koodali

Friday, December 18, 2015

మాంసము.......మానవాహారము కాదు.

 

ఈ క్రింది విషయాలు ఒక ప్రముఖ వైద్యులు వ్రాసిన పుస్తకంలోనివండి.


భగవంతుడు ఆయా జీవరాశుల నివాసములు, పరిసరములు, వాతావరణము, అంగసౌష్ఠవములను బట్టి విభిన్న ఆహారములను నియమించటం జరిగింది.



భగవంతుని సృష్టి ఎంతో అద్భుతమైనది .


జీవరాశులలో శాకాహారులు, తృణాహారులు, ఫలాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు ఇలా వివిధశాఖలుగా ఏర్పడి ఉన్నాయి,..


మాంసాహారులైన జంతువులకు అందుకు తగినట్లుగా వాడికోరలు అవి ఉంటాయి.ఉదా.. సింహము, పులి, నక్క, వగైరాలు. భగవంతుడు వాటికి మాంసాహారానికి అనువైన అంతరావయములను, జీర్ణాదిరసములను అమర్చారు.


మాంసము త్వరగా కుళ్ళిపోతుంది.అది ప్రేగులలో నిలువయుండుట వల్ల అనేక రోగక్రిములు ప్రవేశించే అవకాశమున్నది. కనుక త్వరగా జీర్ణమై మలము వెలువరించబడుటకు గానూ ,కుఱుచైన జీర్ణకోశము, మలకోశముల ఏర్పాటు జరిగింది.


వాటి ప్రేగుల నిడివి జంతువులను బట్టి ఉంటాయి., ఉదా..పెద్దపులి, సింహము వంటి వాటికి 10 అడుగుల పొడవు మాత్రము ఉంటాయి. అందువల్ల ఈ మృగములు మాంసమును భుజించిన ఐదారుగంటలకే మలవిసర్జన చేస్తాయట.


అదే మానవుల జీర్ణమండలము, జీర్ణాదిరసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధముగా ఏర్పాటై ఉన్నాయి.మానవ జీర్ణమండలము దాదాపు 30 అడుగుల పొడవుంటుందట.

అందువల్ల 24 గంటలకు గానీ మలవిసర్జన జరుగదు ,మాంసము 24 గంటలు ప్రేవులలో ఉండటం వల్ల అది కుళ్ళిపోయి దుర్వాయువులు వస్తాయి.


ఆ గాస్ వల్ల గాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, నులిపురుగులు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

ఇంకా అనేక వ్యాధులు వచ్చే అవకాశముందటున్నారు. రక్తం పులిసి చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారవుతుందట.


అంతేకాక , రక్తం చిక్కబడిపోవటం . అందువల్ల కీళ్ళనొప్పులు, గుండెజబ్బులు, మూత్రపిండాలలో రాళ్ళు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


మాంసాహారము తమోగుణమును కలిగిస్తుంది.. అందువల్ల ఉద్రేకము, కోపము, అశాంతి వంటివి పెరుగుతాయి. అందుకని శాకాహారమే మానవులకు మంచిదని చెప్పారు .

ఎక్కువగా పండ్లు ,పచ్చి కూరగాయలు వంటివి తినాలి..మితిమీరి వండిన ఆహారపదార్ధాలు , ఎక్కువకాలం ఫ్రిజ్లలో నిలువ ఉన్నవీ వంటి
 ఆహారపదార్ధాలు తినకూడదు.

యిలా ఎన్నో విలువైన విషయాలను చెప్పటం జరిగింది.

6 comments:

  1. you are right. non veg should not be eaten.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. Humans evolved as Omnivores (https://en.wikipedia.org/wiki/Omnivore). Apart from some castes in India - all most all other cultures eat meat in varying degrees and they are not sick or their life spans are less.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    ఈ రోజుల్లో కొంతమంది తప్ప చాలామంది మాంసాహారాన్ని భుజిస్తున్నారు.

    అయితే, మాంసాహారులకు జబ్బులు రావటం లేదని మీరు ఎలా చెప్తున్నారు ?

    ఈ రోజుల్లో వ్యాధులు ఎక్కువవటానికి మాంసాహారం ఎక్కువవటం కూడా ఒక కారణం.
    ...........

    శాకాహారులు..మాంసాహారులలో భేదాలున్నాయి. శాకాహారులలో పాలు, నెయ్యి తినని రకం వాళ్ళు కూడా ఉంటారు.

    మాంసాహారులలో కూడా తేడాలున్నాయి. తక్కువ మాంసాహారం తింటూ ఎక్కువగా శాకాహారాన్ని తినే వాళ్ళూ ఉంటారు.
    ............

    అయితే , శాకాహారులను... మాంసాహారులను పరీక్షించగా తేలిన కొన్ని విషయాలు ఏమిటంటే..

    మాంసాహారులతో పోల్చితే, శాకాహారులలో ఇన్సులిన్ సెన్సిటివిటి ఎక్కువగా ఉంటుందని తేలిందట.( ఇది శాకాహారులకు లాభమే కదా ! )

    ఇంకొక విషయం ఏమిటంటే , మాంసాహారులతో పోల్చుకుంటే శాకాహారులలో plasma carotenoids level ...15% ఎక్కువగా ఉంటుందట.( ఇది శాకాహారులకు లాభమే కదా ! )

    ఇక గుండె జబ్బుల విషయంలో మాంసాహారులకు, శాకాహారులకు కూడా రిస్క్ ఉంటుందట.

    ఉదా..మాంసాహారం తినటం వల్ల మాంసాహారులకు గుండెజబ్బు వస్తే...నెయ్యి, నూనెతో చేసే స్వీట్స్ వంటివి అధికంగా తినటం వల్ల శాకాహారులకు గుండె జబ్బు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
    .................

    ఇక, పైన వ్రాసిన టపాలో వ్రాసిన వివరాలను బట్టి చూస్తే ....మాంసాహారులకు అనేక వ్యాదులు వచ్చే అవకాశం ఎక్కువే ఉంది.

    ఎవరైనా కూడా కొవ్వు పదార్ధాలు మరీ అధికంగా తీసుకోకూడదు. నిలువ ఉన్న ఆహారాన్ని తినకూడదు.

    ఇక, మద్యపానం వంటి అలవాట్ల వలన ఎవరికైనా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.

    ReplyDelete
    Replies
    1. భారతదేశంలో మాంసాహారులు... శాకాహారం కూడా తీసుకుంటున్నారు.

      విదేశాల్ల్లో మాంసాహారులు కూడా చాలా శాకాహారాన్ని తింటారు. ఆ శాకాహారం వారిని కొంతవరకూ కాపాడుతోంది.

      మాంసాహారం ద్వారా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

      ఉదా..కొంతకాలం క్రితం మాడ్ కౌ డిసీస్ వల్ల కొందరు మరణించారన్న విషయం తెలిసిందే కదా.

      Delete
  4. పైన వ్రాసిన టపాలో వ్రాసిన వివరాలను బట్టి చూస్తే..
    పెద్దపులి, సింహము వంటి వాటికి 10 అడుగుల పొడవు మాత్రము ఉంటాయి....అందువల్ల ఈ మృగములు మాంసమును భుజించిన ఐదారుగంటలకే మలవిసర్జన చేస్తాయట.

    అదే మానవుల జీర్ణమండలము, జీర్ణాదిరసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధముగా ఏర్పాటై ఉన్నాయి.

    మానవ జీర్ణమండలము దాదాపు 30 అడుగుల పొడవుంటుందట....అందువల్ల 24 గంటలకు గానీ మలవిసర్జన జరుగదు..

    ఆ గాస్ వల్ల గాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, నులిపురుగులు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.ఇంకా అనేక వ్యాధులు వచ్చే అవకాశముందటున్నారు. రక్తం పులిసి చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారవుతుందట.

    అంతేకాక , రక్తం చిక్కబడిపోవటం . అందువల్ల కీళ్ళనొప్పులు, గుండెజబ్బులు, మూత్రపిండాలలో రాళ్ళు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఈ విషయాలను గమనిస్తే, మాంసాహారం కన్నా శాకాహారమే మంచిదని తెలుస్తోంది.


    ReplyDelete