ఈ రోజుల్లో , చిన్నపిల్లల పట్ల కూడా అఘాయిత్యాలు జరుగుతున్న కొన్ని వార్తలను వింటున్నాము.
5 సంవత్సరాల పాప పట్ల 50 సంవత్సరాల పక్కింటి వ్యక్తి అసభ్య ప్రవర్తన, పాఠశాలలో చిన్నపాప పట్ల అసభ్య ప్రవర్తన..వంటి వార్తలు వింటుంటే, ఆధునిక కాలం కన్నా ఆటవిక కాలం నయమేమో.. అనిపిస్తోంది.
..........................
ఆర్ధిక అవసరాలు అంటూ, కంటిపాపలా పెంచుకోవలసిన పిల్లల్ని పరాయి వాళ్ళ దగ్గర వదిలి పనికి వెళ్తున్నారు కొందరు పెద్దవాళ్ళు.
.......................
ఉత్తరభారత దేశంలోని ఒక సెలెబ్రెటి కుమార్తె తాను చిన్నతనం నుండి లైంగిక వేధింపులకు గురయినట్లు తెలియజేసింది. వాళ్ళు తమ కుటుంబస్నేహితులని.. అయితే, ఈ విషయం తన పేరెంట్స్ కు తెలియదని చెప్పి ఆవేదన చెందింది.
.....................
ఎప్పుడయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి . ఇక, తల్లులు రాత్రి సమయంలో కూడా ఉద్యోగాలకు వెళ్తే, ఆడపిల్లలను బంధువుల దగ్గరో, ఇరుగుపొరుగు వారి దగ్గరో, పనివారి వద్దో వదిలి వెళ్తే ఎంతవరకూ రక్షణ ఉంటుందో ఎవరు చెప్పగలరు ?
మద్యం మత్తు కావచ్చు, అసభ్య చిత్రాల వీక్షణం కలిగించిన చిత్తచాంచల్యం కావచ్చు లేక మరి ఏదైనా కారణం కావచ్చు... ఎవరు, ఎప్పుడు, ఎలా.. ప్రవర్తిస్తారో ? ఎవరికి తెలుసు ?
తమకు ఆపద వస్తే చిన్నపిల్లలు ఏం చేయగలరు? ఎవరికి చెప్పుకోగలరు ?
....................
మాటలు కూడా రాని చిన్నపిల్లలు తమ బాధను చెప్పుకోలేరు.. ఉదా. వీపుపై చీమ కుడుతుంటే గుక్కపట్టి ఏడవటం తప్ప మాటలు రాని పిల్లలు ఏం చెప్పగలరు ?
పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తల్లే తెలుసుకోవలసి ఉంటుంది. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో కొన్నిసార్లు తల్లికి కూడా అర్ధం కాదు.
చిన్నపిల్లల పెంపకం అంటే సులువుకాదు. కొన్నిసార్లు తల్లికి కూడా విసుగొచ్చే అవకాశం ఉంది. ఇక బయట వాళ్ళు ఓపికగా ఎంతవరకూ చూడగలరో ?
చంటిపిల్లలను కొందరు ఆయాలు హింసిస్తున్న వీడియోలను చూస్తే గుండె జలదరిస్తుంది.
.........................
హాస్టల్స్లో పిల్లలకు వారి కష్టాలు వారికుంటాయి. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్లు, కొందరు జూనియర్లను లైంగికంగా వేధించిన సంఘటనలూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళూ ఉన్నారు.
హాస్టల్స్లో ర్యాగింగ్ గురించిన వ్రాసిన టపా లింక్ ఇక్కడ నొక్కి చదవవచ్చు. హాస్టల్లో ర్యాగింగ్ ..

CCTV: CRUEL Caretaker beaten up to 11- Months old boy ...
.........................
హాస్టల్స్లో పిల్లలకు వారి కష్టాలు వారికుంటాయి. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్లు, కొందరు జూనియర్లను లైంగికంగా వేధించిన సంఘటనలూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళూ ఉన్నారు.
హాస్టల్స్లో ర్యాగింగ్ గురించిన వ్రాసిన టపా లింక్ ఇక్కడ నొక్కి చదవవచ్చు. హాస్టల్లో ర్యాగింగ్ ..
No comments:
Post a Comment