koodali

Monday, September 17, 2018

మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచటం మరియు.



మట్టి లేకుండా నీటి ద్వారా మొక్కలు పెంచే పద్ధతిని హైడ్రోపొనిక్స్ అంటారు.


ఈ  పద్ధతిలో మొక్కలకు కావలసిన పోషకాలను నీటితో కలిపి అందిస్తారట.


ఇంట్లో.. పుదీనా, పొన్నగంటి ఆకు మొక్కలు..వంటి వాటిని పెంచుకోవచ్చు. 


అయితే, మట్టి లేకుండా పెంచే ఈ పద్ధతి కొందరికి నచ్చకపోవచ్చు.


నాకు ఏమనిపించిందంటే, కొంచెం మట్టి మరియు కొంచెం నీటి ద్వారా మొక్కలు పెంచటం మరింత బాగుంటుందనిపించింది.

అంటే, మొక్కను కొంచెం మట్టిలో నాటి, మొక్క మిగతా క్రింద భాగం వేర్లు నీటిలో ఉండేటట్లు చేయాలి.

ఈ విధానం వల్ల మట్టిలో ఉన్న వేర్లు మట్టిలో ఉన్న పోషకాలను అందుకుంటాయి. నీటిలో ఉన్న వేర్ల వల్ల మొక్క వాడిపోదు.


 ఈ పద్ధతిలో పుదీనా..వంటివి చక్కగా పెంచుకోవచ్చు.

 రోజూ  కుండీలో నీరు పోయకపోయినా మొక్క ఎండిపోదు.

 మరిన్ని వివరాలకు క్రింద లింకుల వద్ద చూడగలరు.


HOW TO GROW HYDROPONIC PLANTS |GROW PLANTS ON WATER

Self watering system for plants using waste plastic bottle


Cheap and easy to make wick system for herbs (and other plants)5


Hydroponics, Agriculture University, Jodhpur Agriculture University, Jodhpur By Dr. LN Harsh


25 of the Best Plants for Indoor Hydroponic Gardens | Dengarden

***********************

హైడ్రోపోనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో ఈ క్రింద లింక్ వద్ద నిపుణులు చెప్పిన వివరాలను జాగ్రత్తగా గమనించవలెను..

Tips for raising hydroponic fodder grass & vissaka farmers experience

************

పశువులకు పచ్చిగడ్దిని పూర్తిగా ఆపివేసి పూర్తిగా మొలకగడ్దిని మేపకూడదట. 

ఎక్కువమొత్తంలో కూడా మొలకలను మేపకూడదట. అలా చేయటం వల్ల పశువులు జబ్బుపడే ప్రమాదముందంటున్నారు. 

హైడ్రోపొనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో పశువైద్య నిపుణుల సలహాతో వాడటం మంచిది. 

.....................

Self watering system for plants using waste plastic bottle 

ఈ విషయం గురించి ఇప్పుడు కలిగిన కొత్త ఆలోచనలు ఏమిటంటే....

ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచినప్పుడు ఆ బాటిల్ ఎండలో ఉంటే ఎండకు నీరు వేడెక్కుతాయి.

తద్వారా మొక్కల వేర్లు వేడి నీటిలో ఉండటం వల్ల మొక్కలు చనిపోతాయి. 

 పైన మొక్క కొంత భాగం మట్టిలో  ఉన్నా కూడా, క్రింద వేర్లు వేడినీటిలో ఉన్నప్పుడు మొక్క వాడిపోతుంది.

 అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి  మొక్కలు పెంచే విధానంలో బాటిల్స్ ను ఎండలో ఉంచకూడదు.

 బాటిల్స్లో నీరు ఎండకు వేడెక్కకుండా బాటిల్స్ ను నీడలో మాత్రమే ఉంచాలి.
లేదా ఎండకు బాటిల్స్ లో నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బాటిల్స్ లోని నీరు వేడెక్కకుండా బాటిల్స్ చుట్టూ క్లాత్  చుట్టాలి.

 ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే ఎప్పట్లాగానే మట్టిలో మొక్కలు పెంచుకోవటం మంచిది.

పెద్ద ఎత్తున నీటిలో మొక్కలను పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేవారు ఎక్కువగా  గ్రీన్ హౌస్ లలో మొక్కలను పెంచుతారు కాబట్టి,  నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Commercial Hydroponics Farm in India


6 comments:


  1. హైడ్రోపోనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో ఈ క్రింద లింక్ వద్ద నిపుణులు చెప్పిన వివరాలను జాగ్రత్తగా గమనించవలెను..

    Tips for raising hydroponic fodder grass & vissaka farmers experience

    ************

    పశువులకు పచ్చిగడ్దిని పూర్తిగా ఆపివేసి పూర్తిగా మొలకగడ్దిని మేపకూడదట.

    ఎక్కువమొత్తంలో కూడా మొలకలను మేపకూడదట. అలా చేయటం వల్ల పశువులు జబ్బుపడే ప్రమాదముందంటున్నారు.

    హైడ్రోపొనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో పశువైద్య నిపుణుల సలహాతో వాడటం మంచిది.

    ReplyDelete
    Replies

    1. Self watering system for plants using waste plastic bottle....

      పై పద్ధతిలో మొక్క నీటిని పీల్చుకోవటానికి వీలుగా వత్తిని క్రింద నీటిలో అమర్చారు.

      అయితే వత్తితో పాటు కొన్ని వేర్లు కూడా క్రింద నీటిలో ఉండేలా అమర్చితే.. మట్టిలో ఉండే పోషకాలూ మొక్కకు అందుతాయి మరియు హైడ్రొపోనిక్ పద్ధతిలో ఉండే లాభాలూ కూడా ఉంటాయి.

      ***************

      హైడ్రొపొలిక్ పద్ధతిలో నీటిలో కలిపే పోషకాల గురించి కొన్ని సందేహాలు ఉండవచ్చు.

      అలాంటి మొక్కల ద్వారా లభించే ఆహారంద్వారా ఎలాంటి పోషకాలు లభిస్తాయి? అని కూడా సందేహాలుంటాయి.

      కేవలం నీటి ద్వారా మొక్కలకు పోషకాలను అందించటం కన్నా,

      కొంత మట్టి మరియు కొంత హైడ్రొపొనిక్ పద్ధతి కలిపి చేసే పద్ధతి బాగుంటుందనిపిస్తోంది.

      ఎలా అంటే...

      ఒక ప్లాస్టిక్ బాటిల్ సగానికి కట్ చేసి అడుగు భాగంలో నీటిని పోయాలి.

      పై మూత భాగాన్ని తిరగవేసి అమర్చాలి. మూత ఉన్న దగ్గర స్పాంజ్ ముక్క కట్ చేసి అమర్చాలి.

      కట్ చేసిన స్పాంజ్ నుంచి నీళ్ళు పీల్చుకోవటానికి వత్తిని మరియు వేర్లతో ఉన్న మొక్కను అమర్చాలి.

      స్పాంజ్ పైన కొంత కొబ్బరి పీచు వేసి ఆ పైన కొంచెం మట్టి వేయాలి.

      మొక్క నాటేటప్పుడు వేర్లు ఉన్న భాగం కొంత పైన మట్టిలో ఉంటే, కొన్ని వేర్లు నీటిలో ఉండేలా నాటాలి.

      మట్టిలో జీవామృతం వేయవచ్చు.

      ఈ విధంగా చేయటం వల్ల మొక్కకు మట్టి నుంచి పోషకాలు అందుతాయి. మట్టి లేదు అనే సమస్య ఉండదు.

      క్రింద ఉన్న నీటి వల్ల రోజూ నీరు పోయకున్నా మొక్క ఎండిపోదు. క్రింద ఉన్న నీటిని వారానికి ఒకసారి మార్చి కొత్త నీరు పోయవచ్చు.

      ..................

      ప్లాస్టిక్ బాటిల్ బదులు ..పైన మట్టి కుండీ మరియు క్రింద నీరు నిలిచేలా పింగాణీ జాడీ లేదా గాజు సీసా వాడవచ్చు.

      గాజు సీసా అయితే మొక్క వేర్లు బయట నుంచి చూస్తే నీటిలో బాగా కనిపిస్తాయి.

      Delete

  2. శ్రీ శర్మ గారి శ్రీమతి గారి గురించిన వార్త చదివిన తరువాత చాలా బాధ కలిగింది. ఏం రాయాలో తెలియటం లేదు.

    వారు అన్యోన్య దంపతులు. శర్మ గారు వ్రాసిన విషయాల ద్వారా వారి గొప్పదనం గురించి తెలిసింది. ఆమె లేని లోటు లోటే.

    అయితే, భార్యాభర్తలు ఎవరికైనా జీవితంలో ఎప్పటికైనా ఇలాంటి సమస్యను అనుభవించటం తప్పనిసరే అయినా, ఆ పరిస్థితి అనుభవంలోకి వచ్చినప్పుడు భరించటం కష్టమే.

    ఆమెకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను.

    శర్మగారు, వారి కుటుంబసభ్యులు ఇలాంటి కష్టసమయంలో బాధను తట్టుకుని ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. anrd గారూ, శర్మ గారి శ్రీమతి గారు కాలం చేసిన కష్టకాలంలో పైన మీరు సాంత్వన కలిగించే మాటలు చెప్పారు.
    ఒక సలహా, ఏమనుకోకండి ... ఈ నివాళిని శర్మ గారి బ్లాగ్ లో కూడా పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని.

    కష్టేఫలే వారి బ్లాగ్

    ReplyDelete
  4. మీకు ధన్యవాదములండి.

    వ్యాఖ్యను వారి బ్లాగ్ లో పోస్ట్ చేసాను.



    ReplyDelete

  5. Self watering system for plants using waste plastic bottle


    ఈ విషయం గురించి ఇప్పుడు కలిగిన కొత్త ఆలోచనలు ఏమిటంటే....

    ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచినప్పుడు ఆ బాటిల్ ఎండలో ఉంటే ఎండకు నీరు వేడెక్కుతాయి.

    తద్వారా మొక్కల వేర్లు వేడి నీటిలో ఉండటం వల్ల మొక్కలు చనిపోతాయి.


    పైన మొక్క కొంత భాగం maTTiloe ఉన్నా కూడా, క్రింద వేర్లు వేడినీటిలో ఉన్నప్పుడు మొక్క వాడిపోతుంది.

    అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచే విధానంలో బాటిల్స్ ను ఎండలో ఉంచకూడదు.

    బాటిల్స్లో నీరు ఎండకు వేడెక్కకుండా బాటిల్స్ ను నీడలో మాత్రమే ఉంచాలి.లేదా ఎండకు బాటిల్స్ లో నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

    బాటిల్స్ లోని నీరు వేడెక్కకుండా బాటిల్స్ చుట్టూ క్లాత్ చుట్టాలి.

    ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే ఎప్పట్లాగానే మట్టిలో మొక్కలు పెంచుకోవటం మంచిది.

    పెద్ద ఎత్తున నీటిలో మొక్కలను పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేవారు ఎక్కువగా గ్రీన్ హౌస్ లలో మొక్కలను పెంచుతారు కాబట్టి నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

    Commercial Hydroponics Farm in India

    ReplyDelete