koodali

Friday, November 25, 2011

పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే..... .. మూడవ భాగం........

 
ఈ ప్రపంచం ఒక పద్దతి ప్రకారం దైవం చేత సృష్టించబడింది. ఉదా.... మొక్కలు ఉన్నాయి. అవి విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే కుందేలు, మేకలు వంటి శాకాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది .


ఈ శాకాహార జంతువులు ఎక్కువగా పెరిగిపోయి మొక్కలను బాగా తినేస్తే మొక్కలు గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ జంతువులు విపరీతంగా పెరిగిపోకుండా వాటిని ఆహారంగా తీసుకునే మాంసాహార జంతువులు సృష్టించబడ్డాయి అనిపిస్తుంది.


పులి వంటి కొన్ని జీవులను పరిశీలిస్తే ......పులి పిల్లలకు జన్మ ఇచ్చాక వెంటనే తన పిల్లలను తానే చంపుతుంది అని ఒక దగ్గర చదివానండి,. . . . . అలా చంపబడకుండా మిగిలిఉన్నవి జీవిస్తాయట.


లేకపొతే పులులవంటి బలమైనక్రూర జంతువుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతే మిగిలిన జీవులకు అపాయం కాబట్టి సృష్టిలో ఇలాంటి ఏర్పాటు జరిగిఉంటుంది అని కూడా చదివానండి.


యిలా ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండేలా దైవం ఏర్పాటు చేశారు.


ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది . మరి మొక్కలు వంటి జీవులు విపరీతంగా పెరిగితే తప్పేమిటని ? మొక్కలు విపరీతంగా గుబురుగా పెరిగిపోతే వాటికి ఆహారసమస్య ఎదురవుతుంది. అంటే, వాటికి నేలనుండి అందే పోషకాలు సరిపోవు.

ఉదా...మన ఇళ్ళలో కూడా మొక్కలు ఏపుగా పెరగాలంటే మొక్కకుమొక్కకు నడుమ కొంచెం దూరంగా నాటాలి.


ఇంకా ప్రపంచంలో ఒకో ప్రదేశంలో ఒకోరకమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణానికి తగ్గట్టు జీవులు ఉంటాయి.

ఒకే దేశంలో కూడా రకరకాలుగా వాతావరణం మారుతుంటుంది.


ఒక ప్రదేశంలో పెరిగే మొక్కలకు వాటికి తగ్గ సహజ మిత్రులు, సహజ శత్రువులు ఉంటాయట.


అంటే మొక్కలు విపరీతంగా పెరిగిపోకుండా చీడపురుగుల వంటివి కూడా వస్తాయి. చీడపీడలు మరీ ఎక్కువయితే మొక్కలు పూర్తిగా అంతరించిపోతాయి.


( అప్పుడు ఇతర జీవులకు ఆహారసమస్య ఎదురవుతుంది.)అలా కాకుండా మొక్కలనాశించే చీడపురుగులను పట్టితినే పక్షులు ఉంటాయి.అలా మొక్కలకు తగు రక్షణ ఉంటుంది.

ఇలా సృష్టిలో ఒక క్రమం ఉంది. మనుషుల్లో కూడా జనాభా విపరీతంగా పెరగకుండా ప్రకృతిలో ఏర్పాట్లు ఉన్నాయి.


అయితే ఒక దగ్గర జీవించే మొక్కలను తీసుకెళ్ళి వేరొక ప్రాంతంలో నాటితే ........ అక్కడ వాటికి సహజ శత్రువులు , సహజ మిత్రులు లేక ....... ఆ జీవులు అంతరించిపోవటమో లేక విపరీతంగా వృద్ధి చెంది సమస్య రావటమో జరుగుతుందట.

అందుకే ఎక్కడివాటిని అక్కడే ఉంచటమే మంచిపద్ధతి.

అయితే జీవులు కూడా ఒక్కసారిగా పరిసరాలు, వాతావరణం మారినప్పుడు త్వరగా అలవాటుపడలేవు.

కొన్ని జీవులు ప్రపంచంలో ఎక్కడయినా జీవించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. . .

కొన్ని అలా కాదు . ఉదా.... ఇప్పుడు మనం చూస్తున్న మిరపమొక్క విదేశాలనుంచి వచ్చిందంటారు. ( పూర్వం మనవాళ్ళు కారం కోసం మిరియాలు వాడేవారట. ) ఇప్పుడు మిరప భారతదేశంలో బాగానే పెరుగుతోంది .

అయితే దూరంగా ఉన్నా కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని వాతావరణంలో పోలికలు కనిపిస్తాయి .

అయితే యాపిల్ మొక్క వేడిగాఉండే ప్రాంతాలలో తెచ్చినాటితే ఏపుగా పెరగదు. చలిప్రాంతాల్లోనే బాగా పెరుగుతుంది. ఇలాంటి వాటిని వాటికి తగ్గ చల్లనివాతావరణం ( గ్లాస్ హౌస్ ) ఏర్పరిచి పండించటానికి ప్రయత్నిస్తున్నారు .


కోతులు ప్రపంచంలో చాలాచోట్ల ఉంటాయి. కానీ, ధ్రువపు ఎలుగుబంట్ల వంటి వాటిని వేడి ప్రదేశాల్లో పెంచలేము కదా!

ఇంకా నాకు అనిపిస్తుంది ఎక్కడి వారికి ఆ ప్రాంతంలో దొరికే ఆహారమే బలాన్ని కలిగిస్తుందేమో అనిపిస్తుంది. ఉదా...మనకు నిమ్మ, ఉసిరి వంటివి బాగా దొరుకుతాయి.

కానీ మనకు పొరుగింటిపుల్లకూర రుచి అన్నట్లు యాపిల్ పండే బలమని చాలామంది నమ్మకం.

20 రూపాయలు పెట్టి ఒక యాపిల్ కొంటారు గానీ, 2 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ లేక ఒక ఉసిరి కాయ కొని రోజూ రసం తాగితే కావలసినంత 'సి ' విటమిన్ లభిస్తుంది.

అసలు నిమ్మ, ఉసిరిలో యాపిల్ కన్నా గొప్ప సుగుణాలు ఉన్నాయట.

అందుకే ఎక్కడి వాతావరణానికి తగ్గట్టు అక్కడ లభించే వాటిని ఎక్కువగా తినటం మరింత మంచిదేమోనని నాకు అనిపిస్తుంది.

కొన్ని పక్షులు వలస వస్తుంటాయి. కొంతకాలం గడిచాక తిరిగి తమదేశాలకు వెళ్ళిపోతుంటాయి. వాటికి పరిణామం చెందవలసిన అవసరం ఉండకపోవచ్చు.

కానీ , కొన్ని జీవులు తప్పనిసరి పరిస్థితిలో కొత్త వాతావరణంలో పరిసరాలలో జీవించవలసి వస్తుంది.

ఉదా.. ఒక మొక్కనో, జంతువునో వేరే ప్రదేశాలకు తీసుకెళ్తే వాటిజాతి తప్పనిసరిగా కొత్తప్రదేశానికి అనుగుణంగా నెమ్మదిగా పరిణామం చెందవలసి ఉంటుంది కదా ! ఇలాంటి సందర్భాలలో జీవులకు పరిణామలక్షణం అన్నది మంచిదే కదా!

ఈ రోజుల్లో మనుషులు అంతులేని కోరికలతో రకరకాల రసాయనాలు కనుక్కుని వాటితో (వాటి వ్యర్ధాలతో ) భూమిని, నీటిని, గాలిని పొల్యూట్ చేస్తున్నారు.


ఆ నీటిని త్రాగుతూ, ఆ భూమిలో పండిన పంటలను తింటూ, ఆ గాలిని పీలుస్తూ జీవులలో క్రమంగా బలం తగ్గిపోతోంది.


తీసుకునే ఆహారంలో బలం తగ్గిపోవటం, యంత్రాల వల్ల శారీరిక శ్రమ కూడా చాలావరకూ తగ్గిపోవటం వంటి అనేక కారణాల వల్ల ........ఈ రోజుల్లో మనుషుల్లో మధ్య వయసుకే కాళ్ళుకీళ్ళు నెప్పులు, నడుము నెప్పులవంటి లక్షణాలు చూస్తూనే ఉన్నాము కదా!

ఇక మాటలు రాని , తమ బాధ ఇదీ అని చెప్పుకోలేని మూగ జీవులు వాటి బాధలను ఎలా చెప్పుకుంటాయి ?

ఇంతగా పొల్యూట్ అయిపోయిన తరువాత జీవులు ఇక పరిణామం చెందటానికి కూడా అవకాశం ఉండదు. కొత్త మార్పులకు అనుగుణంగా పరిణామం చెందాలన్నా కొంతశక్తి కావాలి కదా !


విపరీతంగా పెరిగిపోయిన పొల్యూషన్ వంటి కారణాల వల్ల పిచ్చుకల వంటివి బాగా తగ్గిపోతున్నట్లు, మరి కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదం కూడా ఉందని కొందరు అంటున్నారు కదా !


ఇలాగే విజ్ఞానం పేరుతో విపరీతపోకడలు పోతూ ... జీవులన్నీ విలవిలలాడే స్థితికి వచ్చినప్పుడు .... దైవం చూస్తూ ఊరుకోరు కదా ! ఆ పరిస్థితి రాకుండా విజ్ఞులైనవారు మేలుకుంటే మంచిది..


ఇందులో చాలా విషయాలు పెద్దవాళ్ళు ,పిన్నలు, పండితులు, పామరులు ,... ద్వారా తెలుసుకున్నవి , పత్రికల్లో చదివినవేనండి. . అందరికి నా కృతజ్ఞతలు. అంతా దైవం దయ......దైవానికి కృతజ్ఞతలు.


No comments:

Post a Comment