koodali

Saturday, March 26, 2016

స్త్రీల సమస్యల గురించి కొన్ని అభిప్రాయాలు..



ఈ రోజుల్లో స్త్రీలకు ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించటం పట్ల శ్రద్ధ చూపకుండా... కొన్ని దేవాలయాలలోకి స్త్రీలను ప్రవేశం లేకపోవటం వివక్ష అంటూ గొడవ చేయటం ఏమిటి?

 స్త్రీలను ఉద్ధరించాలనుకుంటే  పరిష్కరించటానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

 ఎందరో స్త్రీలు వేశ్యాగృహాలలో నరకాన్ని అనుభవిస్తున్నారు.

 ఎందరో స్త్రీలు  అత్తలు, ఆడపడుచులు, సవతులు వంటి..తోటి స్త్రీల వల్లే  వేదనకు గురవుతున్నారు. 

పాఠశాలల్లో, కాలేజీల్లో , ఆఫీసులలో  లైంగిక వేధింపులు వల్ల ఎందరో స్త్రీలు వేదనను అనుభవిస్తున్నారు. 

ఇంకా  ఎన్నో సమస్యలున్నాయి . ఈ సమస్యలను పరిష్కరించుకుంటే  బాగుంటుంది.
.................................

Posted by anrd at 10:39 PM 
8 COMMENTS:

AnonymousJanuary 30, 2016 at 1:27 AM

వేరే వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే బదులు మీరు ఇంతగా బాధపడుతున్న సమస్యల గురించి మీరే పని మొదలుపెట్టొచ్చుగా. వాళ్లకి ఇబ్బందికి గురిచేస్తున్న సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు, మీబోటి పెద్దలు అడ్డం పడకుండా ఉంటే అదే పదివెలు.

Reply
Replies

anrdJanuary 30, 2016 at 11:35 AM

మేము కొన్ని సంవత్సరాల క్రిందట శనిశింగణాపూర్ వెళ్లి వచ్చాము. అక్కడ దైవదర్శనం చేసుకోవాలంటే స్త్రీలు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే మూలమూర్తి ఉన్న అరుగు పైకి మహిళలు వెళ్ళకూడదు. మూలమూర్తి ఆరుబయటే ఉంటారు కాబట్టి చక్కగా దర్శనమిస్తారు. 

పురుషులు పైన షర్ట్ లేకుండా తడి దుస్తులతో మూలమూర్తి వద్దకు వెళ్లాలనే నియమం ఉన్నట్లు గుర్తు. మరి ఈ విషయం పురుషుల పట్ల వివక్షగా భావించటం లేదు కదా ! 

అయ్యప్పస్వామి వద్దకు రజస్వల కాని ఆడపిల్లలు, బహిష్టులు ఆగిపోయిన ఆడవాళ్ళు వెళ్ళవచ్చు. కొన్ని ఆచారాలు అలా ఉంటాయి. 

శ్రీశైలంలో శివలింగాన్ని స్త్రీలు, పురుషులు అందరూ తాకవచ్చు.

ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా నియమాలు ఉంటాయి. పెద్దలు వద్దన్నదే చేయాలనే పంతం ఎందుకు ?

ఆ మధ్య కొందరు ఆడవాళ్ళు గాయత్రి మంత్రం ఎందుకు చేయకూడదు ? ఇది స్త్రీల పట్ల వివక్షే అంటూ ఆవేశపడిపోయారు.

నాకు తెలిసిన ఒక విషయం చెబుతాను. మా బంధువుల అమ్మాయి గాయత్రి మంత్రం ప్రారంభించి కొంతకాలం చేసింది. కొంతకాలం తరువాత ఆ అమ్మాయికి బహిష్టులు అస్తవ్యస్తంగా వచ్చాయి. ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.

పెద్దవాళ్ళు గమనించి గాయత్రిమంత్రం ఆపివేయించగా తిరిగి నెలసరి సక్రమంగా రావటం జరిగిందని చెప్పింది.

( స్త్రీలకు నెలసరి, గర్భం దాల్చటం వంటివి ఉంటాయి కాబట్టి కొన్ని నియమాలు పాటించటం కుదరదు. కొన్ని మంత్రాలు చదివితే స్త్రీలలో గర్భసంచికి అనారోగ్యం కలిగే అవకాశం ఉందని కూడా అంటారు.)


ఏ విషయంలో ఏ రహస్యం ఉందో తెలియదు. పెద్దవాళ్లు వద్దని చెప్పిన విషయాలే చేస్తామని పట్టుబట్టడం ఎందుకు ?


కొన్ని దేవాలయాల లోపలికి స్త్రీలు వెళ్ళవద్దు .. అని పెద్దలు చెప్పటంలో ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. మేము ఎందుకు వెళ్ళకూడదు ? అని పంతాలు పోవటం ఏమిటి ? 



anrdJanuary 30, 2016 at 12:40 PM

హాస్పిటల్లో ఆపరేషన్ ధియేటర్లోకి అందరినీ రానివ్వరు. ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి. అంతమాత్రాన వివక్ష అంటారా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అయినా సరే పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చుంటామంటే ఎప్పుడుపడితే అప్పుడు అందరినీ వెళ్ళనిస్తారా ? ఈ విషయంలో కొన్ని ఆంక్షలుంటాయి.అంతమాత్రాన వివక్ష అంటారా ? 

కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళటానికీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఇందులో వివక్ష ఏమీలేదు.



Jai GottimukkalaFebruary 1, 2016 at 12:39 PM

సమానత్వం అనే హక్కు ప్రైవేటు సంస్థలకు వర్తించదు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలలో మందిరం తాలూకా అనాదిగా పాటిస్తున్న ఆచారాలు ఉంటాయి. సదరు ఆచారాలు హేతుబద్దమా కాదా అన్న చర్చ సరికాదు. వారి గుడి కనుక వారి ఆచారాలు అందరూ పాటించాలి. కాదు కూడదు అనుకుంటే యాజమాన్యంతో చర్చించాలి కానీ రోడ్డు మీద గొడవ చేయడం అనవసరం.

మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


anrdFebruary 1, 2016 at 9:02 PM

అవునండి, మహిళలకు అనేక సమస్యలు ఉన్న తరుణంలో ఇలాంటి విషయాలు లేవనెత్తి ఉపద్రవం జరుగుతుందని గగ్గోలు పెట్టడం అసలు సమస్యలను దృష్టి మళ్లించడమే.


Reply

anrdJanuary 30, 2016 at 10:26 AM


ఈ మధ్య ఈనాడులో ఒక వార్త వచ్చింది.తెలుగురాష్ట్రాలలోని వైశ్యులలో కొందరికి భూటెల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైం లోపం ఉన్నట్లు గుర్తించారట.ఈ లోపం ఉన్నవారికి ఏదైనా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మత్తుమందు ఇస్తే తిరిగి వారు స్పృహలోకి రావడం లేదట, కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారట. 

ఈ ఎంజైం లోపం గుర్తించిన తరువాత మత్తు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వైద్యులు ప్రత్యామ్యాయ మార్గాలు అనుసరిస్తున్నారట. 

దక్షిణభారతదేశానికి చెందిన వారు అమెరికాలో ఆసుపత్రికి వెళ్లినా ఇప్పుడు వారి కులం గురించి అడుగుతున్నారట. భారత్ లో వైద్యులు కూడా శస్త్రచికిత్స సమయంలో కులం గురించి అడుగుతున్నారట.

భిన్నకులాలు, మతాల సమ్మిళతమైన భారతదేశంలో జన్యు పరిశోధనకు అపారావకాశాలున్నాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయ జన్యుశాస్త్రవేత్త డేవిడ్ రీచ్ అనేవారు తెలియజేశారట.

( ఇందువల్ల .. మీది ఏ కులం ? అని వైద్యులు అడిగితే కులం సరిగ్గా చెప్పాలి. అంతేకానీ వైద్యులు కులవివక్ష చూపిస్తున్నారు. కులంగిలం అంటూ ఏమీలేద్.... అంటూ ఆవేశపడకూడదు.)


Reply

anrdJanuary 30, 2016 at 10:27 AM


స్త్రీల సమస్యల పట్ల శ్రద్ధచూపుతూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారు ఎందరో ఉన్నారు. సునీతాకృష్ణన్ వంటివారు ఎంతో ధన్యజీవులు. అలాంటివారికి అండగా నిలిచి స్త్రీల సమస్యలను పరిష్కరించితే అందరూ అభినందిస్తారు.

సతీసహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం కూడా అభినందించతగినదే. 

( అయితే సతీసహగమనం ఏవో కొన్ని కారణాల వల్ల ఆచారంగా ఏర్పడి ఉంటుంది. అంతేకానీ సనాతనధర్మం సతీసహగమనాన్ని ఆచారంగా ఏర్పరచలేదు. రామాయణంలో కౌసల్య, సుమిత్ర, కైక సతీసహగమనం చేయలేదు, భారతంలో సత్యవతి, కుంతీదేవి కూడా సహగమనం చేయలేదు.)

అయితే, జోగిని వ్యవస్థ వంటివి దురాచారాలే. ఇలాంటి దురాచారాలను రూపుమాపటానికి ఎవరు ఉద్యమాలు చేసినా అభినందనీయమే. 

సమాజంలో ఎన్నో సమస్యలు ఉండగా అవి పరిష్కరించటం పైన శ్రద్ధ పెట్టకుండా ..స్త్రీలు అన్ని దేవాలయాల లోపలి వరకూ వెళ్ళి ముట్టుకుని తీరుతాం అంటూ ఉద్యమాలు చేయటమేమిటి ? దీని వెనుక ఉన్న విషయం ఏమిటి ?


Reply

anrdJanuary 30, 2016 at 12:35 PM

బహిష్టు సమయం లో స్త్రీలు నీరసంగా ఉంటారు కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. 

ఆ సమయంలో ఎక్కువ పనులు చేయకుండా మైల అంటూ కట్టడి చేసారు. ఇలాగైనా ఆ నాలుగురోజులూ స్త్రీలకు విశ్రాంతి లభిస్తుంది.

నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అదేపనిగా పనిచేస్తే గర్భసంచి జారే అవకాశం కూడా ఉంది. అప్పుడు శాశ్వతంగా గర్భం ధరించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. 

అయితే ఈ రోజుల్లో శానిటరీనాప్కిన్స్ వాడుతూ గెంతులు వేయవచ్చునంటూ ప్రచారం చేస్తున్నారు.( ఇది సరైనది కాదు.)

కొంతమంది స్త్రీలలో నెలసరి సమయంలో విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. 

చదువులు.. పరీక్షలు, ఉద్యోగాలు..టార్గెట్లతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యం ఎలా ఉన్నా బయటకు వచ్చి కష్టపడటం స్త్రీలకు తప్పనిసరి అయ్యింది. 



No comments:

Post a Comment