్రక్కన రెండు వరసలుగా చెట్లను పెంచి, బెంచిలు వేస్తే ఎంతో అందంగా, ఆహ్లాదంగా పార్కులా ఉండి, ప్రజలకు బాగుంటుంది. కొన్ని విదేశాలు చాలావరకు శుభ్రంగా, అందంగా ఆహ్లాదంగా ఉంటాయి. మనము కూడా మన దేశాన్ని శుభ్రంగా, అందంగా, ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఇవన్నీ చేయటానికి బోలెడు డబ్బు ఎక్కడుంది? అనుకుంటారు కొందరు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటానికి, మొక్కలు, చెట్లు పెంచుకుని అందమైన ఉద్యానవనాలుగా తీర్చిదిద్దుకోవటానికి బోలెడు డబ్బు అవసరం ఉండదు. *********** ఇంకా, పర్యావరణం బాగుండాలంటే, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేయకూడదు. ************ శుభ్రత గురించి మన గ్రంధాలలో ఎంతో చెప్పారు. ఇప్పుడు మనదేశస్తులకు శుభ్రత పాటించటం గురించి శ్రద్ధ తగ్గిపోయింది. దేశంలో అనేకచోట్ల మురికి కుప్పలు, ఎగిరే ప్లాస్టిక్ కవర్లు గుట్టలుగా ఉంటున్నాయి. ఇదంతా ఎంతో సిగ్గుపడవలసిన విషయం. చెత్త పడేయటానికి డస్ట్ బిన్లను ఉంచినా కూడా.. కొందరు జనాలు ప్లాస్టిక్ కవర్లు, తాగిపడేసిన కప్పులను డస్ట్ బిన్లలో వేయకుండా క్రింద పడేస్తారు. చిన్నతనం నుండి పిల్లలకు శుచి, శుభ్రత గురించి నేర్పించాలి. పౌరులందరూ విధిగా శుచి, శుభ్రతను పాటించాలి. చెత్తను ఒక దగ్గర వేయటం, పరిసరాలను శుభ్రంగా, అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవటం..వంటివన్నీ చేయాలి. ఆలోచనలు, ఆచరణలు..కూడా మంచిగా ఉండాలి. ********** దేవాలయాల్లో ప్రసాదాలను తినేటప్పుడు క్రింద పడేస్తుంటారు. దేవాలయాల్లో ప్రసాదాలను తినటానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి, అక్కడే తినాలని చెప్పాలి. లేదా ఇంటికెళ్ళి తినాలని చెప్పాలి. దైవచిత్రాలను అనేకచోట్ల ముద్రించి, తరువాత చించి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. దైవచిత్రాలున్న పాకెట్లను చెత్తకుప్పలపైన పడేయటం మహా అపరాధం. అందువల్ల దైవచిత్రాలను ప్రచురించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. *********** ఎన్నికల గురించి కొన్ని విషయాలు.. ఎన్నికలలో..గంటలతరబడి నిలుచుని ఓట్లు వేయటం అనేది కష్టంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఉంటారు. పెద్ద వయస్సు వారుంటారు. కొన్ని కారణాలతో ఎక్కువసేపు నిలబడలేని వారుంటారు. ఈ విషయాలను గమనించినప్పుడు, నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు రద్దీ వల్ల భక్తులను గదులలో కూర్చోబెట్టి వరుసగా పంపిస్తారు...అలా ఎన్నికల సమయంలో కూడా చేయవచ్చు కదా..అనిపించింది. ఎన్నికలప్పుడు ఓట్లు వేసే ప్రక్రియ స్కూల్స్ లో ఏర్పాటు చేస్తారు. స్కూల్స్ లో గదులు, కుర్చీలు ఉంటాయి. అక్కడ ఓటర్లను కూర్చోబెట్టి, వరుసగా ఓట్లు వేయించవచ్చు.. అనిపించింది. అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు. |
Friday, May 17, 2024
మరి కొన్ని విషయములు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment