koodali

Saturday, October 10, 2015

కాణిపాకం బ్రహ్మోత్సవాలు..

 
కాణిపాకం  శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయము ఎంతో ప్రసిద్ధమయినది. వినాయకచవితి నుండి కొన్ని రోజులపాటు  వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. 

 21 రోజుల పాటు జరిగే  కాణిపాకం బ్రహ్మోత్సవాలను టీవీ చానల్స్లో అంతగా ప్రసారం చేయలేదేమోనని నాకు అనిపించింది.( ప్రసారం చేసారేమో నాకు తెలియదు.)

అయితే, కాణిపాకం వినాయకుని కల్యాణం ప్రసారం చేసారు. 

కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగమైన తెప్పోత్సవాన్ని కూడా  SVBC చానల్ ద్వారా ప్రసారం చేయటం  ఎంతో సంతోషకరమైన విషయం.
 .............
 అంతర్జాలంలో  కాణిపాకం  బ్రహ్మోత్సవాలు  గురించి  కొద్దిపాటి వివరాలు తప్పించి , అంతగా ఉన్నట్లు అనిపించలేదు.



2 comments:

  1. అనూరాధ గారికి,
    నమస్కారములు.

    ఈ మధ్య స్మరణ లో చక్రాలు గురించి టపాలు పెట్టాను. అందులో అనాహతచక్రం గురించి ఓ సందేహం వచ్చి, సరైనది నిర్ధారించుకోలేక ఆవేదనకు లోనౌతున్నాను. నా సందేహమును వివరంగా ఈ రోజు టపాలో పెట్టాను. తప్పుగా భావించక, ఆ టపాను చూసి, దయచేసి ఆ నా సందేహమును తీర్చి, నా ఆవేదనను తగ్గించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
  2. భారతి గారు మీకు నమస్కారములు.

    భారతి గారు ..మీరు ఆందోళన చెందనవసరం లేదు.

    మొదట నేనూ 'రాకిని' అనే భావించాను. కానీ, కొందరు పెద్దలు 'కాకిని' అని చెప్పడంతో ఒకింత తికమకకు లోనై , మరింత అధ్యాయనం చేసి, కొందరు పెద్దలను అడిగి ఈ చక్రంనకు అధిష్టానదేవత 'కాకిని' అని గ్రహించాను. అని మీరు వ్రాసారు.

    మీరు వ్రాసిన టపా వల్ల అనాహతానికి దేవత కాకినీదేవత అని కొందరు భావిస్తున్న విషయం తెలిసింది.
    ..........

    భారతి గారు ..ఈ విషయం గురించి నా అభిప్రాయం కూడా వ్రాసే అవకాశం కలిగించినందుకు మీకు కృతజ్ఞతలండి.
    .........

    నాకు సంస్కృతం తెలియదు.

    అయితే, నాకు ఏమనిపిస్తోందంటే,

    లలితాసహస్రనామములలో ..

    అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా|
    దంష్ట్రోజ్వలాఽక్షమాలాది ధరా రుధిర సంస్థితా||
    కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృతా స్నిగ్దౌదన ప్రియా|
    మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ||

    స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా|
    శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాఽతిగర్వితా||
    మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాది సమన్వితా|
    దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ||

    లలితా సహస్రనామములలోని పై విషయాలను గమనిస్తే అనాహత చక్రానికి రాకిని దేవత..స్వాధిష్ఠానానికి కాకినీ దేవత.. అధిష్టాన దేవతలు అనిపిస్తోంది.

    మరి, అనాహత చక్రానికి దేవత కాకిని దేవత అని కొందరు ఎందుకు అంటున్నారో ? తెలియటం లేదు.

    అనాహత చక్రానికి దేవత కాకినీ దేవత అయినట్లైతే..స్వాధిష్టాన చక్రానికి దేవత ఎవరు ? అనే సందేహం కూడా వస్తుంది.

    అనాహత చక్రానికి దేవత కాకినీ దేవత అయినట్లైతే .. లలితాసహస్రనామములను అలా చదవటం లేదు కదా !

    ............

    నేను వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete