koodali

Monday, November 24, 2025

కొన్ని సందేహాలు..కొన్ని ఆలోచనలు..

 

 నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

  కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

 ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా  చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

 ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

స్త్రీల అంటుముట్టు గురించి పబ్లిక్ గా మాట్లాడటం ఏమిటీ అంటున్నారు కొందరు.

 మరి స్త్రీల నెలసరి గురించి అలా చేయకూడదు..ఇలా చేయకూడదు..చేస్తే కష్టాలు వస్తాయని పబ్లిక్ గా కొందరు చెబుతున్నప్పుడు, ఆ సందేహాల గురించి పబ్లిక్ గా మాట్లాడితే తప్పేమిటి?

ఇంకా, చాలా విషయాల గురించి కూడా.. ఇలా చేయకూడదు..అలా చేయకూడదు..చేస్తే కష్టాలు వచ్చి మీద పడిపోతాయని చెబుతున్నారు. ఇవన్నీ విని, ఏం చేస్తే ఏం తప్పో? అనే పరిస్థితితో భయం, అయోమయం కలిగి, అనేక సందేహాలతో సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది.

  .............................

లోకకల్యాణం కొరకు పూజలు చేసే సందర్భాలలో.. లోకంలో అంతా బాగుండాలని పూజ చేస్తారు. 

ఎవరికి వారు పూజలు చేయించుకునే సందర్భాలలో.. అంటుముట్టు, మైలలో ఉన్నవారు కొన్ని రోజులు ప్రత్యేక పూజలు చేయడానికి దూరంగా ఉండాలంటారు.

నాకు ఏమనిపిస్తోందంటే,  అర్చన, అభిషేకం వంటి సందర్భాలలో..వేరే ఊరిలో ఉన్న కుటుంబసభ్యులందరి పేర్లు చెప్పటం సంగతి ఏమోకానీ..

అంతా బాగుండాలని, కుటుంబంలో అందరూ బాగుండాలని.. భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది. 

(వేరే ఊరిలో ఉన్నవారి  పరిస్థితి(అంటుముట్టు..) గురించిన సంగతులు తెలియనప్పుడు, ఇలా కూడా చేయవచ్చేమో?..అనిపించింది.)

.........................

  ఇంకొక విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా  గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

 మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

....................

గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

 ............................

వ్రాసినవాటిలో ఏమైనా తప్పులుంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 

Sunday, November 9, 2025

చక్కగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. ...

 

 సోషల్మీడియాలో చెప్పేవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయపడనవసరం లేదు.

 అందరూ అన్నింటినీ పాటించలేరు. కలియుగంలో దైవస్మరణ..దైవనామస్మరణతోనే తరించవచ్చని ప్రాచీనులే తెలియజేసారు.

 ఎవరి శక్తికి తగ్గట్లు వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు. 
 

దైవానికి మన విషయాలను చెప్పుకోవచ్చు. 

హిందూత్వంలో నిరాకారం, సాకారం..ఇలా ఇంకా ఎన్నో పద్ధతులున్నాయి. మన శక్తికి తగ్గట్లు చక్కగా హాయిగా దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

 సరైన విధంగా జీవించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

 ...................................

 marikonni vishayamulu..

 దైవ సృష్టి ...

 సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

ఆలోచనాశక్తి లేనిదే ఏదైనా పద్ధతిగా ఎలా ఏర్పడుతుంది..ఒకగదిలో నాలుగు చెక్కముక్కలనుపడేసి ఎంతకాలం ఉంచినా అవన్నీ కలసి కుర్చీలా అవవుకదా.

 
ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే   దైవము.. అని దైవాన్ని నమ్మే వారు(ఆస్తికులు) పిలుచుకుంటున్నారు.

ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

 అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.

ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది, నీరు మంచులానూ మారవచ్చు, ఆ మంచు మరల నీరుగానూ , ఆ నీరు ఆవిరిగానూ మారవచ్చు.

విశ్వాన్ని దైవం సృష్టించారు అంటే,  మరి దైవం  ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్న వేస్తారు భౌతికవాదులు. 

 మరి , పదార్ధం లేక శక్తి  మొదట ఎలా సృష్టించబడింది ? అనే ప్రశ్నకు భౌతికవాదులు ఏం సమాధానం  చెబుతారు ?

 పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
  
దైవం వద్ద   జీవులకు కలిగే  అన్ని సందేహాలకు  సమాధానాలు ఉంటాయి . 

అయితే,   విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలంటే   జీవులు  తగిన అర్హతలు సంపాదించుకోవాలి. 

 దైవకృపను పొందగలిగిన జీవులకు ఆ రహస్యాలు తెలిసే అవకాశం ఉందనిపిస్తుంది. ఉదా.. మోక్షాన్ని పొందిన జీవులకు  విషయాలు తెలుస్తాయి .  అనిపిస్తుంది . 

 విమానం ఎలా ఎగురుతుంది ? అని చిన్న పిల్లవాడు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళు ఎంత వివరించినా పిల్లవాడికి అర్ధం కాకపోవచ్చు. 

అదే పిల్లవాడు పెద్దవాడయి చదువుకుంటే ఆ విషయాలు సులభంగా బోధపడతాయి. 

విశ్వరహస్యాలు తెలుసుకోవాలన్నా తగిన  అర్హతలను సంపాదించుకోవాలి.
 
*******
సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
దైవము  ఎప్పుడూ ఉంటారు.
 ......................

oka link..

జీవులు పుట్టడం , కష్ట సుఖాలు అనుభవించటం అ...

 

పసిపిల్లల్ని చక్కగా చూసుకుంటే దైవానికి పూజ చేసినట్లే....



చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు. 
 
వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి  ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.

అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు. 
 
పిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.

 ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
 
కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే పెద్దవాళ్ళను నేను చూసాను.. 
 
పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే  బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడో?

చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు. 
 
కొందరు తల్లులు మాత్రం ఓపికగా మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
 .........................
 
పసిపిల్లల ముద్దుచేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. పిల్లలు పెద్దయితే ఆ ముద్దుచేష్టలు మిస్సవుతారు కదా..పసిపిల్లల బాగోగులు చక్కగా చూసుకుంటే దైవానికి సేవ చేసినట్లే. పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేసి కెరీర్, డబ్బు అంటూ తిరిగేవారు దురదృష్టవంతులు. 
 
ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు బోల్డన్ని పూజలు చేయకపోయినా ఫరవాలేదు.. పసిపిల్లలే దైవస్వరూపంగా భావించవచ్చు.
 
పసిపిల్లలకు అన్నం తినిపిస్తూ దైవానికి తినిపిస్తున్నట్లు అనుకోవాలి. పిల్లలకు సమర్యలు చేస్తూ దైవానికి సేవ చేసినట్లు అనుకోవాలి. పిల్లలను నిద్రపుచ్చుతూ దైవాన్ని జోకొడుతున్నట్లు అనుకోవాలి. పిల్లలకు ఏ పనులు చేసినా దైవంలా వారిని భావించవచ్చు.
 ........................................
 
పెద్దవాళ్లు తమ సమస్యలను చెప్పగలరు. పిల్లల విషయం అలా ఉండదు కదా..పసిపిల్లలకు సరిగ్గా మాటలు రావు కాబట్టి తమ సమస్యలను చెప్పలేరు. కొంచెం పెద్దయిన పిల్లలు తమ సమస్యలను చెప్పినా, అర్ధంచేసుకునే పేరెంట్స్ ఎందరు?

ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.

 ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్  ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు. 

పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.

ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట. 
 
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా? 

...........................
 
పసిపిల్లలు సున్నితంగా ఉంటారు. కొందరు పెద్దవాళ్లు పసిపిల్లలకు ఎక్కువ ముద్దులు పెడతారు. అలా చేయకూడదు. 
 
నేను యూట్యూబ్లో ఒకదగ్గర చూసాను, చిన్న పాపను పెద్దామె ఎత్తుకుంది. వాళ్ల బంధువు ఒకతను ఆ పాప బుగ్గ పైన గట్టిగా తన మెహాన్ని ఆనించి ముద్దుపెట్టాడు, పాప ఏడ్చింది. మగవాళ్ల గరుకైన మొహం పిల్లల బుగ్గలకు గుచ్చుకుంటాయి. అది కూడా తెలియకుండా ఎలా బతుకుతున్నారో?
 
కొందరు ఆడవాళ్లు కూడా పసిపిల్లల బుగ్గలు నలిపి, వాళ్ళు ఏడుస్తుంటే సంతోషపడతారు. సున్నితత్వం లేకుండా  రాక్షస మనస్తత్వం ఉన్నవారే ఇలా చేస్తారు.ఇలాంటివారి బారినుంచి పిల్లలను కాపాడాలి.
..........................
  
పిల్లల్ని పెంచే సమయం, ఓపిక లేదనుకున్నప్పుడు, డబ్బు సంపాదన, కెరీరే ముఖ్యం.. అనుకున్నప్పుడు పిల్లల్ని కనవద్దు. వాళ్ళను కష్టపెట్టవద్దు. పిల్లల్ని పెంచటం చాలా కష్టం.. అని కొందరు పెద్దవాళ్లు విసుక్కోవటం నేను గమనించాను.

 చిన్నపిల్లల్ని పెంచటానికే ఓపిక లేనప్పుడు..ఏది తప్పో, ఏది ఒప్పో తెలిసి కూడా, ఎందరో పెద్దవాళ్ళు జీవహింస చేస్తూ, ఎన్నో పాపాలు చేస్తూ బతుకుతున్నారు. వీళ్లందరిని దైవము ఎందుకు భరించాలి? ఈ పెద్దవాళ్ళను ఏం చేయాలి.
.....................
 
చంటిపిల్లల్ని క్రెచ్లలో వేసి పెద్దవాళ్లు ఉద్యోగం కోసం వెళ్తున్నారు. పిల్లల కొరకు డబ్బు సంపాదించటం కోసమే అలా చేస్తున్నామంటున్నారు కొందరు. 
 
తల్లి వద్ద ఆప్యాయంగా పెరగవలసిన ....మాటలు కూడా సరిగ్గారాని చంటి పిల్లల్ని  పగలు ఎక్కడో బయట ఉంచుతున్నారు. అక్కడ వారిని మంచిగా చూస్తున్నారో ? లేదో? తెలియదు. చంటి పిల్లలు ఏమీ చెప్పలేరు. 
 
పిల్లల్ని కొట్టిన కొన్ని సంఘటనల గురించి వార్తల ద్వారా తెలిసింది. కనీసం పిల్లలకు బాగా మాటలు వచ్చి తమ గురించి చెప్పేవరకయినా వారిని తల్లి దగ్గరుండి చూసుకోవాలి. 
 
పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఉద్యోగం రాకుంటే, సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేస్తూ అయినా ఉపాధి పొందవచ్చు. 
 
పిల్లల క్షేమం ముఖ్యం కదా.
 
link... 
ఆధునిక కాలం కన్నా ఆటవిక కాలం నయమేమో.. అనిపిస్తోం...
 
 

స్త్రీలు నెలసరి వాయిదా మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...మరికొన్ని..

 

ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు. 

చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు కూడా నెలసరి రాకుండా ఉంటున్నాయి.

ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల  కొన్నిసార్లు  ...పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి  ఉంటుంది.

 నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.

ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు. 

ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
..............................

 ఈ రోజుల్లో  చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..

 పూజలప్పుడు  కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు. 

అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు. 

కొన్ని పూజలు మాత్రం తిరిగి మొదటి నుంచి చెయ్యాలట...అంత ఓపిక లేనివాళ్లు పూజలు చేసే ముందే ఆలోచించుకుని మొదలుపెట్టడం మంచిది.

...........................

సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు నెలసరి వాయిదా టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.

నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

........................................... 

వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి. 

అన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.

 జన్మకొకసారి చేసుకునే వివాహంలో 
నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.

 వివాహం అంటే వధువుకు నెలసరి ఇబ్బంది లేకుండా ముహూర్తం నిర్ణయిస్తారు.

వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు. 

ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....

అలాంటప్పుడు ఏం చేయలం...వేడుకలను పెంచుకుని నెలసరి వాయిదా మందులు మింగటం కన్నా, కొన్ని వేడుకలను తగ్గించుకోవచ్చు.  

వివాహం సందర్భంగా కొన్ని వేడుకలు ఉంటాయి...అవన్నీ ఒకే రోజు ఉండవు.

 అయిదుసార్లు వేడుకలకు బదులు రెండు లేక మూడు సార్లు సరిపెట్టుకోవచ్చు.లేదా కొన్ని రోజులు తేడాతో ఫంక్షన్స్ జరుపుకోవచ్చు.

 నెలసరిలో ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం దోషం కాబట్టి, అందుకు తగినట్లు మొదటే జాగ్రత్తగా తేదీలను నిర్ణయించుకోవాలి.

 ................................

నాకు తెలిసిన ఒకమ్మాయి వివాహం సందర్భంగా నెలసరి ఆపటానికి ఒక వారం ముందు నుండి మందులు వేసుకుంటే, ఆ అమ్మాయికి ముఖానికి, పెదవులకు కొంచెం వాపు కూడా వచ్చింది.... 

ఏమీ కాదంటూ అలాగే మాత్రలు వేయించారు పెద్దవాళ్ళు. 

అలా మందులు వేసుకుని ....వివాహం రోజుకు కొద్దిగా గోధుమరంగు డిశ్చార్జ్ కనిపిస్తే నెలసరి అవునా? కాదో? అమ్మాయికి కూడా అర్ధం కాదు. 

కొందరికి మందులు వేసుకున్నా కూడా ఆగినట్లు ఉండదు.

.............................

 ప్రాచీనులు చెప్పినట్లు  ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళకూడదు.  

 మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..

కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు.  ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది 
..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు.

( ఇలా..అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాలకు తగ్గట్లు మార్చుకోవటం అంటారు.)

బయట దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు..పూజలు చేసుకున్నవాళ్ళు ఉంటారు. నెలసరిలో ఉన్నవాళ్ళు బయటకెళ్ళి తిరిగితే దోషం కాదా? మనకు అవసరం కాబట్టి బయటకు వెళ్తే దోషం ఉండదా?

 ..............................

 నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. చక్కగా చేసుకోవచ్చు.
.................................

 oka link...చేతనైతే ఈ సమస్యలను.........

oka link.. ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

........................

 mari konni vishayaalu....

 నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు.  కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

  కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

 ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా ( చండీ హోమము, రుద్రాభిషేకము, సత్యనారాయణస్వామి వారి వ్రతములు..ఇలా ఏ పూజ అయినా ..) చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

 ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.

.............................

కుటుంబసభ్యులందరూ పూజ చేస్తున్నట్లుగా  వారి పేర్లు చెప్పటం కాకుండా, అంతా బాగుండాలని....కుటుంబంలో అందరూ బాగుండాలని భావిస్తూ పూజ చేయిస్తున్నట్లుగా (పూజారి గారితో) పూజ చేయించవచ్చేమో? అనిపించింది.

 అంటే , వాళ్లు పూజ చేస్తున్నట్లుగా భావించటం కాకుండా, పూజారి గారి చేత పూజ చేయిస్తున్నట్లు అయితే అంటుముట్టు దోషాలు ఉండవేమో?..అని నాకు అనిపించింది. .

అయితే, అంటుముట్టు ఉన్నవారి గోత్రనామాలు చదివి పూజలు చేయవచ్చా? లేదా? అన్నది నాకు తెలియదు.

..........................

 నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

 మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

....................

గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

 

గ్రంధముల లోని ఒక కధ..కొన్ని అభిప్రాయాలు..


గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో.. 

 ఇవన్నీ సామాన్యులు  సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది. 

 చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన పరిస్థితి మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
..................................

రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని  ఒక దగ్గర విన్నాను. 

రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను. 

( ఒక్కవేటుతో రాజకుమారుడు చనిపోయినప్పుడు,  ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)

 తనను తాను చంపుకోవటం అంటే ఆత్మహత్య .  ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?

............................................

 రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది..... 

  రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు. 

రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. రాజకుమారుడు గతంలో చేసిన ఏమైనా పుణ్యాల వల్ల  ఇంకా..దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన  పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.

 బ్రాహ్మణుడు ఇంతకుముందు  చాలా  పూజలు, పుణ్యాలు చేసిఉంటారు కాబట్టి,  మొత్తానికి అతను స్వర్గానికి వెళ్ళటం జరిగిందని ఒక దగ్గర విన్నాను. 

దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది.

బ్రాహ్మణుడు చేసిన పూజలు, పుణ్యాల వల్ల పరిస్థితులు కలసి వచ్చి  బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
......................
  

 రికొన్ని ఆలోచనలు...........

ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.

(అయితే, కధను గమనిస్తే  ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు  తెలుస్తుంది.) 

 భార్య  వేరే వారి మోజులో పడితే  తప్పే.

........................... 

 ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన  కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?

.............................

ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.

 నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే,  ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో? 

(అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)

........................ 

జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.

 గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా,  భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి. 

భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.

.......................................

గృహస్తాశ్రమంలో ఉన్నప్పుడు భార్యాభర్త అన్యోన్యంగా లేకుంటే గొడవలు, అక్రమసంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

దైవాన్ని స్మరించుకోవటం, నిత్యపూజ చేయటం..వీటికి భార్యాభర్త సంసారానికి దూరంగా ఉండనవసరం లేదు. 

కొన్ని పండుగలు, కొన్నిపూజలు రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించి,  మిగతా రోజుల్లో  భార్యాభర్త అన్యోన్యంగా సంసారం చేయవచ్చని నా అభిప్రాయం.
...................................

 కధలలో మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.

వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
 

Friday, November 7, 2025

కొన్ని విషయాలు..

Friday, October 31, 2025

చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

 

 దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.

    కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

        నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

   చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

  పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

  అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
    ........................................................
       
    సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

   జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

   కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.

కొన్ని పరిహారాలను చేయటం కూడా కష్టమే. కొన్ని పరిహారాలను ఆచరించటం కంటే, కష్టాలను అనుభవించటం ద్వారా పాపక్షయం చేసుకోవటమే తేలికగా అనిపించవచ్చు.

పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
  .....................................................

        ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

    అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

    చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

    ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
 ..............................

కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

    ****************************
    రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

    పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

***************************

ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

    చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

     ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

     కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

    ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
 .................................

భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.    

 ................................................ 

దైవనామ స్మరణాన్ని, పూజలు చేయటాన్ని  మొదలుపెట్టి, అలా పూజలు  చేస్తూచేస్తూ..ఉండటం వల్ల  క్రమంగా   పాపాత్ములలో  మార్పు వచ్చి మంచిగా  పరివర్తన చెందుతారు.

* మందులు మనకు ఇష్టం ఉండి వేసుకున్నా, ఇష్టం లేక  మ్రింగినా అనారోగ్యాన్ని  పోగొడతాయి కదా! అలాగే ఏ కారణంతో దైవనామస్మరణాన్ని మొదలుపెట్టినా ఫలితం లభిస్తుంది. 

అయితే, దైవనామ స్మరణం చేసే వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు , నీతినిజాయితీలను బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి. కొందరికి  ఒక జన్మలో  మంచి మార్పు  కనిపిస్తే, మరి  కొందరిలో  కొన్ని జన్మలు పట్టవచ్చు. 

*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   
 
కొందరికి రోగం  త్వరగా  తగ్గుతుంది. కొందరికి ఆలస్యంగా  తగ్గుతుంది. మందులు  సరిగ్గా  వేసుకోకుండా, పధ్యం సరిగ్గా  పాటించని  వారికి  రోగం త్వరగా తగ్గకపోవచ్చు కూడా.
............................. 

 దైవాన్ని దృఢంగా నమ్మి శరణు పొందిన వారి విషయంలో దైవము, వారిని సరైన పద్ధతిలో జీవించేలా చేస్తారు.

అయితే, భక్తులం అని చెప్పుకునేవారికి కొందరికి అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది..తాను ఎన్నో పూజలు చేయటం వల్ల, తాను ఎలా ప్రవర్తించినా కూడా..దైవం కూడా తనకి లొంగక తప్పదు..అనే విధంగా అహంకారం ఉన్న వారి విషయంలో, వారు ఎన్ని పూజలు చేసినా కూడా గొప్పఫలితాలను పొందలేకపోవచ్చు. 

................................. 

    కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

    తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

    దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
    ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
    శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

(రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )

  శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

 అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

 దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
 దైవం  కాపాడుతారు.
    ......................

    గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి,  ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.

కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.

పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
...................................

మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు. 

అలాగే కొందరు,  
పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా,  తాము చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుతూ కూడా.....పాపాలు చేయకుండా మాత్రం మనస్సును నిగ్రహించుకోలేరు. 

అలాంటప్పుడు తమకు సరైనదారిలో జీవించేలా శక్తిని ఇవ్వమని దైవాన్ని దృఢంగా ప్రార్ధిస్తే దైవము కరుణించే అవకాశం ఉంటుంది.

...........................
 పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా...ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు. 

పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల....చేసేవారికి, సమాజానికి మంచిదే. 

అయితే, సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందలేకపోవచ్చు.

  ...................................
  ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

ఉదా..కొందరిని గమనిస్తే, వాళ్లకు  
జీవితంలో చాలా  డబ్బు ఉన్నాకూడా,  మనశ్శాంతి లేకుండా ఉంటుంది. 

చేసిన పుణ్యాలకు  ఫలితంగా డబ్బు ఉన్నాకూడా, చేసిన పాపాలకు ఫలితంగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. 
................................

 కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 
...................

ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు. 

ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు.. ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.
...........................

దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.
......................................

 అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..

link.... ఓం ..కొన్ని విషయములు..

 link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?