koodali

Wednesday, March 4, 2015

హోలీ సందర్భంగా సహజసిద్ధమైన రంగులు వాడితే మంచిది..ఒక సంఘటన..

 
పాతకాలంలో హోలీ రంగులను సహజసిద్ధమైన పదార్ధాలతో తయారుచేసేవారట. ఉదా..మోదుగ పూలు,కరక్కాయ, పసుపు..వంటి వాటితో చేసేవారు. 

 ఈ రోజుల్లో హోలీ రంగులలో కెమికల్స్ కలుస్తున్నాయనీ, ఆ రంగులు పిల్లల కళ్లలో పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ వైద్యులు అంటున్నారు.  


అంతేకాక కొన్ని రంగులు ఎంత శుభ్రం చేసినా త్వరగా వదలవు. శుభ్రం చేయటానికి కిరోసిన్ వంటివీ వాడుతుంటారు..వీటితో రుద్దటం వలన చిన్నపిల్లల చర్మం కమిలి రంగు మారే ప్రమాదమూ ఉంది. 

...............

హోలీ అందరూ ఆడుతుంటే పిల్లలకూ వెళ్ళాలని సరదా ఉంటుంది. అలాంటప్పుడు వారిని వారించి ఇంట్లో కూర్చోపెడితే ఉసూరుమంటారు.


 అలా కాకుండా సహజసిద్ధమైన రంగులు తెప్పించి ఇస్తే వారికీ ఆనందంగా ఉంటుంది.

..............

మా పిల్లల చిన్నతనంలో మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ అందరూ హోలీ ఆడేవారు. అందరితో పాటూ మా పిల్లలు కూడా ఆడారు. 


ముందే వంటికి కొబ్బరినూనె వ్రాసుకుంటే తరువాత రంగులు శుభ్రం చేయటం తేలిక.. అని ప్రక్కవాళ్ళు చెబితే అలాగే వ్రాసి పిల్లలను పంపించాను. అయినా రంగులు ఒక పట్టాన వదలలేదు. గట్టిగా రుద్దితే రెండురోజులకు తగ్గాయి. 


ఇకమీదట , పిల్లలకు  కెమికల్  రంగులు పూయకుండా   జాగ్రత్రగా ఉండాలనుకున్నాను.

.................

 మరుసటి సంవత్సరం...  మా అపార్ట్మెంట్ వాళ్ళు రంగులు చేత్తో పట్టుకుని ప్రతి ఇంటికి వచ్చారు . మా ఇంటికి వచ్చి నాకు రంగులు పూసారు. 


పిల్లలకు  పూయబోతుంటే.. చిన్నపిల్లలు కదా ! ఎక్కువగా రంగులు వద్దండి,  చర్మం  కమిలిపోతుందని వారించాను.


నా మాట వినిపించుకోకుండా పిల్లలకు కూడా పూస్తామని  చేతుల నిండా రంగు పట్టుకుని వస్తుంటే, నేను గట్టిగా వద్దన్నాను. కొందరు సరే , అని ఊరుకున్నారు. 


 వెళ్తూ..వాళ్ళలో ఒకరిద్దరు  ఏమన్నారంటే..


 ఈమె  పిల్లలే  సుకుమారమా?... మనవి  దున్నపోతు చర్మాలా ? మనం రంగులు పూసుకోవటం లేదా ?.. అంటూ రఫ్ గా మాట్లాడారు. నాకు చాలా బాధ కలిగింది.


నేను,  మా పిల్లలకు చిన్నతనంలో  నలుగుపెట్టి స్నానం చేయించేదాన్ని.


అలాంటప్పుడు కెమికల్ రంగుల వల్ల చర్మానికి హాని కలుగుతుందని భయంతో అలా అన్నాను.  అందులో తప్పేమిటి ?

................

 అయితే, అందరూ సరదాగా ఆడుకుంటుంటే పిల్లలను ఆటలకు దూరం చేయకూడదు. సహజసిద్ధమైన రంగులను కొని ఇరుగుపొరుగు పిల్లలను కూడా పిలిచి ఆడిస్తే బాగుంటుంది.


 హోలీ రంగుల విషయంలో అలా అన్నాను కానీ, ఇరుగుపొరుగు పిల్లలు మా పిల్లలు కలిసి చాలాసేపు ఆడుకునేవారు. 


పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటలూ అంతే ముఖ్యమని నా అభిప్రాయం. 


2 comments:

  1. కెమికల్ రంగులు వాడొద్దని చెబుతున్నా విననివారినేమటారు?

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కెమికల్స్ కలిసిన నీరు భూమిలో ఇంకటం మంచిది కాదు. కెమికల్స్ కలిసిన నీరు కాలువలలో, నదులలో కలిస్తే నీరు కూడా పొల్యూట్ అవుతుంది.

    వాతావరణం కలుషితం అయితే, ఆ చెడు ఫలితాన్ని.. కలుషితం చేసిన వారే కాకుండా ..కలుషితం చేయని వారు కూడా భరించవలసి వస్తోంది.

    ఎంత చెప్పినా వినిపించుకోకుండా వాతావరణాన్ని కలుషితం చేసేవారిని ఏమి అన్నా తప్పులేదండి.

    ReplyDelete