ఈ రోజుల్లో అనేక కారణాల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య ప్రపంచమంతటా ఉంది. ఉద్యోగం వచ్చిన వాళ్ళలో కూడా చాలామందికి ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి.
...............
నాకు తెలిసిన ఒక సంఘటన వ్రాస్తాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుండి పట్టా పుచ్చుకున్న విద్యార్ధులలో కొందరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒక సంవత్సరం ఎదురుచూపుల తర్వాత వారికి విధులలో చేరే అవకాశం లభించింది.
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం లభించని యువకుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. నీ ఫ్రెండ్స్ కు ఉద్యోగం వచ్చింది. నీకు ఇంకా రాలేదేమని ప్రశ్నించే ఇంట్లో వాళ్ళకు ఏమని జవాబు చెప్పాలో తెలియక,
ఏరా ! ఇంకా ఉద్యోగం రాలేదా..అని ప్రశ్నించే శ్రేయోభిలాషుల..? పరామర్శలను తట్టుకోలేక నిరుద్యోగ యువకులు నలిగిపోతుంటారు.
ఇలాంటి నిరుద్యోగులు కొందరు , ఉద్యోగం లభించిన స్నేహితులను తమకు కొంచెం డబ్బు సాయం చేయమని అడుగుతుంటారు .
డబ్బు సాయం చేయమని ఇతరులను అడిగే పరిస్థితి రావటం దయనీయం. ఇలాంటి నిరుద్యోగుల పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి.
............
కొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వేల ఎకరాలను ప్రభుత్వాలను అడిగి తీసుకుంటారు. కాని వాళ్ళు కల్పించేది కొద్ది సంఖ్యలో ఉద్యోగాలు మాత్రమే.
ఉదా..ఒక కంపెనీ తమకు కొన్ని వేల ఎకరాలు ఇప్పిస్తే 500 మందికి ఉద్యోగం ఇస్తామని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతోటి ఉపాధికి అన్ని ఎకరాలు అవసరమా?
..........
నిరుద్యోగం పెరగటానికి మితిమీరిన యాంత్రీకరణా ఒక కారణమే. పాతకాలంలో పదిమంది పదిరోజుల్లో చేసే పనిని ఈ రోజుల్లో ఒక్క యంత్రం ఒక్క గంటలో చేసేస్తోంది. ఇక మనుషులు చేయటానికి పనులు ఎక్కడుంటాయి ?
యాంత్రీకరణ అవసరమే కానీ , నిరుద్యోగ సమస్య పెరిగేంతగా యాంత్రీకరణ ఉండకూడదు.
.................
ఉద్యోగస్తులను తక్కువగా నియమించి యంత్రాలతో పనులు చేయించుకుంటున్నారు యజమానులు. యంత్రాలు అయితే జీతాలు పెంచమని అడగవు కదా !
ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడుగుతుంటారు. వేల రూపాయలు జీతాలు ఇచ్చేవారు ఉద్యోగస్తులను ఊరికే కూర్చోబెడతారా ? ఇద్దరు చేసే పనిని ఒక్కరితో చేయిస్తారు.
ఉద్యోగస్తులు జీతం పెరుగుతుందని అనుకుంటున్నారే కానీ, విరగబడి పనిచేయటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అర్ధం చేసుకోవటం లేదు.
ఒకే వ్యక్తికి నెలకు 70 వేలు ఇచ్చే బదులు నెలకు 40 వేలు ఇచ్చి ఇద్దరు వ్యక్తులను పనిలోకి తీసుకుంటే ఎక్కువమందికి ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.
ఒక్కరే ఎక్కువ పని చేస్తే అలసట వల్ల శ్రద్ధగా చేయలేరు. పనిలో నాణ్యత ఉండదు. పనిలో నాణ్యత లేకుంటే కంపెనీకీ నష్టమే కదా !
అదేపని ఇద్దరు చేస్తే అలసట లేకుండా శ్రద్ధగా చేయగలరు. అనారోగ్యాలూ రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే కదా ఏ పనైనా చేయగలరు.
....................
ఇంకో కారణం ఏమిటంటే , పాతకాలంలో స్త్రీలు ఇంటిపనులు చూసుకుంటే పురుషులు సంపాదన వ్యవహారాలు చూసుకునేవారు.
ఇప్పుడు స్త్రీలు అన్నిరంగాల్లో పురుషులకు పోటీ వస్తున్నారు. అసలే యాంత్రీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గిన ఈ రోజుల్లో యువకుల్లో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది.
స్త్రీలు ఉద్యోగం చేయకపోయినా వాళ్ళను ఎవ్వరూ తప్పు పట్టరు. అదే పురుషులు ఉద్యోగం లేకుండా ఇంటిపట్టున ఉంటే అందరూ సవాలక్ష ప్రశ్నలతో వేధిస్తారు. దాంతో వాళ్ళలో నిరాశా, నిస్పృహలు పెరుగుతాయి.
కొందరు మానసికంగా క్రుంగిపోతే, మరి కొందరిలో నేర ప్రవృత్తి పెరిగే అవకాశమూ ఉంది.( తమకు ఉపాధి కల్పించలేని సమాజంపై కోపంతో..)
...................
ఆర్ధికపరిస్థితి బాగాఉన్న మహిళలు కూడా ఉద్యోగాల కోసం పోటీపడటం వల్ల ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేని మరికొందరికి ఉద్యోగఅవకాశాలు తగ్గే అవకాశం ఉంది.
చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ లింకులు కూడా చదవగలరు.
No comments:
Post a Comment