koodali

Tuesday, September 23, 2014

కొన్ని విషయములు...అవతారముల గురించి ..



శ్రీ  దేవీ  భాగవతము  గ్రంధములో  విష్ణువు  ధరించిన అవతారముల  గురించి  కొన్ని విషయములు...

ఏ  మన్వంతరములో  ఏ  కధ  జరిగింది  అనే  విషయముల  గురించి  వ్యాసుల  వారు  జనమేజయునకు  తెలియజేసిన  కొన్ని  విషయములు...

చాక్షుష  మన్వంతరములో  ధర్ముడిగా  అవతరించాడు.  నరనారాయణులు  ధర్ముడి  కుమారులు.

పంధొమ్మిదవ  త్రేతాయుగంలో  జమదగ్నిసుతుడై  పరశురాముడిగా  అవతరించి  క్షత్రియ  సంహారం  కావించాడు...ఇదే  యుగంలో  రఘువంశాన  దశరధాత్మజుడై  రాముడిగా  అవతరించాడు.

ఇరవై  యెనిమిదవ  ద్వాపరయుగంలో నరనారాయణులు అర్జునశ్రీకృష్ణులుగా  ఆవిర్భవించారు.

భూభారం  తగ్గించటం  కోసం  కృష్ణార్జునులు  అవతరించారు. కురుక్షేత్ర  మహాసంగ్రామంలో  భీషణయుద్ధం  చేశారు. 

ఇలా  ప్రతి  యుగంలోనూ  శ్రీహరి  ప్రకృతికి  అనురూపంగా అవతారాలు  ధరిస్తూనే  ఉన్నాడు.  

పంధొమ్మిదవ  త్రేతాయుగంలో ....  రఘువంశాన  దశరధాత్మజుడై  రాముడిగా  అవతరించాడు....  

 కృష్ణార్జునులు  ఆవిర్భవించినది ఇరవై  యెనిమిదవ  ద్వాపరయుగంలో...  

 ఈ   విషయాలను   గమనిస్తే... రామాయణ, మహా భారత ..కాలనిర్ణయం  గురించి  మనకు  అనేక  ఆలోచనలు  వస్తాయి.)  
............

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణచరితామృతము  గ్రంధములో   ఎన్నో  విషయములు  ఉన్నాయి.
..........
ఒక  యోగి  ఆత్మ  కధ  గ్రంధములో   ఎన్నో  విషయములు  ఉన్నాయి. 


3 comments:

  1. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి.......

    ReplyDelete
  2. నిజమేనండి, శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఎన్నో విషయములను తెలియజేసారు.

    ...ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును. అంటూ ఎన్నో విషయములను తెలియజేసారు.

    ReplyDelete
  3. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి...
    శ్రీ దేవీ భాగవతములో ఒక శ్లోకం ఉంది.

    ఒకప్పుడు విష్ణుమూర్తి దేవీపూజ చేసారు. ఆ సందర్భంలో పై విషయాలను మనము తెలుసుకోవచ్చు.

    ReplyDelete