కొన్ని సంవత్సరాల క్రిందట , కేజీ బేసిన్లో పెట్రోల్, సహజవాయువు వంటి ఇంధన వనరులు ఉన్నాయని తెలిసినప్పుడు....
ఇక, తమ ప్రాంతాలు అభివృద్ధి లో ఎక్కడికో వెళ్లి పోతాయని అక్కడి వాళ్లు కలలు కన్నారు .. అయితే, ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది .
కొన్ని చోట్ల పొలాల్లో నుంచి గ్యాస్ పైపులైన్లు వేయటం వంటి .. ఎన్నో సమస్యలు ఉన్నాయి .
ఇంధనం విషయంలో చూస్తే , స్థానిక అవసరాల కోసం కొంత ఇంధనాన్ని వినియోగించినా , ఎక్కువ భాగం ఇతరప్రాంతాలకు ( అంటే ఇతర రాష్ట్రాలకు.. ) తరలిపోతోంది.
ఇంధనం వెలికితీత ప్రక్రియలో వచ్చే దుమ్ము, ధూళి..వగైరా కాలుష్యం మాత్రం స్థానికులకు మిగులుతోంది.
మరికొన్ని సమస్యలూ వచ్చాయి. ఉదా..ఆ మధ్య జరిగిన ఒక గ్యాస్ పైపు లైన్ ప్రమాదంలో కొందరు చనిపోవటం ఎంతో బాధాకరమైన విషయం.
ఇలాంటి పరిస్థితిలో .. ఎప్పుడు , ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలకు భయంగానే ఉంటుంది.
...........................
ఇంధనం వెలికితీత ప్రక్రియ వల్ల కలిగే కాలుష్యం స్థానికులకు ఎంతో సమస్యగా ఉంటుంది .
ఇదిలా ఉంటే, కృష్ణా - గోదావరి ప్రాంతంలో అపారమైన బొగ్గు..నిక్షేపాలున్నాయని ఎవరో కనిపెట్టారట. ఇక ముందుముందు ఏం జరుగుతుందో ?
.....................
విచ్చలవిడి వాడకాల వల్ల పెట్రోల్, సహజవాయువు వంటి ఇంధన వసరులు త్వరగా తరిగిపోతున్నాయంటున్నారు.
ఇంధన అవసరాల కోసం సోలార్ ఎనర్జీ వంటి వాటిని వాడితే మంచిది. సూర్యరశ్మి తక్కువగా ఉండే దేశాల వాళ్ళు కూడా సోలార్ ఎనర్జీని వాడటానికి ప్రయత్నిస్తుంటే , సూర్యరశ్మి ఎక్కువగా లభించే మనదేశంలో .. ధర్మల్ , అణు విద్యుత్...వంటి వాటికోసం తాపత్రయపడటమేమిటో అర్ధం కాదు.
...................
సోలార్ ఎనర్జీ దండిగా లభించినా కూడా కొంత లిమిట్ పాటించాలి.
విద్యుత్ బాగా లభిస్తుందని కదా ! అని అదేపనిగా వస్తువులను తయారుచేసి పడేస్తే ఖనిజ వనరులు త్వరగా తరిగిపోతాయి.
విచ్చలవిడి పారిశ్రామీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యమూ ఎక్కువవుతుంది.
..............
సహజవనరులను విచక్షణతో, అవసరమైనంతవరకే పొదుపుగా, ఒక పద్ధతిగా వినియోగించుకోవాలి.
.....................
పేదరికం తగ్గి ఆర్ధికాభివృద్ధి జరగాలంటే సహజవనరులను విచ్చవిడిగా తవ్వేసి వాడుకోవటం మార్గం కాదు.
సమాజంలో సంపద కొంతమంది వద్దే పోగుపడి ఉంది. నల్లడబ్బు , అవినీతి వంటి వాటిని నిర్మూలిస్తే , ఆర్ధిక అసమానతలు తగ్గి .. పేదరికం గణనీయంగా తగ్గుతుంది.
...........................
ప్రకృతి పర్యావరణ రక్షణ అంటే చాలామంది తేలిగ్గా భావిస్తారు. అదొక సమస్య కాదంటారు.
ఆధునిక అవసరాల కోసం సహజవనరులను విపరీతంగా వాడుతుంటారు. తద్వారా కాలుష్యం పెరిగి గ్లోబల్ వార్మింగ్ పెంచేస్తారు.
ఇప్పుడు చూస్తున్నాము కదా ! అతివృష్టి లేకపోతే అనావృష్టి.
సరిగ్గా వర్షాలు పడి చాలాకాలమైంది. పంటలు ఎండిపోతున్నాయి.
విదేశాల్లో కూడా ప్రకృతి సమతుల్యత కోల్పోయి విపరీతమైన మంచు తుఫాన్లు వస్తున్నాయి.
ప్రకృతిని నిర్లక్షం చేస్తే మానవమనుగడకే ప్రమాదమని గ్రహిస్తే మంచిది.

No comments:
Post a Comment