koodali

Wednesday, August 20, 2014

. వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం.......

 
ఓం,
నారాయణ  మహర్షి  నారద  మహర్షికి  ఎన్నో  విషయములను  తెలియజేసారు. వాటిలోని  కొన్ని  విషయములు..

 (శ్రీ  దేవీ  భాగవతము  నుంచి  తెలుసుకున్నవి...)

. జీవికి  కడదాకా  నిలిచేది  ధర్మమొక్కటే. తల్లిదండ్రులు గానీ భార్యాపుత్రులు గానీ జ్ఞాతి  మిత్రులు గానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు  సహాయకారి...

శాస్త్రీయమనీ  లౌకికమనీ ఈ ఆచారం రెండు విధాలు.రెండూ అనుష్టింపదగినవే. దేనినీ  పరిత్యజించటానికి  వీలులేదు. గ్రామ జాతి దేశ కుల ధర్మాలుంటాయి. వాటిని  పాటించాలి. ఉల్లంఘించకూడదు.

దురాచారుణ్ణి  లోకం  నిందిస్తుంది.వాడు దుఃఖభాజనుడవుతాడు.వ్యాధిపీడితుడవుతాడు. ధర్మవిరుద్ధమైన అర్ధకామాలను  పరిత్యజించాలి.అలాగే లోకవిరుద్ధమైన ధర్మాన్నీ పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనక.

నారాయణమహర్షీ ! మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి.ధర్మమార్గాన్ని  నిర్ణయించడంలో  దేన్ని  ప్రమాణంగా  తీసుకోవాలి  అనేది  పెద్ద  సందేహం.

నారదా ! సందేహం  ఏమీ  లేదు. శ్రుతిస్మృతులు  రెండూ  రెండు  కళ్ళు. పురాణమే  హృదయం. ఇవి  మూడూ  చెప్పినదే  ధర్మం. మరోటి  కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర  విరోధం  కనిపిస్తే  అక్కడ  వేదానిదే  తుదితీర్పు. 

స్మృతిపురాణాల  కన్నా  వేదం  చెప్పినదే  ప్రమాణం. వేదంలోనే  ద్వైధీభావం  కనిపిస్తే  అప్పుడు అవి రెండూ  ధర్మాలుగానే  పరిగణించాలి.స్మృతులలో ద్వైధీభావం  కనిపించినా  ఇంతే. వేదంతో  సరిచూసుకోవాలి. ..


.కొన్నిచోట్ల  పురాణాలలోనూ  తంత్రగ్రంధాలలోనూ  కనిపించేవాటిని  కూడా  యధాతథంగా  ధర్మాలుగా  స్వీకరించాలని  కొందరు  అంటున్నారు.కానీ అది సరి కాదు. వేద  విరుద్ధం  కానంత  వరకే  పురాణాలుగానీ  తంత్ర గ్రంధాలు గానీ  ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శ్రుతి  విరుద్ధమైన  ధర్మం ఎవరు  చెప్పినా  అప్రామాణికమే. 


ధర్మమార్గ  నిర్ణయంలో సర్వదాసర్వధా వేదమొక్కటే పరమప్రమాణం. దానికి  అవిరుద్ధంగా  ఉంటే స్మృతులూ  పురాణాలూ  తంత్రగ్రంధాలూ  చెప్పినవి  కూడా  కొండొకచో ప్రామాణికాలు అవుతాయి.మరింకేమీ ప్రామాణికం కానే కాదు.


వేదధర్మాన్ని  కాదని  ఇతర ప్రమాణాలను  పట్టుకుని  ఆ మార్గాల్లో  నడిచే  వారికోసం  యమలోకంలో  నరకకుండాలు  సిద్ధంగా  ఉన్నాయి. అందుచేత  వేదోక్తమే  ధర్మం. దానినే  ప్రయత్నపూర్వకంగా  ఆచరించాలి. స్మృతులూ  పురాణాలూ  తంత్రాలూ  శాస్త్రాలూ  ఏది  చెప్పినా  వేదమూలమైనంతవరకే  ప్రామాణికం.


కొందరు ఏవేవో కుశాస్త్రాను  ప్రమాణాలుగా  చూపించి ప్రజలను  తప్పుదోవ  పట్టిస్తుంటారు. అటువంటివారు  నరకానికి  పోతారు....అందుచేత  వేదం  ఒప్పుకున్నదే  సద్ధర్మం.  దానినే  ఆచరించాలి.. .  అంటూ  ఎన్నో  విషయాలను  తెలియజేసారు.
.......................

వేదంలోనే  ద్వైధీభావం  కనిపిస్తే  అప్పుడు అవి రెండూ  ధర్మాలుగానే  పరిగణించాలి. అనే  విషయం గురించి .. కొన్ని  అభిప్రాయాలను  వ్రాయటం  జరిగింది.
. నాకు ఏమనిపించిందంటే,
 
ఆలస్యం అమృతం విషం ..అని చెప్పిన పెద్దలే నిదానమే ప్రధానం.. అనీ తెలియజేసారు. ఇదేమిటి ? ఇలా పరస్పర విరుద్ధంగా చెప్పారు ? అనుకోకూడదు. రెండూ సరైనవే.

ఉదా
..ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు, నిదానమే ప్రధానం .. అనే సూత్రాన్ని పాటించకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఆలస్యం అమృతం విషం ..అనే సామెత ప్రకారం నడుచుకోవాలి.వీలైనంత త్వరగా వెళ్ళి మంటలను ఆర్పాలి.


ఉదా..ఎక్కడైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, ఆలస్యం అమృతం విషం.. అనుకుంటూ వెంటనే వెళ్ళి విడాకులు ఇప్పించకుండా , కొంతకాలం వేచి చూస్తే , భార్యాభర్త తమ పట్టుదలలను విడిచిపెట్టి సర్దుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ నిదానమే ప్రధానం.. అనే సూత్రం బాగానే ఉంటుంది.

వ్రాసిన అభిప్రాయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 



3 comments:


  1. .వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండూ ధర్మాలుగానే పరిగణించాలి.అనే విషయాన్ని గమనించితే నాకు ఏమనిపించిందంటే,

    ఉదా..ఆలస్యం అమృతం విషం అని చెప్పిన పెద్దలే నిదానమే ప్రధానం.అనీ తెలియజేసారు. ఇదేమిటి ? ఇలా పరస్పర విరుద్ధంగా చెప్పారు ? అనుకోకూడదు. రెండూ సరైనవే.

    ఉదా..ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు, నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఆలస్యం అమృతం విషం అనే సామెత ప్రకారం నడుచుకోవాలి.వీలైనంత త్వరగా వెళ్ళి మంటలను ఆర్పాలి.

    ఎక్కడైనా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, ఆలస్యం అమృతం విషం అనుకుంటూ వెంటనే వెళ్ళి విడాకులు ఇప్పించకుండా , కొంతకాలం వేచి చూస్తే , భార్యాభర్త తమ పట్టుదలలను విడిచిపెట్టి సర్దుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ నిదానమే ప్రధానం అనే సూత్రం బాగానే ఉంటుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete